బ్లాగు రాయటం మొదలయ్యాక మీ “జోహారి విండో” ఎలా మారిపోయిందో గమనించారా?

మనిషి  మనసును విశ్లేషించటానికి జోహారి విండో అనే పద్ధతి ఒకటి ఉంది. మనిషి వ్యక్తిత్వానికి సంబంధించి నాలుగు అరలున్న ఓ కిటికీ ఉంటుంది.

మొదటిది మన గురించి మనకు, ఇతరులకూ తెలిసున్న గుణాలు. అవి మంచి కావచ్చు.. చెడూ కావచ్చు.. కాని అవి ప్రస్ఫుటంగా మనమూ ఒప్పేసుకోగలగాలి  … ఇతరులూ మన గురించి వాటిని గుర్తించుకోగలగాలి. దీనినే arena అంటారు

రెండవది… మన గురించి మనకు తెలిసింది, కాని ఇతరులకు తెలియనిది.. చుపా రుస్తుం లు అంటుంటారు… వారికి ఈ అర విశాలంగా ఉంటుంది.. వీరికి అన్నీ  రహస్యాలే ..  దీనినే facade అంటారు.

మూడవది..  మన గురించి మనకు తెలియనిది… కాని ఇతరులకు తెలిసినది. ఈ అర కూడా ఎంత చిన్నగా ఉంటె అంత మంచిది.. ఎందుకంటే ఇతరులు వచ్చి మన గురించి మనకు నువ్వు ఇదీ అని చెప్పించుకుని shock లకు గురవ్వటం కంటే, మనమే తెలుసుకుని, అంటే మొదటి అర లోకి వాటిని తోసేస్తే అంత మంచిది. చాలా సార్లు, కొంత మంది వారికి తెలియకుండానే ఇతరులకు బోర్ కొట్టించటం, హర్ట్ చేయటం చేస్తుంటారు.. ఎందుకంటే, blindspot అనబడే ఈ అర పెద్దది కాబట్టి.

ఇక పోతే నాలుగవది… మన గురించి మనకూ, ఇతరులకూ కూడా తెలియనిది.. బహుశా ఇదో పెద్ద బ్లాక్ బాక్స్. ఇది ఎవరికీ , ఆఖరికి కట్టే కాలే వరకూ కూడా ఉండి, మనతోటే నిక్షిప్తమై పోయే కొన్ని గుణాలు. ఇది ఓ unknown అర.

బ్లాగులకూ, దీనికీ ఏమి సంబంధమా అనుకుంటున్నారా.. వస్తున్నా… వస్తున్నా… ఆ పాయింట్ కే వస్తున్నా.. బ్లాగులు రాయటం మొదలెట్టాక, చాల సార్లు, మనలోకి మనమే తొంగిచూసుకోవటం జరుగుతూ ఉంది.. ఉదాహరణకి, నాకు పాటలంటే ప్రాణం… కాని ఎలాంటి పాటలంటే ఇష్టమో నేనెప్పుడూ నిశితం గా ఎప్పుడూ ఆత్మావలోకనం చేసుకోలేదు.. ఈ బ్లాగులో పాటల గురించి రాయటం మొదలెట్టిన తరవాత, అప్పుడప్పుడూ, నా టపాలు చదువుతుంటే , నా అభిరుచి లో ఓ pattern కనపడసాగింది.  ఈ బ్లాగు రాయకపోయి ఉంటె, బహుశా ఈ pattern సంగతి ఆ నాలుగో అరలోనే ఉండిపోయేదే.. అలాగే… what keeps me happy అన్న విషయం కూడా ఈ బ్లాగుని పునశ్చరణ చేసుకుంటే అర్థమౌతూ ఉంటుంది..

నా జోహారి విండో లో నాలుగో అర ఈ బ్లాగు పుణ్యమా అని కొంచెం చిన్నదయ్యింది.. మీరూ ఇలాగే ఓ సారి అలోచించి చూడండి..ఏదైనా విశేషముంటే కామెంటడం మరవకన్డేం ..?

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

4 Responses to బ్లాగు రాయటం మొదలయ్యాక మీ “జోహారి విండో” ఎలా మారిపోయిందో గమనించారా?

 1. chaalaa chakkani vishayam.. vishleshana koodaa .. baagundi. Thank you..Rama krishna gaaru.
  makara sankraanti shubhaakaankshalu.

 2. Zilebi says:

  రామకృష్ణ గారు ,

  ఎల్లలు లేని విండో(frame less window) ని ఊహించండి చూడండి !
  అప్పుడు విండో , దాని లో భాగాలు అన్నీ కూడా హుష్ కాకి !

  సంక్రాంతి శుభాకాంక్షలతో

  చీర్స్
  జిలేబి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s