జీవితానికి, ఆ ఆటకీ చాలా దగ్గర పోలిక ఉంది

“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ” అన్న మాట జీవితానికే కాదు, ఆ ఆటకీ వర్తింపచేయ వచ్చు. అదే క్రికెట్. ఈ మధ్యనే జరిగిన ఇంగ్లాండ్ టూర్ లో అన్ని formats of the game (test, one day, T20) లోనూ పరాజయాలతో వచ్చాక, హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్  డే లో విజయం సాధించి , మళ్ళీ గెలుపు బాట పట్టింది మన జట్టు. వెస్ట్ ఇండీస్ లో  అంతకు మునుపు జరిగిన సీరీస్ లో విజయాలు సాధించి, overseas లో కూడా గెలుపు సాధించగలము అన్న నమ్మకం దృఢ పడుతున్న  తరుణాన, ఇంగ్లాండ్ లో ఎదురైన పరాజయాల పరంపర ఆశనిపాతమే.

ఎన్నో ఏళ్ళుగా ఈ గేమ్ ని ఫాలో అయ్యే వాళ్లకి ఈ పరిణామ క్రమం పెద్ద వింతగా అనిపించక పోవచ్చు. జీవితంలో లాగే “You cant be the best all the time”. ఎవరైనా బాగా చదివే విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకుంటే, “సచిన్ లాంటి గొప్ప ఆటగాళ్ళు కూడా ఒక్కో సారి డక్కౌట్ అవుతారు. ఇదీ అంతే..” అని ఓదార్చే పేరెంట్స్ ని చూసాను. ఇండియా ఆస్ట్రేలియా మధ్య కోల్కత లో  2001 లో జరిగిన ఆ చారిత్రాత్మక మ్యాచ్ ని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఎదుటి జట్టు ఫాలో ఆన్ లోకి నెట్టిన స్థితి  నుండి కోలుకుని, లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ లాంటి మేటి ఆటగాళ్ళ పోరాట పటిమతో ,   ప్రత్యర్థి జట్టు పైన  గెలుపొందటం  అనేది  అరుదే అయినా.. “సంకల్పం ఉంటె సాధించలేనిది ఏదీ లేదు” అనే సత్యాన్ని చాటి చెప్పిన మ్యాచ్ అది.

2002 లో వెస్ట్ ఇండీస్ లో జరిగిన ఓ మ్యాచ్ లో కుంబ్లే కి దెబ్బ తగిలి, దవడ కి గట్టి fracture అయ్యింది. జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందని, దవడ కదులుతున్నా, పళ్ళు ఊగుతున్నా, తలకి పూర్తిగా బ్యాండేజ్ కట్టుకుని వచ్చి బౌలింగ్ చేయటమే కాదు.. మేటి ఆటగాడు  లారాని అవుట్ చేయగలిగాడు. “జట్టుకి ఎలాగైనా, నా సహాయం అందిచాలనుకున్నా” అని చెప్పిన కుంబ్లే అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.

ఎన్నో మేటి ఇన్నింగ్స్ ఆడే గొప్ప ఆటగాళ్ళు కొన్ని సిరీస్ లలో ఘోరంగా విఫలమౌతుంటారు. అందుకు తగిన కారణం ఉండదు. కేవలం a stretch of bad spell అంతే.. ఒక్క సారి గెలుపు బాట పడితే.. మళ్ళీ అన్నే కుదురుకుంటాయి.. “దేనికైనా టైం రావాలి… తన టైం బాగా లేదు..” అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటిదే ఇదీనూ.

ఆటలో ఓటమిని మేనేజ్ చేయవచ్చు కాని, గెలుపు ని నిజంగా మేనేజ్ చేయగలిగిన ఆటగాడే ఎక్కువ కాలం మన్నగలడు. ఇప్పుడున్న పరిస్థితులలో, ఓ మంచి ఇన్నింగ్స్  ఎవరైనా ఆటగాడు ఆడాడూ అంటే… ఎంతో పేరు.. గుర్తింపు.. వ్యాపార ప్రకటనలు.. డబ్బు.. ఇలాంటి  overnight fame ని equanimity తో తీసుకోగలిగిన ఆటగాడే నిజమైన ఆటగాడు. సచిన్ లాంటి ఆటగాళ్ళు ఎన్ని ఉన్నత శిఖరాలు ఆరోహించినా..”ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం..” అనే ముఖ్యమైన లక్షణం ఉండటం వలన, ఒక పరిపూర్ణ వ్యక్తిగా మన్ననలు పొందారు. Whatever be the greatness you attain, you need have your feet on the ground; let not success get into your head అనేది నేర్చుకోవాల్సిన పాఠం.

మనం ఎంత చేసినా తగినంత గుర్తింపు పొందుతాము  అన్న గ్యారంటీ కూడా ఉండదు ఒక్కో సారి. అందుకు సరైన కారణం కూడా ఉండక పోవచ్చు.. కాని అలాంటివేవీ మన కర్తవ్యాన్ని ప్రభావితం చేయకూడదు.. జట్టుకు  ఏడుగురు బ్యాట్స్ మెన్ ని అందించాలని, వికెట్ కీపింగ్ బాధ్యతని జట్టు కోసం ఇష్టంగా చెసిన  రాహుల్ ద్రావిడ్, ఎన్నో మ్యాచ్ ల లో జట్టుని గెలిపించడమో లేక ఓటమి కోరల నుండి కాపాడడమో   ఎన్నో  సార్లు చేసి ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్ళ నుండి నిబద్ధతని, క్రమ శిక్షణని నేర్చుకోవచ్చు. కీర్తి అన్నది ఇలాంటి ఆటగాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎన్నడూ ప్రలోభపెట్ట లేకపోయాయి.

అందుకే అనిపిస్తుంది, ఈ ఆటకీ, జీవితానికి ఎన్నో సమాంతర రేఖలున్నాయని.

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s