ఈ ఫోటో చూస్తే, తమన్నాకు, మా ఫ్రెండ్సుకున్న సారూప్యత తెలుస్తుంది

ఇదేమి పోలిక అనుకుంటున్నారా…మరేం లేదు…. తమన్నా “హ్యాపీ డేస్ ” చిత్రం లో ” ఓ మై ఫ్రెండ్… పాద మేటు పోతున్నా ” అన్న పాటకి ఎలాగైతే  నృత్యం చేసిందో… మా మిత్ర బృందం కూడా,  గత నెల అందరం కలిసినపుడు.. అదే పాటకు డాన్సు చేసారు. ‘ఓస్ ఇంతేనా’ అంటారా? తమన్నా పై పాటని కొరియోగ్రాఫ్ చేసిన స్వర్ణ లతే మా వాళ్ళ చేత కూడా డాన్సు చేయించింది…అదీ విశేషం. ఎందరో తారల కు నృత్య రీతులు నేర్పిన స్వర్ణ,  మా ఫ్రెండ్స్ చేత చేయించిన ఆ నృత్యం ఎవరూ మరువలేనిది. 

కింది చిత్రం  చూడండి.. ఎంతో హాపీ గా మా సూరి బావ నృత్యం చేస్తున్నాడో  … పక్కనే , మా ఇంకో క్లాస్మేట్ ప్రసన్న వాళ్ళ పాప ఛి. సాయి కాంక్షిత , మా ఇతర ఫ్రెండ్స్ కలై వాణి, శశి  , సబిత ఎంత ఆనందంగా స్వర్ణ చేయిస్తున్న నృత్యం లో పాలు పంచుకుంటున్నారో… పక్కనే ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్న మా గురువులు, రామకృష్ణ, చార్లీ బాబు, పుష్ప రాజ్ గార్లు… 

నలభైలలో ఉన్నా, మళ్ళీ అన్నీ మరిచి ఆనందంగా ఆనాటి బాల్యం లోకి వెళ్ళిపోయిన వారిని చూస్తే, ఎంత ఆనందంగా అనిపించిందో.. మాలిన్యం  లేదు.. స్వార్థం లేదు.. దుఖం లేదు… ఉన్నదొక్కటే… స్నేహం…  ఆ స్నేహమే అన్ని దూరాలను, హద్దులను, అంతరాలను చెరిపేసింది… అందరి చేతా నాట్యం చేయించింది..  అలాంటి అనుభూతిని పొందితే వచ్చే ఆనందం వెల కట్టలేనిది.. మేమంతా చప్పట్లు కొడుతుంటే… చాలా ఉల్లాసంగా మా ఫ్రెండ్స్ డాన్సు చేసారు. మా సూరి బావ బేసిక్ గా ఎన్. టీ. ఆర్ ఫ్యాన్ ఆయినా, తను వేసిన స్టెప్పులు మాత్రం అలనాటి ఏ. యెన్. ఆర్ ని తలపించాయి.. ‘మా డాన్సులు చూసి, స్వర్ణ డాన్సు మరిచిపోతుందేమో’ అని మేమంతా ఆట పట్టిస్తుంటే… అక్కడ నవ్వులు వెల్లి విరిశాయి..


ఈ ఆనందాలు.. డైరీ లో చెరగని పేజీలు ..

ఈ ఆనందాలు.. డైరీ లో చెరగని పేజీలు ..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

4 Responses to ఈ ఫోటో చూస్తే, తమన్నాకు, మా ఫ్రెండ్సుకున్న సారూప్యత తెలుస్తుంది

  1. hai friends the memorablemoments of 3rd gettogether of our school friends on 14.8.2011at bhaskarahotel chitoor extends our lives for more than 2decades
    m.

  2. very nice.. keep it up..

  3. D S KRISHNAN says:

    very fine,rich,cute colourful pictures of suri,swarna,sasi,kalaivani, sabita

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s