ఈ సంవత్సరంలో వచ్చిన పాటలు – my pick

ఇంకో సంవత్సరం ముగియనుంది.
సంగీత పరంగా అంతగా ఆకట్టుకునే పాటలు రాకపోయినా, కొన్ని హమ్ చేసుకొనేలా ఉన్న పాటలు కొన్ని వచ్చాయి. నేను విన్న, నాకు నచ్చిన పాటలు (ఈ సంవత్సరంలో విడుదలైన  సినిమాల నుండి)
1 . “కుదిరితే కప్పు కాఫీ” చిత్రంలో  “అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా.. దగ్గరకొచ్చే తోవల  వెంటే వెళిపోవాలా ..”. కొత్త సంగీత దర్శకుడి (సిరివెన్నెల గారి కుమారుడు యోగేశ్వార్ శర్మ) నుండి ఇలాంటి పాట రావటం విశేషమే.. ఈ పాట కి ఆదరణ రాలేదు కానీ.. నాకు మాత్రం ఆ పాట బీట్ బాగా నచ్చింది. ఈ పాట ప్రోమోస్ లో చాల బాగా అనిపించింది.. సినిమాలో చిత్రీకరణ ఇంకా బాగా చేసుండొచ్చు అనిపించింది.
2 . “అలా మొదలైంది” లో “చెలీ వినమని… చెప్పాలి మనసులో మాటని“..ఈ పాట నచ్చటానికి ముఖ్య కారణం ఈ పాట అద్భుత చిత్రీకరణ.కోరియోగ్రఫీ కూడా బాగుంటుంది.
3 . “అలా మొదలైంది” లోనే “ఇన్నాళ్ళూ నా కళ్ళూ గ్రహించలేదు నువ్వు నన్ను చూస్తుంటే.. చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని..” అన్న పాట. ఈ పాట pathos మూడ్ లో సాగుతూ విన సొంపుగా ఉంటుంది. ఈ పాటలో “ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించటం, ఎలా ఎలా గతాలనే ఇవాళగా  మార్చటం..” అన్న చరణాలు నాకు చాల నచ్చింది.
4 . “రంగం” లో “ఎందుకో ఏమో.. తుళ్ళి తిరిగెను మనసే..” ఈ పాట కొరియో గ్రఫీ చాలా graceful గా ఉంటుంది.. మొదటి చరణం ముందు వచ్చే హమ్మింగ్ బాగుంటుంది. ఆ ఒక్క బిట్ లో మాత్రం చిత్రీకరణ కాస్త మూడ్ కి భిన్నంగా deviate అయ్యింది.
5 మిస్టర్ పెర్ఫెక్ట్ లో “చలి చలి గా అల్లింది… గిలి గిలిగా గిల్లింది..”.. ఈ పాట నాకు నచ్చటం నాకే surprise . ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ పాటలు నాకు నచ్చే పాటల genre లో ఉండటం అరుదు. సన్నివేశ పరంగా, ఈ పాట చాల క్యూట్ గా చిత్రీకరించారు. శ్రేయ ఘోషాల్ గాత్రం ఈ పాటకి మరింత అందాన్నిచ్చింది.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to ఈ సంవత్సరంలో వచ్చిన పాటలు – my pick

  1. అన్ని పాటలు బాగున్నాయి. మొదటి పాట ,ఆఖరి రెండు చాలా బాగుంటాయి. నవతరం పాటలని జల్లెడ వెస్తే .. గులక రాళ్ళలా మంచి పాటలు వస్తాయని..కొత్త నిర్వచనం చెప్పుకొవాల్సి వస్తుంది:-))))))

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s