ఆగిపోయిన ఓ కలం..మూగబోయిన ఓ గళం

గత కొద్దిరోజులలో ఇద్దరు ఉన్నత వ్యక్తులను భావుకుల ప్రపంచం కోల్పోయింది. ఒకరు జాలాది రాజ రావు గారైతే, ఇంకొకరు జగజీత్ సింగ్ గారు. జాలాది గారి పేరు సినిమా టైటిల్స్ లో చూడటమే కాని, ఎప్పుడూ అతని పాటలు ఏవి అని పట్టించుకోలేదు. కాని నేనెప్పుడూ వింటున్డే “యాతమేసి తోడినా యేరు ఎండదు”  అనే  “ప్రాణం ఖరీదు” చిత్రం లోని మహోన్నత మైన  పాట  సాహిత్యం వారి కలం నుండి జాలు వారిందని తెలిసాక, వారి మీద అభిమానం పెరిగింది. ఆ ఒక్క పాట చాలు వారి భావాల తీవ్రత, ఉన్నతి ఎంత గొప్పవో చాటి చెప్పటానికి.  అలాగే “చల్ మోహన రంగ” లో “”ఘల్లు ఘల్లున  కాలి  గజ్జెలు  మోగంగ ..”,  “గృహ ప్రవేశం ” లో  “అభినవ  శశి  రేఖవో…”  పాటలు  కూడా  నాకు  ఇష్టమైనవే ..

గజల్స్ లో తనదైన ముద్ర వేసిన జగజీత్ సింగ్ గారి గళంలో జాలువారిన ఎన్నో గీతాలు… వాటిని వింటుంటే కలిగే soothing feeling  చెప్పలేనిది.

“यू तो  मिल जायंगे कई लेकिन..न मिलेगा कोई मेरे जैसा.. ना मिलेगा कोई मेरे जैसा..” (ఎంతో మంది ఉన్నా.. నా లాంటి వారు దొరకరు..) అని తను పాడిన పదాలు ఇప్పుడు తన గురించి నిజమైనట్లు అనిపిస్తోంది.. నిజంగా అంతటి మృదువైన గాత్రం పొంద గలగటం అరుదైన అదృష్టమే.. “హోతోన్ సే చూలో తుమ్.. మేరా ప్రీత్ అమర్ కర్ దో..” అనే ” ప్రేమ గీత్ “చిత్రంలో పాట , “సాత్  సాత్” చిత్రంలో  “తుమ్ కో దేఖా తో ఏ ఖయాల్ ఆయా” లాంటి పాటలు  ఎంత శ్రావ్యంగా ఉంటాయో..  అలాంటి పాటలు ఊహా లోకంలో విహరింపజేస్తాయి. ఇలాంటి పాటల్ని.. .. కొన్ని అనుభూతుల్ని కేవలం ఫీల్ అవ్వాలే గాని ఇలా మాటలలో చెప్పలేమేమో..

భావుకతని ఇష్టపడే వారికి ఇలాంటి ఆణి ముత్యాలు భువి  నుండి  దివికి  వెళ్ళటం  తీరని నష్టమే.. ఆ ఇద్దరికీ నివాళులర్పిస్తూ..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to ఆగిపోయిన ఓ కలం..మూగబోయిన ఓ గళం

  1. ilaati samayaalalo vishaadam ni paatagaa malisthe baagundunu anukuntaanu. :(((((((((

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s