ఈ వ్యాపారంలో అందరూ విజేతలే

మేనేజ్మెంట్ లో విన్ విన్ అనే పద్ధతి ఉంది. అంటే అందరూ విజేతలే అని. ముఖ్యంగా మేనేజ్మెంట్ అనే సూత్రం  “ఒకరి గెలుపు ఇంకొకరి ఓటమి కాదు” అనే hypothesis చుట్టూ భ్రమిస్తుంటుంది..ఈ నాందీ ప్రస్తావనతో  ఇప్పుడు కథలోకి వెళ్దాం

షాపింగ్ కోసం ఓ సూపర్ మార్కెట్ లోకి అడుగు పెట్టాను. ఏ. సి., మంద్రంగా వస్తున్న సంగీతం తో చక్కటి షాపింగ్ వాతావరణం ఉంది అక్కడ.  అన్ని వస్తువులు బుట్టలో పెట్టుకుని షాపింగ్ కౌంటర్  దగ్గరికి వెళ్ళాను. బిల్లింగ్ చేస్తూ వెళ్ళాడు షాపు కుర్రాడు. “రెండు వందల  పది” చెప్పాడు కుర్రాడు. జేబులోంచి డబ్బు తీయబోతుంటే, “సార్… మీరు ఇంకో నలభై రూపాయలకు ఏవైనా items కొంటే.. ఈ నలభై రూపాయల కూల్ డ్రింక్  మీకు ఇరవై కే ఇస్తాము” అన్నారు..ఏముంది.. టెంప్టేషన్ మొదలయ్యింది. కాసేపు ఊగిసలాడి, ముందు అనుకోక పోయినా.. అవసరం అవుతాయి అనుకునే items ఇంకో రెండు తెచ్చాను. బిల్లు, ఇప్పుడు 260 అయ్యింది.. దానికి ఇంకో ఇరవై రూపాయల కూల్ డ్రింక్ కలిపెసరికి, మొత్తం బిల్లు 280 అయ్యింది.

షాపింగ్ చేసుకుని వస్తూ, షాప్ లో జరిగిన transaction ని analyse చేస్తే.. కొన్ని interesting facts కనబడ్డాయి.. మొదటిది.. ఆ కూల్ డ్రింక్ కంపనీ, ఆ సూపర్ బజార్ వాళ్ళు చేసుకున్న వొడంబడిక.. బిల్లు 250 చేస్తే ఆ షాపు వారికీ లాభమే.. ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ ఆఫర్ కోసమైనా ఎక్కువ items కొంటాము కాబట్టి. కూల్ డ్రింక్ (ఫ్రూట్)  త్వరగా పాడయ్యే ఐటెం కాబట్టి, ఇరవై కే ఇస్తే.. ఎక్కువ మంది కొంటారు.. ఐటెం కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది…. కాబట్టి కూల్ డ్రింక్ డీలర్ కి కూడా లాభమే.

ఇంకో ముఖ్యమయిన విషయం ఏమిటంటే.. కూల్ డ్రింక్ కార్టన్ ని కూడా సరిగ్గా బిల్లింగ్ చేసే చోటే పెట్టారు అందరూ చూసేటట్లుగా  .. ప్రతి ఒక్కరూ చూడటంతో పాటు,  కౌంటర్ దగ్గరున్న అబ్బాయికి కూడా ఆ కూల్ డ్రింక్ ని వెతుక్కునే పని లేకుండా వెంటనే కస్టమర్ కి ఇవ్వగలుగుతున్నాడు..   నలభై రూపాయల కూల్ డ్రింక్ ఇరవైకే పట్టేశాం కదా అని మనమూ హాపీసే.. ఇదీ “విన్ (షాపు వాడు) విన్ (కూల్ డ్రింక్ డీలర్) విన్ (కస్టమర్)” అంటే.. ఈ పద్ధతినే bundling అంటారు అని బిజినెస్ చదివిన కోవిదులు చెపితే విన్నాను.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to ఈ వ్యాపారంలో అందరూ విజేతలే

  1. Lakshmi.P says:

    మీరు మీ బ్లాగ్ లో పెట్టిన ads ఏలా పెట్టారో కొంచం చెప్పరా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s