నేను ఖాన్ దాదాగా మారిన వేళ..

మూడు సంవత్సరాల క్రితం… మా స్కూల్ మిత్రుల వివరాలన్నీ పోగు చేస్తున్నాం, ముప్పై ఏళ్ళ తరవాత మా వూళ్ళో అందరం కలవటానికి.. ఎప్పటికప్పుడు, మిత్రుల ఫోన్ నంబర్ లను  అందరితో పంచుకోవటం, వారందరికీ గ్రూప్ ఎస్. ఎం. ఎస్ పంపటం లాంటివి చేస్తున్నాం..

మేము మా వూళ్ళో కలవటానికి ఇంకో నెల ఉంది అప్పటికి..

ఓ ఉదయం… ఓ కొత్త నంబర్ నుండి ఫోన్ కాల్. ” ఎవరూ…” అంటూ నా పేరుని అడిగారు ఓ అమ్మాయి.. నా పేరు విన్న వెంటనే పెద్ద అరుపు.. “ఒరేయ్ నేన్రా…గుర్తు పట్టావా..?” అంటూ తన పేరు చెప్పింది. నేనూ గుర్తు పట్టేశాను కాని ఒరేయ్ అనటమేమిటా  అని కొంత సంశయం… ఎందుకంటే నన్ను ఒరేయ్ అని చనువుగా పిలిచేవాళ్ళు అతి తక్కువ.. .

కొంత సేపు మా క్షేమ సమాచారాలు అడిగాక..”నువ్వు అప్పుడు పాటలు బాగా పాడేవాడివి కదా..?” అని ఓ ప్రశ్న. నేనెప్పుడు పాడేనబ్బా   అని సందిగ్ధం లో పడ్డాను.. తరవాత గుర్తొచ్చింది ఓ సారి నేను, రాజంపేట చిన్నోడు సాహసోపేతంగా పాడిన పాట తను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నందుకు సంతోషించి “అవును… అప్పట్లో ఏదో… అలా.. అలా వర్క్ అవుట్ అయ్యింది” అన్నా మొహమాటంగా..

“నీ మొహం… నీ పాటలు  ఎంత బాగుండేవో  తెలుసా..?” … అని తను అనేసరికి ఉలిక్కి పడ్డాను..ఈ సారి కాస్త ధైర్యం తెచ్చుకుని..” నువ్వు నేను అనుకుంటున్న వ్యక్తి కాదేమో..నేనెప్పుడూ ఆ ఒక్క పాట తప్ప వేరే పాటలేవీ పాడలేదే..” అన్నా.

వెంటనే..”అదేమిటి అలా ఎలా మరిచిపోయావు.? నువ్వు పాటలే కాదు.. డాన్సు చేసేవాడివి. అదన్నా గుర్తుందా…”అంది.

“లాభం లేదు… నువ్వు తప్పకుండా పోరపడ్డావు. నేను పాటలకి, డ్యాన్సులకి  ఆమడ దూరం” అన్నా. కాని మిగతా కొన్ని వివరాలు నా గురించి చెపుతుంటే సరిపోవటంతో… తను నన్ను సరిగ్గా గుర్తు పట్టిందో లేదో అనే నమ్మకం కుదరక ,నేను ఓ గ్రూప్ లో ఉన్న ఫోటోని తనకి మెయిల్ పంపాను, నేనెక్కడో గుర్తు పట్టమని. వెంటనే నన్ను గుర్తుపడుతూ రిప్లై మెయిల్. “ఇప్పటికైనా నమ్ముతావా.. నిన్ను సరిగ్గా పోల్చుకున్నానని..” అని తన ప్రశ్న.

అలా రెండు రోజులు ఫోన్ లో ఉత్తర ప్రత్యుత్తరాలయాక    .. మళ్ళీ అడిగాను, “మరి… మరి… నేను నిజంగా డాన్సు చేసానంటావా  ..?” అని బెరుగ్గా..

తనకి కోపం వచ్చేసింది..”మళ్ళీ అదే ప్రశ్నా..నీ డాన్సు చాల బాగుండేది…ముఖ్యంగా “తకిట తదిమి తందానా..” ఆన్న పాటకి  నీ డాన్స్ ఎంత బాగుండేదో. ” అనేసరికి మళ్ళీ అదిరిపడ్డాను.. నేనేంటి ఆ పాటకి డాన్సు చేయటమేమిటి అని.. తను అంత నమ్మకంగా చెపుతుండటంతో… ఆ ఖాన్ దాదా లాగా “ఏమోలే నేను నిజంగా డాన్స్ చేసే ఉంటాను..” అని ఫిక్స్ అయిపోయాను. కాని వెధవది.. ఆ పాటలోని ఒక్క movement కూడా ఇప్పుడు చేయలేకపోతున్నా  కదా అని మధన పడ్డాను.

రెండు రోజులయ్యాయి ..తన నుండి ఓ ఫోన్ కాల్..

“సారీ.. నీ పేరే ఉండే మన జూనియర్ ని నువ్వు అనుకుని పొరపడ్డాను.. అసలేమయిందంటే.. నేను ఒక సంవత్సరం మీతో చదవకుండా, జూనియర్ బాచ్తో చదివాను.. అందుకే తన డాన్స్ నువ్వు చేసేదే అనుకుని పొరపడ్డాను .. నువ్వు ఫోటో పంపినప్పుడు, నీతో ఎలాగూ ఒక సంవత్సరం చదివాను కాబట్టి, నిన్ను గుర్తు పట్టాను..” అని చెప్పే సరికి గాలిలో నృత్యం చేస్తున్న నా కాళ్ళు ఒక్క సారిగా భూమి మీదకి వచ్చాయి.

కొన్ని కథలు అంతే… ముగింపు విషాదమే.:(

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to నేను ఖాన్ దాదాగా మారిన వేళ..

  1. dance cheyakapote,paata paadakapoyinaa parvaaledu..ippudu.. baagaa vraasthunnaaru kadaa!! aanandamaanandamaaye!! antaaru mitrulu. kaavaalante..adigi choodandee!!!???

  2. suparandi….muginpu lo vishadam ledu hasyam undi….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s