ఆ ఆటో డ్రైవర్లో ‘మేనేజ్మెంట్ గురు’ కనిపించిన ఆ క్షణం …

ఉదయం సమయం .. ఆఫీస్ కెళ్ళే జనాలతో బాగా రద్దీ గా ఉంది. నేను  shared ఆటో లో వెళ్తున్నాను గమ్య స్థానానికి. ఆటోలో ఐదుగురు ఉన్నాం.. రయ్యిన వెళ్తోంది ఆటో. ఇంతలో ఓ జంక్షన్ వచ్చింది. అక్కడ నుండి రెండు దార్లు ఉన్నాయి.. ఒకటి నేను వెళ్ళాల్సిన రూట్ అయితే, ఇంకోటి వేరే చోటికి.ఇంకో ఇద్దరికీ ఖాళీ ఉంది. జంక్షన్ లో ఆరుగురున్న  ఓ ఫ్యామిలీ మా ఆటోని ఆపింది. వాళ్ళు వెళ్ళాల్సింది రెండో రూట్ లో. ఆటో వాడు కాసేపు సంశయించి, కుదరదు అని చెప్పి ముందు కెళ్ళాడు. డ్రైవర్ ని మెల్లిగా కదిలించాను… దేని కోసం సంశయించావు    అని.

తను చెప్పాడు…“వాళ్ళను ఎక్కించుకోవాలంటే, మిమ్మల్ని ఇక్కడే దింపేయాలి. మిమ్మల్ని  ఇక్కడే  దించేస్తే  నాకు మీరు ఐదుగురూ   ఇచ్చే  అరవై  రూపాయలతో పాటు, వారు ఆరుగురు ఇచ్చే ముప్పై రూపాయలతో సహా  మొత్తం  నాకు వచ్చేది తొంభై రూపాయలు. అదే మిమ్మల్ని ఈ రూట్ లో చివరి వరకూ తీసుకెళ్తే, నాకు మీరు ఐదుగురూ ఇచ్చేది వంద  రూపాయలు. అందుకే వాళ్ళను ఎక్కించుకోలేదు” అన్నాడు.

అతడి లో ఒక్క సారిగా  ‘మేనేజ్మెంట్ గురు’ సాక్షాత్కరించాడు.  మా అందరినీ ఎక్కించుకుని, దారి పొడవునా ఎవరైనా ఎక్కే వారున్నారేమో గమనిస్తూ…. అడ్డ దిడ్డంగా వెళ్తున్న వాహనాలను, అంతే అడ్డ దిడ్డంగా దాటుకుంటూ, అలవోకగా ఈ management decision ని   క్షణాలలో  ఎంత సులువుగా తీసుకోగలిగాడో కదా అని, అతడిని ఆరాధనా పూర్వకంగా చూసాను.. నేను మనసులో అతడు వేసిన లెక్కను చేయటం మొదలెట్టాను. వెంటనే మనసులో లెక్కలు కట్టి, రెండో రూట్ లో కనీసం ఎనిమిది  మంది వుంటే, అతడు మమ్మల్ని డ్రాప్ చేస్తే వచ్చే అరవై రూపాయలతో పాటు, రెండో రూట్ లో వచ్చే నలభై రూపాయలు కలిపితే వంద వచ్చేవి. అంటే రెండో రూట్ లో break even పాయింట్ ఎనిమిది మంది ప్రయాణికులన్న  మాట… యురేకా అనుకుని..”మరి ఎనిమిది కంటే ఎక్కువ మంది వుంటే మమ్మల్ని ఇక్కడే వదిలేసి, వాళ్ళను ఎక్కించుకునే వాడివా.?” అని అడిగాను. నోట్లో పాన్ పరాగ్ తో పాతాళ గంగలా ప్రవహిస్తున్న లాలాజలాన్ని రోడ్డు మీదకి కళ్ళాపి చల్లుతూ….”లేదు సాబ్.. మిమ్మల్ని దించేస్తే నాకు బద్నాం… రేపు… మీరు ఇదే రూట్లో నన్ను చూసి ఎక్కరు కదా.. నాకు వచ్చే ఆ కాస్తా extra డబ్బు కంటే మీ లాంటి కస్టమర్స్ ముఖ్యం ..” అన్నాడు. ‘కాస్తా’ అన్న పదం వొత్తి పలుకుతూ . మళ్లీ అదే ఆరాధనా భావంతో చూసా అతడిని… ఎంత బాగా .CRM (Customer Relations Management) తనదైన శైలి లో చెప్పాడు కదా అని..

ఒకే రోజు రెండు మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ ని నేర్పించిన ఆ మేనేజ్మెంట్ గురు మాత్రం స్థిత ప్రజ్ఞుడిలా రోడ్డు వైపు ప్రయాణీకుల కోసం చూస్తూ, బండి నడుపుతున్నాడు నిర్వికారంగా..

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

6 Responses to ఆ ఆటో డ్రైవర్లో ‘మేనేజ్మెంట్ గురు’ కనిపించిన ఆ క్షణం …

 1. నిబద్దత ఉన్న వాళ్ళు తాత్కాలిక లాభాల కోసం ప్రాకులాడరు. బాగుంది..రామక్రిష్ణ గారు. ఇలాటివారిని చూసి అవినీతిపరులు బుద్దితెచ్చుకుంటే బాగుండును. అయినా ఆటో ల ప్రయాణం ప్రమాదభరితం. కానీ సమయానికి వెళతామని యెక్కడం తప్పదు.ఆర్.టీ.సి వారిని నమ్మలేం కదా.. అందుకే ఈ ఆటో ప్రయాణాలేమో !

 2. మనచుట్టూ జరిగే ఇటువంటి అనేకానేక సంఘటనలను పుస్తక్లాల్లోకి ఎక్కిమ్చేవాల్లని మనం “మానేజిమెంటు గురు” లుగా పరిగణిస్తూ ఉంటాము. వాళ్ళకున్న టాలెంటు అది.

  ఎం బి ఎ చదవని ధీరూభాయి అంబానీ ఒక వ్యాపార సౌధాన్ని కట్టగాలిగాడు, ఆయన కొడుకులు విదేశాల్లో చదువుకు వచ్చి ఆ సౌధాన్ని రెండు ముక్కలు చేసుకుని సంతోషిస్తున్నారు!

 3. Arjun1560 says:

  Really poor peoples chadavani extra knowledge kalavaru. Chadivina varu paper & pen lekunda problem ni cheyaleru. But chadavani varu brain thoo problem chesestaru.
  That is poor people .

 4. Ramakrishna,hats off2u for ur keen observation of auto driver’s management technic&disclosing2 us.

 5. srinivasaraov,khammam says:

  thanq for sharing

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s