టికెట్ ఉండీ ఫైన్ కట్టిన సందర్భం

అప్పుడే కొన్న valid టికెట్ ఉండి కూడా ఎప్పుడైనా ఫైన్ కట్టారా..?బహుశా ఇలాంటి సందర్భం  చాలా అరుదుగా ఎదురౌతుందేమో…! సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ముంబై లో ఉన్న రోజుల్లో, ఓ సారి లోకల్ ట్రైన్ లో మలాడ్ నుండి దాదర్ వెళ్లాను. పని ముగించుకుని, దాదర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కొనుక్కుని రైలు కోసం ప్లాట్ ఫారం లు వెతుక్కుంటూ వెళ్తున్నాను. కొత్త కావటం తో, ప్లాట్ ఫారం తెలియక  తిక మక పడుతున్నాను. ఇంతలో ఎదురయ్యాడు ఓ టికెట్ చెకింగ్ అధికారి. ధీమాగా నా టికెట్ చూపించాను.. టికెట్ తేరిపార చూసి… ” ఈ టికెట్ చెల్లదు. మీరు ఫైన్ కట్టాలి” అన్నాడు. నేను తెల్లబోయి, “అదేంటి? ఇప్పుడే కొన్న టికెట్ చెల్లదంటారేమిటి?  సరిగా చూడండి ” అన్నాను. తను చెప్పాడు,” ఇది వెస్ట్రన్  రైల్వే జోన్  లో చెల్లే టికెట్… మీరు ఇప్పుడు సెంట్రల్ రైల్వే జోన్ లో ఉన్నారు.. కాబట్టి ఈ టికెట్ చెల్లదు.. టికెట్ లేనందు వలన, మీరీ  స్టేషన్ లో ఉన్నందుకు , ఫైన్ కట్టాల్సిందే” అన్నాడు. చేసేది లేక ఏభై రూపయలు కట్టి బయటపడ్డాను. తరవాత తెలిసింది… ఆ ఒక్క దాదర్ స్టేషన్ కి  రైల్వే వారి రెండు జోన్స్ వుండే విలక్షణత ఉందని. ఒకే రైల్వే స్టేషన్ లో కొంత భాగం ఒక జోన్ లో ఉంటె, మరి కొంత ఇంకో జోన్ లో ఉంటుంది. 

ఏభై రూపాయలు పోతేనేం… జీవితాంతం గుర్తిన్చుకోదగ్గ జనరల్ నాలెడ్జి వచ్చింది కదా అని ఆనంద పడ్డాను… (అలా అనుకోక పోతే కుదరదు కదా… అందుకని)

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to టికెట్ ఉండీ ఫైన్ కట్టిన సందర్భం

  1. Zilebi says:

    మీరు మరీ టిక్కట్టు కొని ఎవరైనా రైలు ఎక్కుతారా! ఇదేమి చోద్యం ! రైల్వే మనదే కదా !

    చీర్స్
    జిలేబి.

  2. Chandu says:

    Yes sir! I paid fine.
    బెంగళూరు లో నేనూ, మా స్నేహితుడూ local బస్సు ఎక్కాం. టికెట్ వాడు తీసుకున్నాడు ఇద్దరికీ. వాడు మధ్యలో దిగేశాడు. టికెట్స్ వాడి జేబులో ఉన్నై. నా ఖర్మ కాలి చెకింగ్ జరిగింది. 500 రూపాయలు ఫైన్ కట్టాల్సొచ్చింది. అందరి ముందూ చాలా ఇబ్బంది అనిపించింది. ఒకళ్లిద్దరు చూసిన చూపులు అద్భుతం. 🙂 ఆ చూపులకి నా మీద నాకే అసహ్యం వేసింది.
    దిగిన తరువాత అనిపించింది. మా స్నేహితుడికి కాల్ చేసి టికెట్ నంబర్ అడగాల్సింది అని.
    కండక్టర్ గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. 😦 😦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s