మొహమాటానికి పోతే…

పశ్చిమ బెంగాల్  లో విద్యార్థిగా ఉన్న రోజులు. పండగల సందర్భాలలో , ముఖ్యంగా ఉగాది రోజున అక్కడి తెలుగు వారిని కలవటం, కొత్త పరిచయాలు కావటం జరుగుతుంటుంది. మా మిత్ర బృందానికి ఒక కుటుంబం అలాగే పరిచయమయ్యారు. నెక్స్ట్ వీకెండ్ లో ఇంటికి ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్లి, అందరం కూర్చున్నాక ఘుమ ఘుమలాడే కాఫీలు కప్పుల్లో ప్రత్యక్షమయ్యాయి. మంచి కాఫీకై మొహం వాచిపోయింది… ఎంత కాలమయ్యిందో అలాంటి ఘుమ ఘుమలాడే కాఫీ తాగి అని మా డిగ్రీ  రోజులలో తాగిన కాఫీ గుర్తొచ్చి ఘోషించింది హృదయం.

అప్పటి వరకూ అంతా బాగుంది కాని..కాని… వారు ఇచ్చిన కాఫీ కప్పు సైజు చూసే సరికి గుండె గుభేల్మంది. మనం తాగే కప్పుకి రెండింతలు  పైనే ఉంది ఆ కప్పు. పైగా, పై అంచు వరకూ కాఫీ ఉంది. ఎంతగా కాఫీ ఇష్టమైనా, మరీ అంత కాఫీ తాగాలంటే ఎలా..? నేను మొహమాటం తో చెప్పాను ” సార్.. మరీ ఇంత కాఫీ తాగలేను.. కొంచెం తగ్గించండి..”  మా హోస్ట్ “పర్లేదండీ.. తాగండి..’ అని బలవంత పెట్టాడు. ఆయనలా చెప్పుతున్నా మనసోప్పుకోక.. ఎలాగైతేనేం కొంచెం కాఫీ ఇంకో ఖాళీ కప్పులో పోసాను.. ఇక మనం ఇష్టమైన కాఫీని ఆస్వాదించే ప్రక్రియ మొదలయ్యింది.. హాశ్చర్యం..ఆ కాఫీ రెండు  గుక్కలు  ఇలా గొంతులోకి జారాయో లేదో.. కాఫీ ఖతం.. ఇదేంటి చెప్మా, ఇంత తక్కువ కాఫీ ఉందేమిటా  అని చూస్తే… ఆ కప్పులలో అడుగు భాగం చాల మందంగా ఉందనీ… తద్వారా అందులో పోసే కాఫీ పరిమాణం మామూలు కప్పుల కంటే కూడా తక్కువ ఉంటుందనే నగ్న  సత్యం అప్పుడు బోధ పడింది..  బంగారం లాంటి కాఫీ ని ఖాళీ కప్పులో పోసి, తప్పు చేసానే అన్న భావాన్ని ఎంత అణుచుకుంటున్నా.. నా మోహంలో కనపడుతున్న భావాలను ఆ ఇంటి యజమాని యిట్టె కనిపెట్టటం… జాలిగా చూడటం లేక “తిక్క కుదిరిందా .. చెప్పిన మాట విన్నావు కాదు”  అన్నట్లు చూడటం అన్నీ ఒక్కసారే జరిగిపోయాయి.

వారి ఆతిధ్యం స్వీకరించటం అయ్యాక , బయటికొచ్చిన తరవాత.. మా మిత్రులంతా ఒకటే నవ్వులే నవ్వులు..

This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

4 Responses to మొహమాటానికి పోతే…

 1. Ramakrishna,kanuka,ellavelala mohamatam paniki radhu.

 2. హహహ అచ్చికచ్చిక బాగయ్యింది (సరదాకి)! నేనయితే అసలు కాఫీనే త్రాగను కనుక మీకిచ్చేసేదానిని!

 3. Zilebi says:

  ఈస్ట్ వైపు వెళ్ళిన వాళ్లకి ఇది ఒక మరుపురాని అనుభవం. బాగుందండీ, మీ గిరిం పేట స్కూలు వాళ్ళ కతలు. మరి మీది చిత్తూరు అన్న మాట ! మా వూరి వారే . ఇంకా చిత్తూరేనా వాసం ? గిరిమ్పేట స్కూల్లో మా హయాము లో చదివిన కొందరు మిత్రులు ఉండేవారు . గాలి వాటాన అంతా ఎక్కుడున్నారో మరి ?

  • mhsgreamspet says:

   rasagna
   🙂
   varudhini
   నేను చిత్తూర్ లో లేక పోయినా మా గ్యాంగ్ అంతా అక్కడే ఉందండి . మీరు మీ ఫ్రెండ్స్ names చెపితే , మా ఫ్రెండ్స్ కొందరివైనా details చెప్పగలరు.
   రామకృష్ణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s