ఆ పాటల పై టెక్నాలజీ ప్రభావం..

కొన్ని అభిరుచులు కాల క్రమేణా, చుట్టూ మారుతున్న స్థితి   గతుల వలన మారుతుంటాయి.. అప్పట్లో సినిమా హీరోల డ్రెస్సులు విపరీతంగా ఆకర్షించేవి. ఎప్పుడైనా . ప్యాంటు కుట్టించుకుంటే, బెల్ బాటం కుట్టించాల్సిందే.. షర్టు తీసుకుంటే ఎర్రటి రంగు, పెద్ద కాలర్లు  ఉండాల్సిందే..ఇప్పుడు ఆ అభిరుచులను తలుచుకుంటే, చిత్రంగా వుంటుంది. ఇప్పుడొస్తున్న  టెక్నాలజీల పుణ్యమా అని, ఈ మధ్య కొన్ని పాటలు వింటుంటే..(మనసు కోతి కదా..) కొన్ని తిక్క వ్యాఖ్యానాలు మనసులో  పుట్టాయి.. వాటిలో కొన్నిమీ కోసం 


“గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం… తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం…” (స్వయంవరం)
మరీ విడ్డూరం  కాకపోతే పడవలో ఓ జీ. పీ ఎస్.. కానీ  ఓ కంపాస్ కానీ పెట్టుకుని వెళ్లుండచ్చు  కదా…

“ఎక్కడున్నావమ్మా.. ఓ ప్రియతమా.. ఏది అనుకోనమ్మా.. నీ చిరునామా..దేశం కాని దేశం లో .. సాగరం లాంటి నగరం లో.. ఎప్పుడు ఎదురోస్తావో…” (ఒకరికి ఒకరు)
అన్ని కష్టాలు పడే బదులు, ఏ ఫేసు బుక్కునో, గూగులమ్మనో అడగొచ్చు కదా..

“చందమామా.. నీ ఎదుట నేను.. వారెదుట నీవూ… మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు  ..” (తేనె మనసులు) 
హాయిగా స్కయిప్ లో చూస్తూ మాట్లాడుకోవచ్చు కదా.. ఎందుకీ బాధలు.. 

ఈ పాటలన్నీ నాకు చాల ఇష్టమైనవి.. వాటిని belittle చేయటానికి కాదు.. just on the lighter vein .. అంతే 
Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s