మలి సంధ్యన మంచు పూలు (మలి భాగం)

(తొలి భాగం లో
తన మూడేళ్ళ కూతురితో ఓ క్రేచ్ కి వెళ్తాడు రాజేష్. అంత ఒకే ఈడు ఉన్న ముసలి వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ, అడ్మిషన్ కోసం రాధాకృష్ణ ని కలుస్తాడు. రాజేష్ కి క్రేచ్ ఆవరణ చూపించటానికి రాధాకృష్ణ, అతడి మిత్రుడు నరేంద్ర బయల్దేరుతారు.
ఇక చదవండి..)

రాధాకృష్ణ, నరేంద్రతో పాటు రాజేష్, అతడి పాప ఆవరణ అంతా కలియ తిరిగారు.. పూల తోటలు, చిన్న వెజిటబుల్ గార్డెన్.. ఎంతో ఆహ్లాదంగా ఉందక్కడ.. ఏదో తెలియని serenity ప్రసరించ సాగింది రాజేష్ లో  . ఇంకో పక్కన అందరూ కూర్చోటానికి బల్లలు, రీడింగ్ రూం. వెనక వైపు హాస్టల్ లాంటిది కనపడేసరికి, రాజేష్ కి కుతూహలం ఎక్కువైంది. “ఇవేంటండీ  ..” అనడిగాడు.  “మేమంతా ఇక్కడే ఉంటాం. అది మా లివింగ్ రూమ్స్.” అని చెప్పాడు నరేంద్ర.

అదేమిటి మీరిక్కడ ఉద్యోగాలు చేస్తూ.. మీ ఇంటికి కూడా వెళ్ళరా..” అడిగాడు రాజేష్.

“మా ఇల్లు, మా ప్రపంచం .. అంతా ఇక్కడే.. ఇకపోతే మీ పాపకి మేము ఇచ్చే ఫుడ్ కూడా చాల hygienic గా ఉంటుంది.. మీరేం అనుమానం పెట్టుకోనక్కర్లేదు..రండి మా కిచన్ చూద్దురు గాని..” అని నరేంద్ర ముందుకు నడిచాడు.

లోపల ఓ పెద్ద కిచెన్ ఉంది..శుచి శుభ్రత  కి మారు పేరు అనుకోవచ్చు.. ఒకే ఈడు వాళ్ళు అక్కడ కూడా.. ఆడ వాళ్ళు వంటలు చేస్తుంటే, మగ వాళ్ళు కూరలు తరగటం లాంటి పనులు చేస్తూ సాయ పడుతున్నారు.

“మా గ్రూప్ ని పరిచయం చేస్తాము రండి.” అని రాజేష్ కి చెప్పటం మొదలెట్టాడు రాధాకృష్ణ.

“ఇతడు షమ్షీర్..ఇతడు శివ  కుమార్ ఇతడు రాజ చంద్ర.. ఇతడు రాజన్న.. ఇతడు అభి…  ఈవిడ   ….” ఇలా అందరినీ పరిచయం చేస్తూ పోయాడు.

“మీరందరూ, ఇక్కడే ఉంటారా. అసలు మీరు ఇక్కడ ఎలా కలుసుకున్నారు” అని అడిగాడు రాజేష్ మరింత ఆశ్చర్యపోతూ.

“ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏభై ఏళ్ళ క్రితం, ఒకే స్కూల్ లో ఒకే తరగతిలో చదువుకున్న  క్లాస్ మేట్స్… జీవనోపాధి కోసం తలో ఊరూ వెళ్ళిన మేమంతా, ముప్పై ఏళ్ళకు మా వూళ్ళో ఓ సారి కలిసాము. ఆ కలయిక మా జీవితాల్ని ఓ మలుపు తిప్పింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒకప్పుడు కలిసేవాళ్ళం. కేవలం కలవటమే కాదు, అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేసుకోటం మొదలు పెట్టాం. తీరిక దొరికితే రోజూ, ఎవరో ఒకరు ఫోన్ లో పలకరించుకునే వాళ్ళం. కేవలం స్నేహం అనే బంధం మా అందర్నీ కలపటంతో, మా అందరిలో ఒకరికొకరు ఉన్నామన్న భావన మొదలయ్యింది. మాలో ఎవరికీ భేషజాలు లేవు. ఎవరెంత పొజిషన్ లో ఉన్నా, మేము కలిసిన సమయం లో అందరం మా స్కూల్ లో ఎలాగైతే గొడవ పడుతూ, ఇష్ట పడుతూ ఉండేవాళ్ళమో , అలాగే ఉండే వాళ్ళం.

అలా గడిచే కొద్దీ మాకు ఓ ఆలోచన వచ్చింది. అందరూ వారి వారి బాధ్యతలు ముగించుకున్నాక, అందరూ ఒకే ప్లేస్ లో మా విశ్రాంత జీవితాన్ని గడిపితే ఎలా వుంటుందీ అని. ఓ పదిహేను ఏళ్ళ క్రితం ఈ ఆలోచనకు రూప కల్పన చేసుకున్నాం. అందరూ, రోజూ పది రూపాయలు పొదుపు చేయటం, నెలకో సారి ఒక కామన్ ఖాతాలో  జమ చేయటం..

ఆ డబ్బులు, మరి కొంత మంది ఇచ్చిన విరాళాలతో స్థలం తీసుకుని, రిటైర్ అయ్యాక ఒక్కోళ్ళు ఇక్కడకొచ్చి, ఈ  ఆవరణని ఏర్పరిచాం. మాకు చేతనైన పనిని మా వ్యాపకం గా మార్చుకుని, ఈ క్రేచ్ మొదలెట్టాం”

ముగించాడు రాధాకృష్ణ .

ఓ అరుదైన కాన్సెప్ట్ ని విన్న రాజేష్ కి ఆశ్చర్యంతో పాటు మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి..

“అంటే ఇదంతా మీ పిల్లలు ఎలా స్వీకరించారు?’

“ఇది పిల్లల నుండి దూరంగా వెళ్ళటం కోసం చేసుకున్నది కాదు..ఇప్పటికీ పిల్లలకు ఎప్పుడు అవసరమైనా మేము  వెళ్తాం. వాళ్ళూ వస్తుంటారు. ఎవరి పిల్లలోచ్చినా, అందరూ మా పిల్లలే.. మాతో హాయిగా గడిపి వెళ్తారు. ఉద్యోగరీత్యా పేరెంట్స్ ని చూసుకోలేని వాళ్లకు, వాళ్ళ తల్లి తండ్రులు ఇక్కడ క్షేమంగా  ఉన్నారని నిశ్చింత..పిల్లల నుండి వ్యతిరేకత వచ్చిన కొద్ది మంది అభాగ్యులకు, పిల్లలకు భారం కాకూడదనుకున్న ఇంకొంత మందికి   మేమున్నామన్న భరోసా..పదిహేనేళ్ళ  ముందే మేము ఇలా అనుకోవటంతో అందరికీ వారి చివరి దశ గురించి ఓ క్లారిటీ వచ్చింది.”

“మరి మీ ఆరోగ్యం.. మీ యోగ క్షేమాలు ఎవరు చూసుకుంటారు”

“ఈ ఆవరణలోనే ఓ రూం. అందులో మాలో ఉన్న డాక్టర్స్ రోజూ మా ఆరోగ్యాన్ని చూసుకుంటారు. ఏదైనా పెద్ద సమస్య వస్తే, నర్సింగ్ హోం లో చేర్పించి మేమే చూసుకుంటాం.”

“ఈ ఎస్టాబ్లిష్మెంట్ ని ఎలా నడుపుతున్నారు.. ఆర్ధిక సహాయం ఎలాగా..”

“కొంతమందికి పెన్షన్ వస్తుంది. కొంత మందికి పిల్లలు పంపుతారు..ఎవరినీ ఇంత వేయమని అడగం..మా కామన్ అకౌంట్ లో వేసేస్తాం.  అందరికీ తెలుసు మా అవసరాలెంతో… ఎవరి శక్తి, strength బట్టి, వాళ్ళు అందరికీ ఉపయోగపడే బాధ్యతలు తీసుకుంటాం.. మా అందరికీ ఒకే కిచన్.. ఒకే డైనింగ్ హాల్. అందరూ కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ.. తింటాం.. తిరుగుతాం.. సాయంత్రం వేళల్లో ఆడుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే.. మేము ఇక్కడ మా ఏభై ఏళ్ళ ముందు జీవితాన్ని మళ్ళీ అనుభవిస్తున్నాం… ఆస్వాదిస్తున్నాం  ..”

“ఒకరికి భారం కాకూడదని, ఒకే అవసరం ఉన్న వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలని మీరు చేసుకున్న ఏర్పాటు చాల బాగుంది..ఒక చిన్న సంశయం.. మీరు అందరూ మీరు సెటిల్ అయ్యిన  ఊళ్లలో ఉన్న ఏదైనా ఆశ్రమాలలో చేర వచ్చు కదా.. ఇలా ఇంత దూరం వచ్చి..” అంటూ  ఆగి పోయాడు రాజేష్

రాజేష్ కళ్ళలోకి ఓ సారి నవ్వుతూ చూసి, రాధాకృష్ణ” నిజమే.. కాని అక్కడ మేము ఒకళ్ళనొకళ్ళని   బావా అనో, ఒరే, ఏం వే అనో పిలుచుకోలేం కదా..” అన్నాడు.

జీవన మలి సంధ్య లో అలా అందరూ నాటి బాల్యపు క్షణాల మంచు పూలను ఒకే చోట ఏరుకుంటూ ఉన్న వాళ్ళను చూసి రాజేష్ ఓ కొత్త లోకంలోకి వెళ్ళాడు..

“రాధాకృష్ణ గారు.. బాగుందండీ. ఒకటడుగుతాను.. ఏమనుకోరు కదా..?

“ఇంత క్లాసు తీసుకున్నా ఇంకా అనుమానాలా.. ఏమనుకోను.. అడగండి..” అన్నాడు రాధాకృష్ణ నవ్వుతూ

“రాబోయే రోజులలో ఇప్పుడున్నంత ఆక్టివ్ గా ఉండలేరు కదా.. ఒక్కొక్కరు శాశ్వతంగా వెళ్ళిపోతారు.. అప్పుడెలా..?”

కాసేపు మౌనం … రాధాకృష్ణ తో పాటు అక్కడున్న ఆ మిత్ర బృందం కూడా కొద్ది సేపు ఏం మాట్లాడలేదు..

నరేంద్ర అందుకుని..”ఇంత మంది మన వాళ్ళతో  ఉంటూ  వెళ్తే, అందులో ఓ తృప్తి వుంటుంది.. నవ్వుతూ బతకాలిరా … నవ్వుతూ చావాలిరా అన్నారు కదా.. .. అదే జరుగుతుంది ఇక్కడ..” అన్నాడు.

అంత వరకూ మౌనం గా ఉన్న రాజ చంద్ర..”రాజేష్ గారు … మేమంతా పైకెళ్ళినా  అక్కడ కూడా ఒకటే చోట ఉండటానికి, ప్లాను సిద్దం చేసుకున్నాం..” అనే సరికి అక్కడి వాతావరణం తేలికయ్యింది.


Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to మలి సంధ్యన మంచు పూలు (మలి భాగం)

  1. చాలా బాగుంది. మీ నవ్యమైన ఆలొచనలు ఆచరణలొ కనబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను . స్నెహమేరా జీవితం.ప్రశాంత జీవనమార్గం+సేవా తత్పరత రెండు అభినందనీయమే నండీ!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s