మెటా క్రాలర్, డాగ్ పైల్…. వీటినెప్పుడైనా విన్నారా..?

ఈ మధ్య ఓ పదం మనం చాల సాధారణంగా వాడేస్తున్నాం.. అదే “గూగుల్” .. “ఓ సారి గూగుల్ చేసి చూడు..” అనో “the most googled star ” అనో అంటుంటాం. గూగుల్ అన్న పదాన్ని నిఘంటువులో ఓ క్రియ (వెర్బ్) లాగ చేర్చే తరుణం వచ్చేసింది. ఓ చిన్న సెర్చ్ బార్ తో మొత్తం ప్రపంచాన్ని మనముందు ఆవిష్కరిస్తున్న గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ , జనబాహుళ్యంలోకి    రాక మునుపు, వేరే సెర్చ్ ఇంజిన్లు వాడుకలో ఉండేవి. అప్పట్లో ఎందుకబ్బా ఈ సెర్చ్ ఇంజిన్లు అనుకునేవాళ్ళం. ఎవరో అన్నారు, “ఓ బండెడు గడ్డిమోపులో గుండు సూదిని వెతకటం” కోసమే ఈ సెర్చ్ ఇంజిన్లూ అని.

ఇంటర్నెట్ వాడుకలోకి వచ్చిన మొదట్లో, నాకు బాగా గుర్తున్న   సెర్చ్ ఇంజిన్లు మెటా క్రాలర్, డాగ్ పైల్, ఆల్టా విస్టా, ఐ సీక్ యు, ఆల్ ది వెబ్… తరవాతి రోజుల్లో యాహూ కూడా వాడుకలో వుండేది.. గూగుల్ వచ్చిన మొదట్లో ఇదేంటి క్రికెట్ లో “గూగ్లీ” అనే పదం నుండి ప్రేరణ పొంది ఈ పేరు పెట్టారేమో అనిపించేది.. తరవాతి రోజుల్లో ఈ గూగుల్ ఓ ప్రభంజనంలా మారి ఇతర సెర్చ్ ఇంజిన్ల మనుగడే ప్రశ్నార్ధకం చేయ గలదని ఊహించాలేదానాడు.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s