బషీర్, మై ఫ్రెండ్

నా బాల్య స్నేహితులు అందరూ నాకు ఇష్టమే… కొందరు ఎక్కువ ఇష్టం.. వారితో రోజూ మాట్లాడుతూ ఉండక పోవచ్చు..వూరు వెళ్తే గంటల కొద్ది వారితో గడపక పోవచ్చు.. కాని వారి స్నేహ పరిమళాలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి.. సుతారంగా మనసు పొరలను స్పృశిస్తూనే వుంటాయి. 

సందర్భం ఉండదు.. కాని ఎందుకో ఒక్క సారిగా గుర్తొస్తారు  కొంత  మంది .. అలా  గుర్తొచ్చిన  వెంటనే మనసు ఎంతో రిఫ్రెష్ అవుతుంది.. అలాటి మిత్రులలో బషీర్ ఒకరు.. చిన్నప్పుడు మా స్కూల్లో మాతో పాటు చదువుకున్న నేస్తం. చక్కటి చేతి వ్రాత.. డ్రాయింగ్ లో చిన్నప్పుడే తన నైపుణ్యం చూపే వాడు. అదే తన జీవనాధారమైంది.  ప్రస్తుతం గిరిమ్పేట లో  కంప్యూటర్ సైన్ బోర్డ్స్ రాసే  దుకాణం నడుపుతున్నాడు. 

గత ముప్పై సంవత్సరాలుగా వూరికి చుట్టపు చూపుగా  వెళ్తూ వస్తున్న ప్రతి సారీ , గిరిమ్పేట రోడ్డులో వెళ్తుంటే… “భయ్యా..” అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. దగ్గరలో ఉన్న చాయ్ కొట్టులో టీ తాగించి, టీ బిల్లు పొరపాటున కూడా కట్టనివ్వడు. మీరు ఈ వెబ్ సైటు లో చూస్తున్న ఫోటోలో కనిపించే బ్యానరు తను రాసి ఇచ్చిందే.. ఉచితంగా రాసి ఇచ్చాడు. మేము మూడు సార్లు కలిసినప్పుడు, మా ఫంక్షన్ కి రాకపోయినా మా అందరితో టచ్ లో ఉన్నాడు. 

ఎప్పుడూ నవ్వు ముఖం.. నల్లటి ముఖం లో కొట్టొచ్చినట్టు కనపడే పలువరస.. పది మందికి సహాయ పడే మనస్తత్వం.. తన కొట్టులో ఎంతో మంది తక్కువ ధరకే బ్యానర్ రాయించుకు వెళ్తుంటే ఏమీ అనుకోని సహృదయం.. ఎన్నో సార్లు అనే వాడిని “ఇలా వుంటే నీ షాపు ఏమి నడుపుతావు. ఏం సంపాదించు కుంటావు?” అని. అన్నిటికీ నవ్వే సమాధానం. అన్నీ వున్నవాడు పది మందికి ఉచిత సేవ చేయటంలో గొప్పతనం లేదు.. తను ఆకలితో వున్నా ఇంకొకరి ఆకలి ని అర్థం చేసుకునే వాళ్ళు అతి కొద్ది మందే వుంటారు.. వాళ్ళందరూ రోజూ పేపర్ల లో చదువుకునే మహనీయులే అవ్వక్కర్లేదు… అలాంటి వాళ్ళలో మా బషీర్ లాంటి వాళ్ళు కూడా వుంటారు.

తనని చూసిన ప్రతి సారి ఏదో సహాయం చేయాలని ఉంటుంది …  స్నేహం తప్ప ఏదీ ఆశించని అభిమాన ధనుడు.. తను ఈ బ్లాగు చూసే అవకాశం లేదు.. ఏదో ఒక రోజు ఈ టపా చూసి, తన పట్ల మాకున్న అవ్యాజమైన అనురాగాన్ని ఇలా తెలుసుకుంటాడేమోనని ఓ చిన్ని ఆశ..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to బషీర్, మై ఫ్రెండ్

  1. ameer says:

    may god give him more good friends like u

  2. manchi mitrudu. keep your Great Friendship.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s