కొన్ని పాటలు విన సొంపైనా , జనాదరణకి నోచుకోవు… ఉదాహరణకి తెలుగు లో “నీరాజనం” చిత్రం సంగీత పరంగా బాగున్నా హిట్ కాలేదు.కారణాలనేకం… ఇవాళ నేను ఉదహరించే అలాంటి ఓ పాటకి కారణం బహుశా… ఆ చిత్రం కథా బలం లేక పోవటం, అగ్ర తారాగణం లేకపోవటం కావచ్చు… ఆ పాట “సాయా” అన్న ఓ హిందీ చిత్రం లోనిది. జాన్ అబ్రహం. తారా శర్మ ప్రధాన భూమికలు పోషించారు.
ఈ చిత్రం లోని “ఆయీ జో తేరి యాద్.. దిల్ నే కీ దిల్ సే బాత్..” అన్న పాట ఎంతో బాగుంటుంది. ఈ పాట వివిధ మూడ్స్ లో వస్తుంది. అన్ని versions బాగుంటాయి. pathos లో ఈ పాటని సోను నిగమ్ పాడితే… యుగళ గీతాన్ని ఉదిత్, ఆల్కా యాగ్నిక్ పాడారు.
సంగీతం కీరవాణి, అనూ మాలిక్ అని ఉంది ఈ చిత్రానికి. ఈ పాటని ఎవరు కంపోస్ చేసారో తెలియదు. చిత్రం కథ కొంచెం horror shades లో ఉంటుంది.. అలాంటి చిత్రానికి ఇలాంటి మెలోడి నప్పక పోవటం వలన, ఈ పాట అంతగా హిట్ కాక పోయుండ వచ్చు.. ఇది కూడా ఇంకో కారణం అనుకుంటాను.
ఈ పాట హ్యాపీ వెర్షన్ ఇక్కడ వినండి
Sad version ఇక్కడ చూడండి.
Advertisements
‘saayaa’ lacks something అనిపిస్తుందండీ నాకు. తెలుగు పాటలా అనిపించే ఈ ట్యూన్ వినగానే ఇది కీరవాణిదని తెలిసిపోవాలికదండి. “శుభ ముహుర్తం”(కీరవాణిదే) అనే తెలుగు సినిమాలో “చేరుకో ఇలా” పాట ట్యూన్ ఇది. క్రింద లింక్ లో ఈ పాట వినవచ్చు మీరు:
http://www.musicindiaonline.com/album/28-Telugu_Movie_Songs/30991-Shubha_Muhurtham__1994_/#/album/28-Telugu_Movie_Songs/30991-Shubha_Muhurtham__1994_/