నిత్య జీవితంలో సినిమాలకి తీసిపోని హాస్యం

గమనించాలే గాని… నిజ జీవితం లో కూడా సినిమాలలో కనపించే  హాస్యానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో తమాషా సంఘటనలు జరుగుతుంటాయి.. నాకు తెలిసిన అలాంటి కొన్ని సంఘటనలు..

ఓ సారి.. బెంగళూరులో ఒక కాన్ఫెరెన్స్ జరుగుతోంది. స్టేజ్ పైన ఉన్న వక్త ఎల్. సి. డీ ప్రొజెక్షన్ ద్వారా పవర్ పాయింట్ స్లైడ్స్ చూపిస్తున్నారు. ఆ ఎల్. సి. డీ లోని లాంప్ పాతబడడం వలన స్లైడ్స్ కాంతివంతంగా కనపడడం లేదు. స్లైడ్ అంచుల దగ్గర డార్క్ గా ఉంది.. కాసేపయ్యాక, ఆ ప్రాబ్లెం సరి చేయమని technician ని పిలిచారు ..ఏంటి ప్రాబ్లెం అని అతడు అడిగితే.. “స్లైడ్ edges కొంచం చీకటిగా ఉన్నాయి.. సరి చేయండి” అని చెప్పేసరికి “ఓస్ ఇంతే కదా..” అని పక్కనే ఉన్న రెండు లైట్స్ ని ఆన్ చేసాడు.ప్రాబ్లెం solve కాకపోగా, మొత్తం స్లైడ్ పై లైట్ పడి, ఏమీ కనపడకుండా పోయింది.  మాకు కాసేపు అతను చేసింది అర్థం కాలేదు. చీకటి గా ఉందంటే, లైట్స్ వేస్తే స్లైడ్స్ బాగా కనపడుతాయి అని అనుకున్నాడని అర్థం కాగానే, అక్కడ అంతా నవ్వులు.

ఖరగ్పూర్ లో చదివే రోజుల్లో, ప్రాజెక్ట్ వర్క్ ఉండేది.ఏదైనా విషయం పై పరిశోధన  చేసి dissertation సమర్పించాలి. ఆ పరిశోధనా విషయాన్ని  మా వాడుక భాష లో ప్రాబ్లం అనేవాళ్ళం. చివరగా, చేసిన ప్రాబ్లం వర్క్ గురించి వైవా ఉండేది. వేరే సంస్థ నుండి ఓ నిపుణుడు వచ్చి వైవాలో ప్రశ్నలు అడిగే వారు. అప్పట్లో మా ఫ్రెండ్ ఇలాగే వైవాకి వెళ్ళాడు. వైవా  జరిగే గదిలో కూర్చున్నాక, నిపుణుడు “What is your problem?” అన్నాడు, అతను తీసుకున్న  పరిశోధన ప్రోబ్లం గురించి ఉద్దేశిస్తూ. ఏదో లోకాన ఉన్న మా ఫ్రెండ్, ఇబ్బంది గా కదులుతూ “No problem sir. I am absolutely fine” అనే సరికి, అక్కడ ఉన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసారు.

ఓ సారి , ఒకతను తను చేయబోయే పరిశోధన తాలూకు రిపోర్ట్ నాకు పంపారు ముందస్తు కామెంట్స్ కోసం (ఈ మెయిల్ ద్వారా) . అంతా చూసి , నేను రిప్లై ఇచ్చాను “Looks fine. But try to justify your work with proper background” . నా ఉద్దేశ్యం, అతడు చేయబోయే పరిశోధనని ఇంకా మంచి కారణాలతో సమర్థించుకోవాలి అని. తరవాత, ఆతడి సెమినార్కి వెళ్ళాను. నేను సలహా ఇచ్చిన విధంగా తను ఏ మాత్రం చేయలేదు. అక్కడ అడగలేక పోయాను. బయటికొచ్చాక అడిగేశాను ” ఏమిటి.. నేను చెప్పిన సలహా పాటించలేదు.. నచ్చలేదా..” అని. ఆశ్చర్యం తో ఆతను ” అదేమిటి అలా అంటున్నారు? స్లైడ్స్ లో మంచి బాక్ గ్రౌండ్ నే పెట్టాను కదా..? మీరన్నట్లుగా, అన్నిటినీ లెఫ్ట్ align కాకుండా, ప్రతి స్లైడ్ నీ justify చేసానే!!” అన్నారు. నేను చెప్పిన దానిని తను చేసిన పవర్ పాయింట్ presentation కి అన్వయించుకుని అతను చేసాడని అర్థం చేసుకున్నాక, కిక్కురుమనకుండా ఉండిపోయాను..:(

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to నిత్య జీవితంలో సినిమాలకి తీసిపోని హాస్యం

  1. D S KRISHNAN says:

    nenu kothaga carvadinainanu . driiving nerchukotunnanu hyderabad citylo. Mana friends everaina chinna chinna tips / clues naaku eee sitelo telapandi please. ekkuva rojulu parkchesi vunchadaniki carunu nenu konaledu. driving school/ private driver cheppina daniki adanamga naaku tips kavali. meeru kuda nalagane nerchukuni vuntaru.

  2. sugunasri says:

    justify..background ..nice interpretation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s