ఈ సంభాషణ ఏ పాట మధ్యలో వస్తుంది?

పాటలతో అల్లుకున్న సంభాషణల గురించి, ఇంతకు మునుపు ఓ టపాలో,  “ఆంధీ” లోని “తేరే బినా భి కోయి జిందగీ..” అన్న పాటకి ముందు నాయికా, నాయకుల మధ్య జరిగే సంభాషణ గురించి ప్రస్తావించాను.. అలాంటిదే ఈ రోజు ఇంకో హిందీ పాటలోనిది.. ఈ సంభాషణ పాట మధ్యలో వచ్చి.. మళ్ళీ పాటలోకి culminate అవుతుంది..
మనసు విప్పి మాట్లాడుకోకుంటే  ఎన్ని అపార్థాలు వస్తాయో.. జీవితాలు ఎలా ఊహించని, తిరిగి  రాని తీరాలకు చేరుతాయో.. అంతా జరిగిపోయాక మళ్ళీ ఆ జీవన ప్రయాణికులు కలుసుకుని జరిగినదానిని retrospect చేసుకునే సందర్భంలో వస్తుంది ఈ సంభాషణ.. అనుకోకుండా రైల్వే స్టేషన్లో కలుసుకున్న వారిరువురి నడుమ సాగే సంభాషణ  ఇలా ఉంటుంది..

ఆమె: మీ చొ… చొక్కా బటన్  విరిగింది
అతను: బటన్ ఏమిటి… అంతా ముక్కలై పోయింది ..
ఆమె: బటన్ కుట్టి ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరా..
అతను: ఒకరు ఉండేవారు.. కాని తిరిగి  రానంత దూరానికి వెళ్ళిపోయింది..
ఆమె: మీరు తనని కోరుకోలేదేమో.. లేకుంటే మీ దగ్గరకి తప్పక వచ్చి ఉండేది..
అతను: కోరుకున్నాను.. ఆలోచించాను. కూడా.. కాని.. ఏమిటో… ఎందుకో ఇలా జరిగిపోయింది..
ఆమె: (లేవటానికి ఉద్యుక్తురాలవుతూ)  నా బండి వచ్చింది.. వెళ్ళాలి..
అతను: (వెళ్ళబోతున్న ఆమెని చూస్తూ నిస్సహాయంగా) అర్చనా..
ఆమె: మీరేమైనా చెప్పాలనుకున్నారా ..?
అతను: ఎన్నో చెప్పాలని ఉంది.. కాని నీ బండి..నువ్వు వెళ్ళాలి కదా..?
ఆమె: మిమ్మల్ని ఒకటి అడిగేదా..?
అతను: అడుగు
ఆమె: తప్పంతా నాదేనా..
అతను: కొంత నీది… కొంత నాది… కొంత బహుశా మనిద్దరిదీ..
ఆమె:(గద్గద స్వరంతో) మరి… మరి.. ఏమిటిలా … ఎందుకిలా…

భారమైన ఆ వాతావరణాన్ని మరింత గంభీర పరుస్తూ మొదలౌతుంది గానం..

అది ఏ పాటో చెప్ప గలరా..?

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

5 Responses to ఈ సంభాషణ ఏ పాట మధ్యలో వస్తుంది?

 1. Bheegi palkeen..chitramlo Janam janam ka saat..2nd version song anukuntunnaanu. Ramakrishna garu.

 2. jnani says:

  నాకు హింది అంటె ఇష్టం లేదు

 3. Phaneendra says:

  paata teliyadu kani cinema bali peetham aa?

 4. R SURESH says:

  These are the conversation between Nazaruddin Shah and Rekha from
  Guljar film “IJJAZAT” the song “Mera kuch saman thumhara pas padahai”
  very beatiful song sung by Madam Lataji. AM I correct?

  • mhsgreamspet says:

   @vanaja, gnani, paneendra, suresh
   aa song kora kaagaz lonidandee. ” kora kagaz mera jeevan kora hi reh gayaa…” anna paata lo ee dialogs vasthaayi.
   thnx 4 ur comments.
   Thnx 2 vanaja gaaru 4 reminding that wonderful song from bheegi palke and suresh 4 song from izzat which r my favorites too.
   ramkrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s