నాటి జ్ఞాపకాల మరకలు

ముప్పై ఐదు ఏళ్ళ ముందు మాట. ఇంట్లో వండేవారు లేకపోవటంతో, వూర్లో వుండే ఉన్న హోటళ్ళు అన్నింటినీ సర్వే చేశాను  అప్పట్లో. అందులో, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని హోటల్స్ లోనూ తినేవాడిని. ఎంతంటే కొన్ని హోటల్స్ లో అక్కడి ఓనర్స్ కాని, సర్వర్స్ కాని చిర పరిచితులయ్యేంతగా. ఒక మంచి మిత్రుడిని పొందింది కూడా ఈ హోటల్స్ ద్వారానే..

జ్ఞాపకాలతో ముడిపడిన ఆ హోటళ్ళ గురించి కొన్ని సంగతులు. 

జనతా హోటల్

ఇది అప్పటి బస్ స్టాండ్ (ఇప్పటి పాత బస్ స్టాండ్) ఎదురుగ్గా మిద్దె పైన ఉండేది.. అప్పట్లో, సూపర్ బజార్ conceptతో, జనత కాంప్లెక్స్ కట్టారిక్కడ. కింది floor  లో బట్టల దుకాణాలు ఉండేవి.. ఇది cooperative కాన్సెప్ట్ తో నిర్మించారు. ఎంతో హడావిడి ఉండే ఈ షాపుల సముదాయాన్ని చూడ్డానికి అప్పుడప్పుడూ అన్నయ్యతో వెళ్ళే వాడిని. అన్నీ చూసాక, మిద్దెపైన ఉన్న జనత హోటల్ లో సాదా దోశ (మినపట్టు) తినేవాళ్ళం. అన్నయ్య ఇంటర్ పరీక్షలు రాస్తున్నప్పుడు, ఈ హోటళ్ళలో టిఫెన్ చేసి పరీక్ష కెళ్లటం ఇప్పటికీ గుర్తే.. ఆ హోటల్ అమర్చి ఉన్న టేబుల్స్, వాష్ బేసిన్, కాష్ కౌంటర్ అన్నీ కంటి ముందు ఇప్పటికీ కనపడుతుంటాయి. ఎందుకో ఈ షాపులు, హోటళ్ళు ఎక్కువ కాలం నిలబడలేదు. వూరు వెళ్ళినప్పుడు కనపడే ఆ శిథిల భవనాలు నాటి గుర్తులకు ఆనవాళ్ళు. 

తృప్తి హోటల్
ఇది వెజిటేరియన్ ఏ. సి హోటల్. చేతి నిండా డబ్బులుంటే వెళ్ళే హోటల్. ఇది ఇప్పుడున్న విష్ణు భవన్ (స్టేషన్ రోడ్ లో ) దగ్గర, మిద్దె పైన ఉండేది. 1983 లో భారత్ ప్రపంచ కప్పు గెలిచిందని తెలిసింది ఈ హోటల్ లో భోజనం చేస్తున్నప్పుడే. 

ద్వారక హోటల్
ఇది ప్రస్తుతం అలంకార్ హోటల్ గా పిలవబడుతుంది. ఇది కూడా posh హోటలే. చికెన్ fry , బిర్యాని ఇక్కడి ప్రత్యేకత. ఆ టెస్ట్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పట్లో, ఇక్కడ డిన్నర్ చేసి పక్కనే ఉన్న ప్రతాప్ హోటల్ లో సెకండ్ show సినిమాకి వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ఉన్న సెర్వర్స్ ఒకళ్ళిద్దరు, నాతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు. చదువుల కోసం వూరికి దూరమయ్యాక ఈ హోటల్ కి చాల కాలం వెళ్ళలేదు. బహుశా ఇరవై ఏళ్ళ తరవాత, ఆ హోటల్ లో అప్పట్లో కనిపించిన ఒక సర్వర్ కనిపించాడు. ఆశ్చర్యం.. తనని చూస్తూనే ఇద్దరం గుర్తు పట్టగలిగాం. వృద్ధాప్యం మీద పడుతున్నా, యాజమాన్యాలు మారినా, అతను ఆ హోటల్ ని అంటి పెట్టుకుని ఉన్నాడని తెలిసాక, హృదయంలో ఎక్కడో ఓ కదలిక.. ఇరవై ఏళ్ళ తరవాత అక్కడ భోజనం చేసి వెళ్తున్నప్పుడు, అతనికి వద్దంటున్న నాకు తోచింది చేతిలో పెట్టి వస్తుంటే..ఏదో తెలియని  ఫీలింగ్.. ఈ జ్ఞాపకాలింత భారమా అనిపించింది. ఇదే హోటల్ లో అప్పట్లో గాస్ సిలిండర్  పేలి ప్రమాదం జరిగి, కొంత కాలం హోటల్ మూసి వేసారు. 

లతా కేఫ్
ఇది మన గిరింపేటలో  ఉండే హోటల్. ఇక్కడే సూరి బావని వాళ్ళ నాన్న తీసుకొచ్చి బ్రేక్ ఫాస్ట్ చేయించే వారు. స్కూల్ వెళ్ళే ముందు ఇక్కడ తిని వెళ్ళేవాడిని. నన్ను రెగ్యులర్ గా ఇక్కడే చూసే సూరి వాళ్ళ నాన్న ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ సూరి వాళ్ళ నాన్న అదే అభిమానం చూపిస్తారు నా పైన. ఈ హోటల్ కేరళ నుండి వచ్చిన అన్నదమ్ములు నడిపేవారు. వీరిలో తమ్ముడు పురుషోత్తం నాయర్ నన్ను బాగా పలకరించే వారు. చదువుకోవటం వలన, తనకి ఆహ్మెదబద్ లో ఉద్యోగం వచ్చి అప్పట్లో నే వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ హోటల్ బాగా నడిచేది.. కాని అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. ఆ నాటి ప్రభావం పోగొట్టుకుని, ఈ హోటల్ ఇంకో చోటికి మార్చి, అక్కడా నిలదొక్కుకోలేక కాల గర్భం లో కలిసిపోయింది.

కోయ రెస్టారెంట్
ఇది శ్రీనివాస టాకీసుకేదురుగ్గా   ఉన్న హోటల్. హోటల్ ముందు… పరో టాలు   చేసే పెద్ద పెనం ఈ హోటల్ కి ట్రేడ్ మార్క్… కొంచం తక్కువ ఖర్చులో నాన్ veg తినాలంటే  , ఈ హోటల్ గుర్తొచ్చేది. కాకపోతే, ఈ హోటల్ కి తరచూ యాజమాన్యాలు మారటం, హోటల్ పేరు తరచూ మారటం జరుగుతూ వుండేది. చికన్, వెజిటబుల్స్ లేకుండా ‘కుష్కా’ అని బిర్యాని మసాలాలతో వండేవాళ్ళు. అదే నచ్చేది నాకు.  

గ్రాండ్ హోటల్ 
ఇది కోయ రెస్టారెంట్ లాంటిది , బస్ స్టాండ్ దగ్గరుండేది. ఇరుకు గా వుండేది.. బిర్యాని ప్రసిద్ది. సరైన  ambience లేక పోవటం వలన, నేను ఎక్కువ గా వెళ్ళలేదు. 

మేనక హోటల్
ఇది ఇంకో posh హోటల్. నాన్ వెజ్ కి ఇక్కడికి వెళ్ళే వాళ్ళం. ఓ డాక్టరు గారి యాజమాన్యంలో దీనిని నడిపేవారనుకుంటాను 

వామన హోటల్
ఇది గ్రాండ్  హోటల్ పక్కన ఉండేది. బస్ స్టాండ్ నుండి వచ్చే జనాలతో, రద్దీగా వుండే హోటల్. 

దేవి హోటల్
ఇది బీ. జెడ్ హై స్కూల్ దగ్గరున్న చర్చికి ఎదురుగ్గా వుండే శాఖాహార హోటల్. 

ప్రతాప్ హోటల్
ఇది కయినికట్టు వీధి (?) లో ఇప్పటికీ ఉన్న హోటల్. నేను టెన్త్ చదివేటప్పుడు, రోజూ ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ స్కూలు కెళ్ళే వాడిని. ఇప్పటికీ మన గ్యాంగ్ చితూర్ లో కలిస్తే, అందరమూ వెళ్ళే హోటల్ ఇది. బిర్యాని ఈ హోటల్ ప్రత్యేకత. 

నాయర్ హోటల్ 
దర్గా దగ్గర వుండేదీ హోటల్ . ఈ హోటల్ లో టెన్త్ లో వున్నప్పుడు ఎక్కువగా తిఫెన్ చేసేవాడిని. ఈ హోటల్ నాకు చాల అపురూపం ఎందుకంటే నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ ఫ్రెండ్ అయిన వేణు గారిని అందించింది ఈ హోటలే.. ఈ హోటల్ నడిపే అన్నదమ్ములలో ఒకరైన వేణు అంటే, ఇప్పటికీ అభిమానమే. 

బృందావన్ హోటల్ 
ఈ హోటల్ ఎక్కువ రోజులు మనలేదు.. ప్రతాప్ హోటల్ పక్కనే వుండేది హోటల్.. ఈ హోటల్ స్థానంలో ప్రస్తుతం ఖాళీ స్థలం వుంది..

ఇప్పుడు పట్టించుకునే  శుచి  , శుభ్రత , packaged వాటర్ లాంటివి ఏవీ ఉండేవి కావు ఆ నాటి రోజుల్లో… తెలిసింది వొక్కటే.. ఆకలి.. చేతిలో వుండే నాణేల బట్టి ఆ ఆకలి మంటలు ఆర్పే చోటు మారేది అంతే..Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to నాటి జ్ఞాపకాల మరకలు

 1. zilebi says:

  అయ్యా రామకృష్ణ గారు,

  మీరు ఉడిపి హోటలు మరిచారు.

  వీలు చేసుకుని, నా ఉడిపి హొటలు ఉడాలు టపా వీలైతే చదవండి.

  http://varudhini.blogspot.com/2010/03/blog-post_02.html

  • mhsgreamspet says:

   వరూధిని గారు
   అవునండీ మరిచాను. అక్కడికి కూడా చాల సార్లు వెళ్ళాను. మీ టపా చదివాను. ఎర్రయ్య అంగడి గురించి ప్రస్తావించారు. చాల సంతోషం. నేను కూడా నా టపాలలో తన గురించి రాసాను.

 2. T.Pattabhi Raman says:

  It is very happy to remember of those days Hotels. For your kind information, (u would have forgotten), NV hotel MSD next to MSR talkies which is famous for kushka, small hotel opposite to santhanam chetty’s shop which was run by one of our classmate gopi. In that hotel, he always refuse to give NV to me during those days. The reason he thought that i am from veg family, and without house knowledge i am taking NV food from his hotel. With a great difficulty and small fight i use to eat NV from his hotel. For this incident his father supports me always.

 3. Ramakrishna.thank u for refreshing the memory with the hotels of our child hood days. You forgot mention about hotel Balajibhavan which was existed opp.to Bramhanandareddy mpl.bus stand,now balaji mobiles is there.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s