“సెల”ఏటి గల గలలా..చిర చిరలా..?

ఒక్కో సారి కాలం వెనక్కి  కనీసం పదేళ్ళు వెనక్కి వెళ్తే బాగుండుననిపిస్తుంది..ప్రాణం లేని వస్తువులు జీవ  రాశుల్నిప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో.. నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించిన ఆ పాత రోజులు వస్తే ఎంత బాగుంటుందో…?

జీవితాన్ని నిర్దేశిస్తున్న ఆ నిర్జీవ పదార్థాలలో ముందుగా చెప్పుకోవాల్సింది.. సెల్ ఫోన్. శంకరాభరణం లో కుర్చీ జరుపుతూ పక్క వారితో మాట్లాడుతున్నందుకు శంకర శాస్త్రి గారికి ఎలా కోపం వస్తుందో   గుర్తుంది కదూ. ఇప్పుడున్న పరిస్థితులలో  ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడో, ఎవరైనా క్లాస్ తీసుకుంటున్నపుడో , ఎవరిదో సెల్ మోగుతుంది..అది ఎంత disturbing గా ఉంటుందో మనకి తెలియంది కాదు. కాని.. తప్పదు.. కొంత మంది.. అక్కడే ఫోన్ లో బిగ్గరగా మాట్లాడుతూ వుంటారు. తాము వినకపోవటమే కాక, ఎదుటి వాళ్ళనీ క్లాసు విననీయరీ మహానుభావులు.
ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్లో ఏదైనా ప్రార్థనా గీతం ఆలపించేటప్పుడు, కేవలం గీతం ఒక్కటే వినిపించేది.. ఇప్పుడు ఎవరి సెల్ ఎప్పుడు మోగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భాలలో ఫోన్ ని కనీసం సైలెంట్ మోడ్ లో ఉంచుకోవాలనే ఆలోచన కూడా రాదు.

**************************
రద్దీగా ఉన్న రోడ్డు.. అందులో వేగంగా వెళ్తున్న బైకు.. బైకు పై వున్న కుర్రాడి చేతిలో హ్యాండిలు  .. తల మెడకు ఓ వైపు వాలిపోయి వుంటుంది.. మెడ తగిన కోడిలాగా.. తనలో తనే ఏదో మాట్లాడుతూ ఉంటాడు… ఏంటా అని పరికిస్తే.. మెడకి, వాలిన తలకి మధ్యలో ఇరుక్కున్న ఓ సెల్ ఫోన్.. ఎంతో ఏకాగ్రతతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి కేవలం subconscious senses తో బండి నడిపిస్తుంటాడు.. ఒక్కో సారి అలా మాటలాడుతూ  రోడ్డు మధ్యలో బండి నడుపుతుంటారు వెనక వస్తున్న వాహనాలను అడ్డగిస్తూ …  .. ఆ సమయంలో ఊహించరానిది ఏదైనా జరిగితే.. ప్రమాదం అతనికే కాదు.. చుట్టూ పక్క వాళ్లకు కూడా..
******************************
ఎవరితోనైనా అపాయింట్మెంట్ ఉన్నపుడు, వారి ముందు కూర్చున్నాక, ఇద్దరిలో ఎవరిదో ఫోన్ మోగుతుంది… అవతలి వ్యక్తి తన కోసం నిరీక్షిస్తున్నాడన్న  స్పృహ కూడా లేకుండా గంటలకొద్దీ ఫోన్ లో మాట్లాడుతూ ఉండిపోతారు.. ఎదుటి వ్యక్తి సహనాన్ని పరీక్షిం చటమే కాదు… వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేస్తున్నామన్న భావన కలగదు ఎందుకో..
మొబైల్ ఫోన్ తో ఉపయోగమెంతో  ఉంది.. కాని అది మన జీవితాలు శాశించేంతగా ఉండకూడదు… మీరేమంటారు..?
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to “సెల”ఏటి గల గలలా..చిర చిరలా..?

  1. nijam bahu sunnitamgaa cheppaaru. ..janam aalochincharu.itarulaki ibbandi tappadu. cell phone..vaddandi..anipisthundi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s