మీరూ ఓ రోజు గడిపి చూడండిలా…

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భాన అనుకుంటూనే ఉంటారు… ” ఆ రోజులే వేరు.. ఒక్క సారి మళ్ళీ ఆ గతాల లోకి వెళ్తే ఎంత బాగుండును” అని. ప్రస్తుతం  టీ. వీ. ఇంటర్నెట్, మొబైల్, ఒకప్పుడు ఉన్నత (ఆర్థికంగా) వర్గానికే అందుబాటులో ఉండి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్న విమాన యానం, షాపింగ్ మాల్ , మల్టీప్లేక్స్ ల సరదాలు.. మన జీవితాలను, జీవించే శైలిని సమూలంగా మార్చి ఉండొచ్చు… కాని ఎక్కడో మనసు అట్టడుగు పొరల్లో ఓ అసహనపు, నిస్సహాయపు ఆక్రందన వినిపిస్తూ ఉంటుంది… గతించిన నాటి క్షణాల కోసం..

ఈ so called ఉపకారణాలేవీ  లేకుండా ఒకప్పుడు నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించే వాళ్ళం.. మనవ సంబంధాలకు విలునివ్వటానికి, అర్థం చేసుకోటానికి సమయం, వీలు ఉండేవి.. కాని ఇప్పుడు..?

ఈ మధ్య ఒక రోజు, ఇలాంటి సందర్భమే ఎదురయింది.. నేను వెళ్ళిన ప్రదేశం లో మొబైల్ పని చేయదు.. కనుక మొబైల్ మాటి మాటికీ చూసుకునే అవసరం (ఏవైనా మిస్స్డ్ కాల్స్ , ఎస్. ఏం. ఎస్ లు కాని ఉన్నాయేమో అని)  పడలేదు. టీ.వీ. , వేరే సమాచార సాధనాలు కూడా అందుబాటులో లేవు.. వీటికి తోడు.. పట్టుకెళ్ళిన  రెండు వాచీలు కూడా కూడబలుక్కుని ఆగిపోయాయి. దాంతో సమయమెంతో కూడ తెలిసే అవకాశం పోయింది. పైగా అది వారాంతం కావటంతో.. వీటి అవసరం  కూడ రాలేదు. ఒక్క సారిగా బాహ్య ప్రపంచంతో పూర్తి సంబంధం తెగిపోయిన ఫీలింగ్ కలిగింది. అందువలన.. పూర్తిగా ఇప్పుడు మన జీవితంతో అల్లుకుపోయిన అన్ని సాధనాలేవీ లేకుండా ఓ ఇరవై నాలుగు గంటలు.. పూర్తిగా నాకే.. నా కోసమే..ఎంతో ఈ అరుదైన కాలాన్ని పొందేసరికి, ఒక్క సారిగా.. కాల గమనంలో ముప్పై ఏళ్ళ నాటి రోజుల్ని పొందిన అనుభూతి కలిగింది.. నాలో నేను తొంగి చూసుకోవటానికి.. పరుగెడుతుంటే .. ఓ సారి ఆగి ఎంత దూరం వచ్చాం.. ఎటు వెళ్తున్నాం లాంటి ప్రశ్నల్ని మనకి మనమే సంధించుకోటానికి ఈ సమయం చక్కగా ఉపయోగపడింది.. I got that rare opportunity to listen to myself.

అప్పుడు నిజంగా అనిపించింది.. అప్పుడప్పుడూ ఇలాంటి gadget holiday స్వయం ప్రకటించుకుని ఒక్క రోజైనా గడపాలని. కావాలంటే మీరూ ఓ సారి ఇలాంటి రోజుని గడిపి చూడండి..

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s