ఈ సంభాషణ ఏ పాటకి ఉపోద్ఘాతమో చెప్ప గలరా..?

కొన్ని పాటలు ఎంత మధురంగా ఉంటాయో, వాటితో పాటు సందర్భోచితంగా ఉండే సంభాషణలూ అంతే హృద్యంగా ఉంటాయి.. ఇప్పుడు చెప్ప బోయే పాటకి సందర్భం ..

ఎన్నో ఏళ్ళ తరవాత కలుసుకునే ఒక అతను, ఒక ఆమె మధ్య ఉండే సంభాషణ… ఈ సంభాషణే ఓ అమరమైన పాటకి ఉపోద్ఘాతమౌతుంది.
ఈ పాట  ఓ హిందీ చిత్రం  లోనిది. ఆ సంభాషణల తెలుగు అనువాదం ఇస్తున్నాను.

ఆమె: ఎన్నో ఏళ్ళ తరవాత ఇలా బయటికొచ్చి నడుస్తున్నాను… ఎలా అనిపిస్తోందంటే… (మౌనం) 
అతను: ఎలా..?
ఆమె: ఎన్నో యుగాల నాటి సంగతి లాగ..
అతను: హ్మ్.. ఈ భవంతి అప్పటికి ఉండుండక  పోవచ్చు…
ఆమె: హ్మ్.. ఇదంతా ఏదో గత జన్మలో ఉన్నట్లుగా అనిపిస్తోంది కదా..?
అతను: ఓ పని చేద్దాం .. నువ్విక్కడున్నంత వరకూ, భోజనానికి ఇక్కడి వచ్చెయ్యి.. భోజనమయ్యాక అలా బయటికి వ్యాహ్యాళికెళ్దాం ..
కనీసం… (మౌనం) … ఈ భవంతిలో ఎవరో  ఇంకొద్ది రోజులైనా ఉన్నట్లుంటుంది. (…స్వరంలో జీర)
అది సరే.. నీ శాలువ ఎక్కడ?
ఆమె: ఓ.. మరిచాను.. (తడబాటు)
అతను: (ప్రేమతో విసుక్కుంటూ) నువ్వింకా మార లేదు.. శాలువ తీసుకో.. 
మాటలతో వ్యక్తీకరించలేని భావాలు , పాట ద్వారా ఇక్కడ నుండి మొదలౌతాయి.. అది ఏ పాటో చెప్పగలరా..? (తెలిసి కూడా చెప్పకపోతే  ఏమౌతుందో చెప్పడానికి విక్రమార్కుడు- బేతాళుడి  కథ గుర్తు తెచ్చుకోండి… 🙂 ) 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

4 Responses to ఈ సంభాషణ ఏ పాటకి ఉపోద్ఘాతమో చెప్ప గలరా..?

  1. Tum aa gaye ho noor aa gaya hai

  2. Andhi.. Tere Bina Zindagi se..song kandandee! naaku chaalaa ishtamaina paata.

  3. geetha says:

    I think “tere binaa jindagi se koyi shikvaa tho nahi”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s