ఇలాంటి “టెక్నికల్ ట్రూత్స్” మీరూ విన్నారా?

అశ్వత్థామ హతః కుంజరః” అనే మాట ప్రాముఖ్యత భారతం చదివిన వాళ్లకి తెలిసే ఉంటుంది. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని  హతమార్చడానికి కృష్ణుడు ధర్మరాజు చేత చెప్పించిన అబద్ధంలాంటి  నిజం. అశ్వత్థామ అనే ఏనుగుని భీముడి చేత చంపించి, అదే విషయాన్ని ద్రోణుడికి వినపడేలాగా, అశ్వత్థామ హతః అన్న మాట బిగ్గరగా చెప్పి, కుంజరః అన్న మాట మెల్లగా చెప్పటం వలన.. ద్రోణుడు తన పుత్రుడు అశ్వత్థామ మరణించాడని  భ్రమించి,  మానసికంగా క్రుంగిపోతాడు…. అతని ఏమరుపాటే అతనిని సులభంగా వధించటానికి కారణమౌతుంది. ఈ కథకి మరికొన్ని variations ఉన్నా , నా చిన్నప్పటి అమరచిత్ర కథలో చదువుకున్న వెర్షన్ ఇదే.

ఈ కథలో సారాంశ మేమిటంటే.. ధర్మరాజు నిజం చెప్పినా.. అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఇలాంటివి టెక్నికల్ గా చూస్తే నిజాలైనా, అవి నిజాలు కావు. ఈ సూత్రాన్ని తెలిసో తెలియకో.. మనం కూడా ఎన్నో చోట్ల ఎంతో మంది ఉపయోగించడం చూడొచ్చు. అందుకు కొన్ని ఉదారహరణలు.

ఒక ప్రముఖ వస్త్ర దుకాణం వాళ్ళు “అరవై శాతం తగ్గింపు..” అని పెద్ద హోర్డింగ్స్ పై ప్రకటనను గుప్పిస్తారు. ఇదేదో బాగుందని కుటుంబ సమేతంగా అక్కడికెళ్తే.. ఆ డిస్కౌంట్ కేవలం కొన్ని ఐటమ్స్ మీదే అని సెలవిస్తారు. అవి ఎక్కడా అని వాకబు చేస్తే ఓ పెద్ద బుట్టలో చిందర వందర గా కొన్ని Items ఉంచి, అందులో వెతుక్కోమని చెప్తారు.  అంత దూరం వచ్చాక, ఎలాగు ఖాళీగా వెనక్కి వెళ్ళలేము కనుక, డిస్కౌంట్ లేని ఐటమ్స్ ని కొనుక్కుని బయట పడాల్సి వస్తుంది. ఇక్కడ అరవై శాతం అన్నది “అశ్వత్థామ హతః” లాంటి అబద్ధం అయితే అయితే selected items అన్నది దానిని నిజం చేసే “కుంజరః” లాంటి నిజం.

మా బండి లీటరు పెట్రోలుకు 150 కిలో మీటర్ల మైలేజి ఇస్తుంది అని ఓ ప్రకటన. 150 పైన ఓ నక్షత్ర గుర్తు ఉంటుంది. అదేమిటా  అని చూస్తే, ప్రకటన అడుగున ఉంటుంది “only under test conditions ” అని.   మరి అలాంటి నాణ్యత ఉన్న రోడ్లు ఎప్పుడు చూస్తామో. ఆ నక్షత్రం గుర్తు పెట్టుకోవడం వలన, మైలేజి ఎంత తక్కువ వచ్చినా, మేము చెప్పిన టెస్ట్ conditions లేవు కదా సదరు కమపనీ వారు అని వాదించే ఆస్కారముంటుంది.

ఈ మధ్య ఫుడ్ ఐటెంస్ అమ్మే ఓ exclusive స్టోర్స్ లో ఓ ఆకర్షణీయమైన ప్రకటన చూసాను .. 50 శాతం వరకూ తగ్గింపు అని. వారి బ్యానర్ పై, యాభై శాతం అన్నది చాల పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది.. “వరకూ తగ్గింపు” అన్నది మాత్రం కుంజరః లాగ అతి చిన్న అక్షరాలతో ఉంటుంది. అది చూసుకోకుండా లోనకు వెళ్ళామా.. ఆ యాభై శాతం డిస్కౌంట్ ఎందుకూ ఉపయోగపడని ఓ ఐటెం కు ఉంది.. ఏదో సర్ది చెప్పాలన్నట్లు.. ఐదు, పది శాతం తగ్గింపు ఇంకో రెండు మూడు  ఐటెంస్  కి ఇచ్చి, మిగతా అన్ని ఐటెంస్ కీ తగ్గింపు లేదు అని చెప్పారు. ఎలాగు లోనకు వచ్చాం కదా.. ఏదో కొనుకుండా ఉండగలమా. ?

“ఎక్కడికి వెళ్లి వస్తున్నావు” అని అడిగితే “ఫ్రెండ్ ని కలిసి వస్తున్నాను” అని చెప్పటం చూస్తుంటాం.. నిజం చెప్పినా ‘కలిసి వచ్చింది స్నేహితుడా లేక స్నేహితురాలా’ అన్నది ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ పదం ద్వారా కప్పి పుచ్చటానికి ఇదో పద్ధతి.

ఎవరినా ఏదైనా ఇబ్బంది కలిగే ప్రశ్న  వేసినప్పుడు, దానికి వివరణ ఇవ్వటం తప్పనప్పుడు… “I will get back to you soon” అని చెపుతుంటారు .. అది ఎంత సూన్ అన్నది కాలమే నిర్ణయించాలి.

ఇలాంటి  technical truths మన వాడుక లో ఎన్నో.. కొన్ని స్వప్రయోజనాల కోసమైతే.. కొన్ని గాలమేయటానికి అయితే.. కొన్ని ఆపద్ధర్మంగా చెప్పాల్సినవి..

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to ఇలాంటి “టెక్నికల్ ట్రూత్స్” మీరూ విన్నారా?

  1. Ramakrishna,we can take action against such a kind of trade practices under the MRTP Act.Due to paucity of time we are dislike to take any kind of action.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s