టెక్నాలజీకి ఇంకో వైపు

అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది… టెక్నాలజీ అన్ని రంగాలలోనూ విపరీతమైన వేగంతో ప్రవేశిస్తున్న కొద్దీ.. టెక్నాలజీ వాడకంలో నియంత్రణ, విచక్షణ ఎంతో ముఖ్యమైపోయాయి. లేకుంటే అనర్థాలు జరగటం తధ్యం అందుకు  ఉదాహరణగా  ఓ సంఘటన..

అభివృద్ది చెందిన కొన్ని దేశాలలో  ఇళ్ళు విశాలంగా ఉండటమే కాదు.. విడి విడిగా ఉండటంతో, దొంగతనాలనుండి రక్షణ కోసం సెక్యూరిటీ అలారం వాడుతుంటారు.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ఎవరైనా  బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే , ఆ సెక్యూరిటీ కంపనీకి అలెర్ట్ వెళ్ళిపోతుంది… వెంటనే వాళ్ళు ఆ ఇంటి యజమానికి, వారి బంధువులకు, పోలీసులకు తెలియపరిచి, ఫాలో అప్ చేస్తారు.. ఇలాంటి రక్షణ వ్యవస్థ చాల సమర్థవంతంగా పని చేస్తుంది.

నాణేనికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. ఒక సంఘటన ఆలోచింపచేసింది. నాకు తెలిసిన విదేశాలలో ఉన్న ఓ వ్యక్తి పిల్లలు ఉద్యోగరీత్యా అదే దేశంలో ఇంకో సిటీ లో ఉన్నారు. ఓ రోజు పొద్దునే తనకు సెక్యూరిటీ కంపనీ నుండి వచ్చిన ఓ ఫోన్  కాల్ హడాలేత్తించింది. విషయమేంటంటే..”మీ అబ్బాయి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. మేము మీ అబ్బాయికి ఫోన్  చేస్తే , స్విచ్ ఆఫ్ ఉంది. అందుకే మీకు చేస్తున్నాం. మీరు అనుమతి ఇస్తే, ఇంట్లోకి పోలీసులని పంపి విషయమేంటో కనుక్కుంటాం ..” అని ఆ కంపనీ వాళ్ళు చెప్పేసరికి, అతని మనసు కీడు శంకించటం  మొదలయ్యింది. తను కూడా కొడుకికి, కోడలికి ఫోన్ల మీద ఫోన్లు చేసినా నో రెస్పాన్స్.. ఈ లోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి , ఇంట్లో ఎవరూ లేరు అని ఫోన్ చేసి చెప్పారు.. ఇంతలో లక్కీగా కొడుకుకి  ఫోన్ కాల్ వెళ్ళింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి బయటికి వెళ్ళారనీ, వెళ్ళేటపుడు భార్యా భర్తలు ఎవరికి వారు ఇంకొకరు పెరటి తలుపు తాళమేసి ఉంటారని అనుకుని బయల్దేరారని అర్థమయ్యింది.  ఫలితంగా పెరటి తలుపు తెరచి ఉండగానే ముందు వైపు తలుపులు లాక్ చేసి వెళ్ళారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయ్యేవరకూ మొబైల్స్ ఆఫ్ చేయటంతో, అందరి ఆందోళన మరింత పెరిగింది. కేవలం పెరటి తలుపులు మూయకపోవటం వలన పరిస్థితి కొద్ది సేపట్లో ఎంత గందరగోళానికి దారి తీసిందో అర్థమయ్యేసరికి, అందరూ రిలీఫ్ తో  నిట్టూర్చినా, ప్రతి టెక్నాలజీకి ఇంకో పార్శ్వం ఉంటుంది అని మాత్రం నాకర్థమయ్యింది.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to టెక్నాలజీకి ఇంకో వైపు

  1. avunandee..abhivruddipatham lonu agachaatlu untaaayi.

  2. Latest technology,if not used properly it landsin troubles.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s