బ్లాక్ బెర్రీ ప్లేబుక్ – వేలంవెర్రి కొలవేరి గా మారే అవకాశం

2011 december చివరి రోజుల్లో  బ్లాక్ బెర్రీ టాబ్లెట్ (ప్లేబుక్)  ధర భారీగా తగ్గించింది, కాని ఆ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే అని ప్రకటించారు. దాదాపు సగం ధరకు అంటే ప్లేబుక్ 32 జీ. బీ మోడల్ కేవలం 16000 రూపాయలకు అందుబాటులోకి రావటంతో, ఈ మోడల్ కోసం వేలంవెర్రిగా డిమాండ్ ఏర్పడింది. ఏ స్టోర్ కెళ్ళినా నో స్టాక్ అనే సమాధానమొచ్చింది. అయినప్పటికీ, ఆ మూడు రోజులలో సుమారు 12000 యూనిట్లు అమ్ముడైనాయని విన్నాను.

ఇంత కష్టపడి కొన్న తరవాత, వెంటనే దానిని వాడి తరిద్దామనుకున్న వాళ్లకు, ఆ యూనిట్ ని మొదలెట్టడానికి సాఫ్ట్ వేర్  updates ని ఇంటర్నెట్ నుండి download చేసుకోవాలని తెలిసింది. ఇంతవరకూ పరవాలేదు. ఆ డౌన్లోడ్ కేవలం wi -fi ద్వారానే చేసుకోవాలి .. ముందు అలాంటి wi -fi ఉన్న చోటు దొరకాలి. పైగా,..సుమారు 337  ఎం.బీ updates ని wi -fi ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటే… చాల టైం తీసుకుంటుంది. డౌన్లోడ్ చేసేటపుడు  ఏ మాత్రం కనెక్షన్ పోయినా , కథ మళ్ళీ మొదటికే వస్తుంది.. దాంతో మీకు ఆవేశం… తరవాత కొండొకచో ఆయాసం వచ్చే అవకాశం మెండుగా వుంది… దానినే ముద్దుగా కొలవేరి గా అనుకోవచ్చు.

 కాని, ఒక్క సారి ఈ సప్త సాగరాలు దాటి, అన్ని updates ని download చేసారంటే  … ఆ టాబ్లెట్ లోని నిజమైన visual and audio treat ని మీ సొంతం చేసుకోవచ్చు.  
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to బ్లాక్ బెర్రీ ప్లేబుక్ – వేలంవెర్రి కొలవేరి గా మారే అవకాశం

  1. gpvprasad says:

    తిట్టారా పొగిడారా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s