మలిసంధ్యన మంచు పూలు

భాగం-1

బోర్డు మీద “మలి సంధ్య” అన్న పేరు చూస్తూ  తన మూడేళ్ళ పాప సాహిత్యని చెయ్యి పట్టుకుని, విశాలమైన ఆ ఆవరణలోకి నడిచాడు రాజేష్. గేటు తీసుకు లోనకు వెళ్ళగానే, విశాలమైన ఆవరణ..ముందు లాన్, అక్కడ నీళ్ళు చల్లుతూ కొద్దిమంది వ్యక్తులు.. ఆ పక్కనే పిల్లలు ఆడుకోవటానికి గ్రౌండ్, అందులో ఆట వస్తువులు కనపడ్డాయి.. గ్రౌండ్ చూస్తూనే పాప ముఖం విప్పారింది. “రేపట్నుండి ఇక్కడేనా నేను ఆడుకునేది” అన్నట్టుగా తండ్రి వైపు చూసింది. అది గమనించని రాజేష్, ఇతర విషయాలను గమనిస్తూ లోన ఉన్న ఆఫీస్ వైపు నడిచాడు.

లోన అంతా ముసలి వాసన.. అంతా ఒకే ఈడు వాళ్ళు .. అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు.. తిరుగుతూ వున్నారు. ఏదో పెద్ద ఆఫీసుకోచ్చిన ఫీలింగ్ కలిగింది రాజేష్ కి. ఆఫీసు గదిలో టేబుల్, కుర్చీ .. అక్కడ ఓ ఆసామి కూర్చుని వున్నాడు.

“ఇక్కడ మేనేజర్ని కలవాలి…మీరు…?” అన్నాడు అతడి వైపు చూస్తూ…

“నా పేరు రాధాకృష్ణ. చెప్పండి.. పాపకి అడ్మిషనా  ..?” అని సూటిగా పాయింట్ లో కొచ్చాడు ఆ వ్యక్తి

“అవునండీ..”

“కూర్చోండి…ఈ ఫారం పూర్తి చేయండి..” అంటూ ఓ ఫారం ఇచ్చాడు.

పాప అలవాట్లు, తల్లి, తండ్రి ఉద్యోగ వివరాలు, పాప ఆరోగ్య వివరాలు… ఇలా ఎన్నో ఉన్నాయి.. ‘బోడి క్రెచ్ లో చేర్పించటానికి ఇన్ని వివరాలు రాయాలా..’ అని ఒకింత అసహనం రాజేష్ ముఖం లో కదలాడింది. వూర్లో అందరూ ఈ క్రెచ్ గురించి బాగా చెప్పటం వలన, రావాల్సి వచ్చింది… లేకుంటే ఇంటికి దగ్గరలోనే ఏదో ఒక ఏర్పాటు చేసుకునే వాళ్ళం అని మనసులో అనుకున్నాడు.

ఫారం పూర్తి చేసి ఇస్తూ, ఉండబట్టలేక అడిగేశాడు ఇన్ని వివరాలు అవసరమా అని.

నింపిన ఫారాన్ని తేరిపార చూస్తూ, “ఈ ఫారం మీ పాపని మీరెంత గమనిస్తున్నారో  తెలుసుకోటానికి.. ఇక్కడ మేము మా పద్ధతుల్లో, పాపని కేవలం పగలంతా కనిపెట్టుకుని  ఉండటమే కాదు.. ముందు ముందు తను చేరబోయే స్కూలు లో ఎదురయ్యే సవాళ్ళను దీటుగా ఎదుర్కునేలా, తనని అన్ని విధాలా future – రెడీ చేస్తాము మానసికంగా.. పిల్లల్ని చూసుకోటం మాకు ఇక్కడ వృత్తి కాదు..ఒక passion..”

“పిల్లల్ని ఏమైనా ఊరకే చూసుకుంటున్నారా .. డబ్బులిస్తున్నాం కదా.. ముసలోడికి బాగా తిమురు ఉన్నట్టుంది. అందుకే క్లాసు పీకుతున్నాడు ” అనుకున్నాడు రాజేష్ .

పాపతో పాటు రోజూ క్రేచ్ కి పంపాల్సిన వస్తువుల వివరాలు, చెప్పి, ” మీరు ఫుడ్ ఎక్కువ పంపకండి. తన ఇష్ట ఇష్టాలను బట్టి, మా వాళ్ళే ఫుడ్ సమయానికి తయారు చేసి పెడతాము. ఒకసారి మా ఆవరణ ని మీరు చూస్తే బాగుంటుంది. మీ పాప ఎలాంటి వాతావరణంలో ఉండబోతోందో మీకు కొంత అవగాహన వస్తుంది” అన్నాడు రాధాకృష్ణ

రాజేష్ అలాగేనంటూ తలూపి లేచాడు.

“బావా.. కొత్త అడ్మిషన్.. కాంపస్ చూపిద్దాము నువ్వూ రా..” అని కేకేసాడు. లోపలనుండి అదే యీడు మనిషి .. నుదిటి పై పొడవాటి నామం. “ఎవరూ వీళ్ళేనా  బావా..” అని అడిగి “రండి సార్” అన్నాడు రాజేష్ వైపు చూస్తూ..

“ఇతను నరేంద్ర. నా చిన్నప్పటి క్లాస్మేట్. మా ఆర్ధిక వ్యవహారాలన్నీ తనే చూస్తాడు. పదండి వెళ్దాం” అని పాప చేయి సుతారంగా చేతిలోకి తీసుకుని లేచాడు అడ్మిషన్ ఇచ్చిన వ్యక్తి.
అందరూ కాంపస్ చూడటానికి ఆఫీస్ బయటికొచ్చారు.
(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s