అప్పటి పత్రికలలోని పోటీలు

మన స్కూల్ రోజుల్లో బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ ప్రతి నెలా చదివే వాళ్ళం. అప్పుడప్పుడూ బాలానందం, బుజ్జాయి లాంటివి చదివినా, మొదటి మూడు వోట్లు ఆ మూడు పత్రికలకే వెళ్ళేవి. కథలతో పాటు, ఇందులో కొన్ని పోటీలు ఉండేవి. వాటికి 10 నుండి 20 రూపాయల వరకూ బహుమతి కూడా వుండేది..బొమ్మరిల్లు ఇలాంటి బహుమతుల విషయంలో ముందంజలో ఉండేది. కొంత కాలం.. పజిల్స్ బుక్లెట్  రూపంలో అనుబంధంగా ఇచ్చేవాళ్ళు. అందులో 12 పజిల్స్ ఉండేవి. అన్నీ కరెక్ట్  చేసిన వారికి, లేకుంటే ఒక మిస్టేక్ చేసిన వారికి ఇలా బహుమతులు ఉండేవి.. ఎక్కువ మంది విజేతలుంటే బహుమతిని పంచేవారు.. లేకుంటే లాటరీ లో కొంతమందిని విజేతలుగా ఎంపిక చేసి మిగతా వాళ్ళ పేర్లు ప్రచురించి సంతృప్తి పరిచే వారు. ఈ పజిల్స్ రక రకాలుగా ఉండేవి.. వాటిని సాల్వ్ చేయాలంటే చాల ఆసక్తి , కాని కొన్నే సాల్వ్ చేయగలిగే వాళ్ళం.. నాకు గుర్తున్న ఒక పజిల్…”ఒక సినీ తారని మీరెంత వరకూ చదివారు అంటే, తను తాగుతున్న టీ కప్పు బోర్లించి ఇంత వరకూ అన్నది.. తనెంత వరకు చదువుకున్నట్టు?” అని ఓ పజిల్… ఎంత ఆలోచించినా కొరుకుడు పడలేదు.. తరవాయి సంచికలో ఆ పజిల్ సమాధానం ఏంటంటే .. ” CUP ని తిరగేసింది కాబట్టి …PUC (అప్పట్లో ఇంటర్ ని Preuniversity సర్టిఫికేట్ అనేవారు) అన్నది జవాబు “… ఇది చూసాక “ఓస్.. ఈ మాత్రం తెలియక పోయిందే” అని చింతించా.. అలాగే కొన్ని ఇంగ్లీష్ అక్షరాలను ఏదైనా ఒక బొమ్మలాగా పేర్చి, అందులో దాగున్న పదాన్ని  గుర్తించమనేవారు. ఒకే విధంగా ఉన్న రెండు బొమ్మల మధ్య వ్యత్యాసాలు కనిపెట్టడం ఇంకో పజిల్.. ఇలా ఎన్నో…

బాలమిత్ర లో ఎక్కువ పోటీలు  ఉండేవి కావు. మూడు బొమ్మలిచ్చి.. వాటికి అనుగుణంగా కథని రాసి పంపమనే వారు. ఉత్తమ రచనకి బహుమతి ఇచ్చేవారు.
చందమామ లో స్టాండర్డ్ గా ఉండే పోటీ, picture caption competition . రెండు ఫోటోలిచ్చి వాటికి ఆసక్తి కరమైన వ్యాఖ్య రాయమనే వారు.. చూడటానికి సింపుల్ అనిపించినా , ఇది చాల కష్టంగా ఉండేది.  నాకు బాగా గుర్తున్న ఒక వ్యాఖ్య… రెండు ఫోటోలలో ఒక దానిలో రోడ్డు పై అడ్డ దిడ్డంగా వెళ్తున్న పిల్లలు.. ఇంకో ఫోటోలో ఒక ట్రాఫిక్ కాని స్టేబుల్  ఉంటారు. ఆ ఫోటోలకు  బహుమతి పొందిన వ్యాఖ్య … మొదటి ఫోటోకి… “సరిగా పదని..” అని అడ్డ దిడ్డంగా వెళ్తున్న పిల్లలకు అన్వయిస్తే  ,  ఇంకో ఫోటోకి “సరిగా పదమని” అని ట్రాఫిక్ పోలిస్ చెపుతున్నట్లుగా పోలుస్తూ…ఎవరో పంపారు. వారి సృజనాత్మకతని  మెచ్చుకోకుండా ఉండలేక పోయాను.

ఇలాంటి పోటీలలో ఎన్నడూ బహుమతి రాలేదు… రామచంద్ర కి మాత్రం ఒక పోటీలో బహుమతి వచ్చింది.. తన పేరు ఆ పత్రిక లో చూసి అందరం ఎంతో సంతోషించాం.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to అప్పటి పత్రికలలోని పోటీలు

  1. Our Ramachandra is deserved to get a prize in those competions.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s