బహుళ నక్షత్ర హోటళ్ళలో నాకిష్టమైన హోటల్

ఆ హోటల్ మా వూళ్ళో మా స్కూలు పక్కనే ఉంది. అక్కడ కూర్చోటానికి పది మందికి సరిపడేంత చోటే ఉంటుంది… పొద్దుట పూట కేవలం పది గంటల వరకు మాత్రమే ఉంటుందా హోటల్. ఉన్న ఆ కొద్ది సేపు ఎంతో రద్దీ. ఇడ్లీలు, చికెన్ కర్రీ, చిన్న మసాలా వడలు అక్కడి స్పెషాలిటీ.. అన్నీ వేడి వేడి గా వడ్డన.. ఒక్కో సారి, అరగంట పైగానే నిరీక్షణ.. అక్కడ కూర్చుని తింటే, రుచికరమైన వంటకాలను ఆనందంగా ఎలా అస్వాదిస్తామో అర్థమౌతుంది. ఇడ్లీలు మృదువుగా ఉండి.. ఎక్కడా రవ్వతో కూడిన grainy texture కనపడదు.  ultra soft గా ఉంటాయవి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవటమే.. కనీసం పది ఇడ్లీలు లాగిస్తారేవరైనా.ఇక పోతే మా వూళ్ళో ఏ హోటల్ లోనైనా ఇడ్లీ ప్లేట్ అంటే default గా వడ కూడా  అందులో భాగంగా  సర్వ్ చేస్తారు.  మేము స్కూలు కి వెళ్ళే రోజుల్లో, పొద్దున్న ఎనిమిదికే వెళ్లి, అక్కడ టిఫెన్ లాగించి వెళ్ళేవాడిని. అక్కడ కూర్చుని తింటుంటే.. “ఏంబా.. ఈ మధ్య యాడ పూడిసినావు..కనపడేదే లేదు…?” అని ఒకరు పలకరిస్తే “కిండల్ (అంటే తమాషా ) చెయ్యొద్దు బా.. ఈడదా  ఉన్నాను.. నువ్వుదా (ఈ ‘దా’ అన్నది తమిళ ప్రభావం వలన వచ్చింది. నువ్వే అనటానికి నువ్వుదా అనటం పరిపాటి) కనపడలేదు..”  అని ఇంకొకరు సమాధానం చెపుతుంటే.. మన వూరి ట్రేడ్ మార్క్ భాష వింటూ టిఫెన్ లాగిస్తుంటే.. ఆ అనుభూతే వేరు..

ఇక పోతే ఈ హోటల్ బహుళ నక్షత్ర హోటల్ అని ఎందుకన్నానంటే .. పై కప్పు, తాటి ఆకులతో ఉంటుంది.. రాత్రిపూట చూసామంటే.. ఆ కప్పునుండి ఆకాశంలోని చుక్కలు కనిపించటం ఖాయం..ఇన్ని ఉన్నా ఆ హోటల్ కి పేరే లేదు.. మా క్లాస్ మేట్ సుధాకర్ వాళ్ళ హోటల్ కాబట్టి, మేము మాత్రం సుధాకర్ హోటల్ అని పిలిచేవాళ్ళం. 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s