ఆ చిత్రం ఆరంభ సన్నివేశం.. ఒక అద్భుతం

ఫార్రెస్ట్ గంప్.. ఓ అద్భుతమైన  చిత్రం.. ఈ సినిమాలో ఆరంభ సన్నివేశం బహుశా.. నేను ఇప్పటి వరకూ చూసిన అతి గొప్ప సీన్ అని చెప్పాలి.. ఆ ఒక్క సీన్ లోనే, రాబోయే మిగతా చిత్ర కథ అంతా ప్రతి ఫలిస్తుంది..

ఈ చిత్రం కథా నాయకుడు ఫారెస్ట్ గంప్ (టాం హాంక్స్). మానసిక ఎదుగుదల సాధారణంగా లేకపోయినా,   అతని హృదయం స్ఫటికం లాంటి స్వచ్చమైంది. అందరినీ ప్రేమించే గుణం.. మాటకి కట్టుబడి ఉండే మొండితనం లాంటి ధృఢత్వం అతని సొంతం. ఆర్మీ లో సైనికుడు గా కావచ్చు, మారథాన్ పరుగు తీసే వ్యక్తిలాగా కావచ్చు… నిర్మలమైన మనసుతో అతను చేసే పని ఏదైనా .. అందులో అతడు చూపే నిబద్ధత..ఇతరులను కూడా inspire చేసేంత శక్తివంతమైంది. అతడు తన చిన్న నాటి స్నేహితురాలి  పట్ల చూపే ప్రేమ కూడా అంతే నిజాయితీ కలది.. కాని ఆ ప్రేమ స్వచ్చతని అందుకోలేని దురదృష్టవంతురాలిగా మిగిలిపోతుంది ఆ స్నేహితురాలు. కొద్దిగా స్వాతి ముత్యం చిత్ర కథా నాయకుడి చాయలు కనిపిస్తాయి ఈ సినిమాలో. 

ఆ సన్నివేశంలో … గాలిలో తేలియాడుతున్న ఓ ఈక పై కెమెరా ఫోకస్ ఉంటుంది..  వీచే  గాలికి ఒడిదుడుకులకు  లోనవుతూ.. కాసేపు ఎత్తుగా  వెళ్తూ… అంతలోనే కిందకు వస్తూ.. చివరికి భూమిని తాకే సమయంలో, రోడ్డున వెళ్ళే కార్ల వేగానికి, మళ్ళీ పైకి రివ్వున లేస్తూ…  చివరికి బస్ స్టాపులో బెంచిపై కూర్చున్న హీరో  పాదాలను స్పృశిస్తుంది ఆ ఈక.. అతడు దానిని సుతారంగా చేతిలోకి తీసుకుని తన పుస్తకం లోపలి పేజీల మధ్యన దాస్తాడు. ఎక్కడో తేలుతూ.. ఎక్కడికో ప్రయాణిస్తూ.. అన్నిటినీ   అధిగమించి ఓ గమ్యం చేరుకునే  ఆ ఈక… మనిషి జీవన గమనాన్ని ఎంతో subtle గా అద్భుతంగా సూచిస్తుంది.ఈ సీన్ వస్తుంటే.. ఆ భావాన్ని మరింత elevate చేసే నేపధ్య సంగీతం కూడా అద్భుతం.

ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూడండి. 
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to ఆ చిత్రం ఆరంభ సన్నివేశం.. ఒక అద్భుతం

  1. అవునండీ! చాలా చక్కటి మూవీ, సున్నితమైన ప్రారంభం, అద్భుతమైన ప్రారంభ సన్నివేశం…

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.