మౌసమ్ (2011 ) – చూడదగ్గ సినిమా…

కానీ ఎవరూ చూడలేదెందుకో  … ఇదీ టాగ్ లైన్.

ప్రేక్షకుల నాడి పట్టుకోవటం, ఎవరి వలనా సాధ్యం కాదేమో అనిపిస్తుంది మౌసమ్ చిత్రం చూసాక.. చిత్రం చక్కగా తీసారు… కాని సినిమా హాళ్ళలో ఇట్టే వచ్చి అట్టే పోయింది.. ఒక రెయిన్ కోట్ లాంటి సినిమాని మనం ఎందుకు ఆదరించలేకపోయామో చూసాక, ఈ చిత్రం ఆదరించ లేకపోయినందుకు, పెద్దగా ఆశ్చర్యం అయితే కలగలేదు..
ఇకపోతే ఈ చిత్రం నేను చూడటానికి ఒకే కారణం.. చిత్ర దర్శకుడు పంకజ్ కపూర్ (remember karamchand of earlier tv serials?) కావటమే.. ఒక చక్కటి నటుడుగా తన సినిమాలు (రాఖ్, రోజా లాంటివి) చూడటం వలన.. దర్శకునిగా అతడి తొలి చిత్రమైనా ఎందుకో చూడొచ్చనే నమ్మకం కలిగింది. నా నమ్మకం వమ్ము కాలేదు.

ఒక కాశ్మీరీ యువతీ (సోనమ్  కపూర్) కి, ఒక పంజాబీ యువకుడికి (షాహిద్ కపూర్) మధ్య వివిధ దశలలో సున్నితంగా రూపు దిద్దుకునే ప్రేమ గాదే ఈ చిత్రం ముఖ్య సారాంశం. ఆకర్షణ అనే భావం నుండి మొదలై, విధి ఆడే ఆటల మధ్యలో ఎన్నో పరీక్షలు, నిరీక్షణలను  తట్టుకుని నిలిచే ప్రేమని చాలా సున్నితంగా ఆవిష్కరించారు.

కాశ్మీర్ నుండి పంజాబ్ లోని ఓ గ్రామంలో ఆశ్రయం పొందటానికి వచ్చిన ఆయాత్ కి, ఆ గ్రామంలోని  యువకుడు హారి (హర్విందర్ సింగ్) కి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఆయాత్ ఒక రోజు హఠాత్తుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనని పోగొట్టుకున్న హారి, ఎయిర్ ఫోర్సు లో ఆఫీసర్ గా కొంత కాలానికి స్కాట్ లాండ్ కి వెళ్తాడు. ఏడేళ్ళ తరవాత, అక్కడ  హఠాత్తుగా ఎదురైనా ఆయాత్ ని చూసి సంభ్రమాశ్చర్యాలు పొందుతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోటానికి పెద్దల అనుమతి కూడా పొందుతారు.. కాని ఉద్యోగ రీత్యా, దేశం యుద్ధం లో పాల్గొనటానికి, ఇండియా వచ్చిన హారి మళ్ళీ తనని పోగొట్టుకుంటాడు. తనని వెతికే ప్రతి ప్రయత్నమూ  ఫలించదు. యుద్ధంలో తీవ్రంగా గాయపడి, హారి ఎడమ చేయి అచేతనమైపోతుంది. ఈ పరిస్థుతలలో మళ్ళీ, స్కాట్లాండ్ పరిసరాలలో వెతుక్కుంటూ వెళ్లి, ఆయాత్ ని ఇంకో చోట ఒక పురుషుడు, పిల్లవాడితో చూసి తనకి పెళ్లి అయ్యిందని  తన నుండి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాడు. కొంత కాలం తరవాత, ఆహ్మేదబాద్ లో మత ఘర్షణల నేపధ్యంలో ఆయాత్ ని రక్షించి, తను ఇంకా తనకోసమే నిరీక్షిస్తోందని తెలుసుకుని,  తనని స్వీకరిస్తాడు.

పంజాబ్ లోని గ్రామీణ వాతావరణాన్ని, స్కాట్లాండ్ అందాలను చక్కటి చాయాగ్రహణం ద్వారా మన ముందు ఉంచారు.  షాహిద్ కపూర్ భిన్నమైన మూడ్స్ ని చక్కగా అభినయించ గలిగాడు. మన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను కథా నేపధ్యంలో వాడుకోవటం కూడా బాగుంది.  అతని ఎయిర్ ఫోర్స్ లో చేసే విన్యాసాలు, కథ యొక్క మెయిన్ మూడ్ కి దూరంగా వున్నా, ఆసక్తికరంగానే చూపించారు. ఎన్ని సార్లు కలిసి విడిపోతున్నా, ఎక్కడా అపార్థానికి గురి కాకుండా నాయికా నాయకులకి ఒకరి పై ఒకరికున్న నమ్మకాన్ని, ప్రేమని చూపటం బాగుంది.  చిత్రం ముగింపు మాత్రం ఇంకొంచం బాగా తీసుండ వచ్చు అనిపించింది.

కథా పరంగా extra ordinary కాకపోవచ్చు.. taking  దృష్టి కోణం లో చూస్తే, చిత్రం ఆద్యంతం స్మూత్ గా సాగి పోతుంది.. ఎక్కడా బోర్ కొట్టదు. మరీ గొప్ప చిత్రం కాకపోయినా, ఇంతగా నిరాదరణ పొందాల్సిన చిత్రమూ కాదిది.. Truly it deserves one more look ..

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s