కాలము – మార్పు

కాలమే అన్నిటికీ  సమాధానం చెపుతుంది అనే వివరణ మనం ఏదో సందర్భంలో ఇచ్చుకోవటమో , లేక ఇతరులు చెప్తే వినటమో జరిగే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏదో ఒక deadlock వచ్చినపుడు, దారి, గమ్యం తెలియనపుడు అనుకునే మాటే ఇది. అంతే కాదు కాలం అన్నది ఎన్నో మార్పులు తీసుకు వస్తుంది.. భౌతికంగానూ… దృక్పథాలలోనూ … మానవ సంబంధాలలోనూ….

ముప్పై సంవత్సరాల తరవాత మా స్కూలు మిత్రులు కలిసినప్పుడు, అందరికీ మిగతా వారు ఆనాటి స్కూల్ యూనిఫారంలలో చూసిన మిత్రుల రూపంలోనే మనో ఫలకాలలో ఉన్నారు. అంత కాలం తరవాత చూసే సరికి ఒక్కక్కరినీ గుర్తు పట్టడానికి కష్టమయ్యింది.. అలాగే ఈ సారి మన ఫ్రెండ్ విజయ అప్పట్లో ఫ్రెండ్స్ నుండి వచ్చిన ఉత్తరాలను తీసుకుని వచ్చి అందరికీ చూపించింది. “ఇది నేను రాసిందేనా…” అని ఆశ్చర్య పోయిన వారూ కొందరున్నారు. అదే కాల మహిమ.. మన ఆలోచన సరళి కాల గమనంతో ఎంత మారిపోతుందీ అంటే.. మనల్ని మనమే నమ్మలేనంత.. ఇకపోతే మానవ  సంబంధాలు కూడా కాలానికి దాసోహమనక తప్పదు.. .. మనం ఎంతగానో అభిమానించే వారిని “వీరినా మనం అభిమానించింది..” అని అనుకునే సందర్భాలు ఎన్నో వస్తుంటాయి.. అలాగే ఈ రోజు మనకు నచ్చిన వ్యక్తి ప్రవర్తన మరికొన్ని రోజులకు రుచించక పోవచ్చు.. ఎందు వలనా అంటే.. కాల మహిమ.. ఈ రోజు సత్ప్రవర్తనతో ఉన్న వ్యక్తి మరి కొన్ని సంవత్సరాలకు అలాగే ఉంటాడన్న గ్యారంటీ లేదు..

కొన్ని సార్లు టైం బాగోలేదు అనుకుంటుంటాం. ఏది చేసినా అన్నీ వికటిస్తుంటాయి.. ఇలాంటి lean patches ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి.. ఇలాంటి సమయం లో ఎంతో సంయమనం అవసరం.. Just duck back and allow the storm to cross over ..

కాలాన్ని మనం చూసే తీరు వేరుగా ఉంటుంది.. “ఓ కాలమా.. ఎడబాటు వేళ కదలవా..” అని పాడుకునే వారికి కాలమెంత మంద్ర గమనంతో సాగుతుందో.. నచ్చిన వారి సాంగత్యంలో ఉన్నవారికి “కొంత కాలం… కొంత కాలం … కాలమాగి పోవాలి…” అని పాడుకోవాలనిపిస్తుంది. సాపేక్షతతో కాలం నిర్వచనం, తీరూ తెన్నులు మారుతాయి… కాని ఆ కాలానికి ఉన్నది ఆ ఇరవై నాలుగు గంటల రోజులే.

ఎంతో దగ్గరైన వ్యక్తులు కొంత కాలం తరవాత ఎందుకో మారిపోతారు.. దానికి ఇదమిద్ధంగా కారణం ఇదీ అంటూ ఏమీ ఉండదు. ఎందుకు అన్న తర్కానికి కొన్ని ప్రశ్నలకు సమాధానం అందదు. ఒకటే అర్థం చేసుకోవలసిందేమిటంటే  .. ప్రతి మనిషికీ intrinsic గా మార్పుని ఇష్టపడే నైజం ఉంటుంది.. ఆ మార్పు ఎంత మోతాదులో ఉంటుంది, ఎంత కాలానికి ఎంత మారుతుంది.. (అంటే unit change per unit time) అన్నది వ్యక్తి వ్యక్తికీ మారుతుంది.. కొద్ది కాలంలోనే ఎక్కువ మారే వ్యక్తులతోనే కొంచెం కష్టం.. మన వ్యవస్థలో మానవ సంబంధాలు ఎంత వేగంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. కాలంతో బాటూ మార్పూ సహజం అని కాలానుగుణంగా మారటమే వివేకం..

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

One Response to కాలము – మార్పు

  1. Ramakrina,u described the changing humanrelations&values in the presant day trend.we hav 2 adjust our selves according 2 changing circumstances.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s