ఈ రోజు గుర్తొస్తున్నపాట

ఈ రోజు మహాత్ముడి జయంతితో పాటు, ఇంకో మహనీయుడు లాల్ బహదూర్  శాస్త్రి గారి జయంతి కూడా.. ఆ చిరస్మరణీయులను   శ్లాఘిస్తూ, సంస్మరిస్తూ ఈ పాట మీతో పంచుకుంటున్నాను.
 “మానవుడు దానవుడు” అనే చిత్రంలోనిదా పాట. శోభన్ బాబు, శారద, కృష్ణ కుమారి ల పై చిత్రీకరించిన పాట.. బాలు గారి గాత్రం లో “అణువు అణువున వెలసిన దేవా.. కనువెలుగై మము నడిపింప రావా..” అన్న పల్లవి కల పాట వీనులవిందుగా వుంటుంది. వీణ ఎక్కువగా వినిపించే ఈ పాట ఎంతో మెలోడియస్ గా ఉండటమే కాదు .. ఈ పాటలోని భావం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది.. మత సామరస్యాన్ని, స్వాతంత్ర్య  వీరుల త్యాగ నిరతిని, సమాజానికి అనన్యమైన సేవలందించే వైద్యులను (ఈ కాలం లో కూడా  అంకిత భావంతో ఉన్న వైద్యులెక్కడ ఉన్నారండీ అంటారా… నేను అటువంటి వ్యక్త్తులను కొందరిని ఎంతో సమీపం నుండి చూస్తున్నాను… అందుకే అలాంటి “కొన ఊపిరులకు ఊపిరులూదే” వైద్యులకు నమస్కరిస్తున్నాను) కీర్తిస్తూ సాగుతుందీ పాట.
ఈ పాటలో ఇంకో విశేషమేంటంటే  ఈ రోజు మనం జయంత్యుత్సవం జరుపుకుంటున్న  ఆ ఇరువురు మహనీయులను ఈ పాటలో చూడొచ్చు. పాట  వింటుంటే, మన వూళ్ళో లక్ష్మి టాకీసు లో ఈ చిత్రం చూసిన నాటి రోజులు గుర్తొస్తున్నాయి ..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

3 Responses to ఈ రోజు గుర్తొస్తున్నపాట

  1. R. SURESH says:

    Wish U a “HAPPY BIRTHDAY” dear!. May GOD bless U and UR family.
    Enjoy the life given by GOD. No more advice please!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s