ఈ చిత్రం మిమ్మల్ని తప్పక వెంటాడుతుంది..-1

ఈ చిత్రం మిమ్మల్ని తప్పక కొంత కాలం వెంటాడుతుంది.. ఎందుకంటే అందులోని పాత్రలు కల్పితాలు కావు.. ఆ పాత్రలంతా మీ పక్కింటి వాళ్ళో, పరిచయస్తులో, ఆఖరికి  మీరే కావచ్చు.. వాళ్లకి జరిగిందే ఎక్కడో ఎవరికో… మనకి తెలిసిన వారికి జరిగుండొచ్చు ….  ఎద లోయల్లో మంచులా గడ్డ కట్టిన  ఆ తాలూకు జ్ఞాపకాలు కరిగి ధారై, ఝరై, ఏరై, ఉప్పెనలా మిమ్మల్ని కమ్ముకోవచ్చు.. అలాంటి lasting imprint తో మిమ్మల్ని వదులుతుందీ  సినిమా..   ఎంతో కాలం తర్వాత చూస్తుండగానే instant గా నచ్చేసిన చిత్రం

జర్నీ-

ఈ చిత్రం గుర్తు పెట్టుకోదగ్గ సినిమాల కోవలోకి తప్పక చేరుతుంది. కథ, కథనం, పాత్రల స్వభావం, వాటి చిత్రీకరణ అన్నీ వేటికవే ప్రత్యేకం. సాధారణంగా సినిమా కథ అన్నాక, అందులో ముఖ్య వస్తువు చుట్టూ మసాలాలు, మలుపులు, కామెడీ, సంగీతం ఇలా రక రకాల దినుసులు దట్టించి కథను తయారు చేస్తారు. ఈ చిత్ర కథ మాత్రం, మన మధ్య ఉన్న కొందరి జీవితాలను వారి ఫ్రేమ్ ల లో బంధించి, ఏ మాత్రం అసహజత్వం లేకుండా మన ముందు ప్రెసెంట్ చేసినట్లుగా అనిపిస్తుంది..

రెండు జంటలు శర్వానంద్- అనన్య , జై- అంజలి … వీరి జీవితాలను  ఇద్దరు బస్సు డ్రైవర్ ల  ఓ  ఏమరుపాటు క్షణం ఎలా సమూలంగా మార్చివేసిందన్నదే ఈ చిత్ర కథ.. తమిళం లో “ఎంగేయుం.. ఎప్పోదుం ” గా వచ్చిన ఈ సినిమా  రోడ్డు ప్రమాదాల ప్రభావాలను కళ్ళకు కట్టినట్లుగా చూపడం ద్వారా social awareness ని తీసుకు రావటంలో విజయం సాధించింది.

కథ టూకీగా..
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి విజయవాడ నుండి వచ్చిన అనన్య, తప్పని సరి పరిస్థితులలో stranger అయిన శర్వానంద్ సహాయం తీసుకుని సిటీ బస్సుల్లో వెళ్లి ఇంటర్వ్యూ కి వెళ్తుంది.. ఈ చిన్న ప్రయాణం లోనే వారి మధ్య ప్రేమ చిగురించినా ఇద్దరూ బయట పడరు..  ఒకరికొకరు పరిచయం పెంచుకోకుండానే వెళ్ళిపోతారు. కొంత కాలం తరవాత పరస్పరం కలవటానికి, హైదరబాద్ నుండి శర్వానంద్, విజయవాడ నుండి అనన్య బస్సుల్లో బయల్దేరుతారు.

వీరికి సమాంతరంగా  ఇంకో జంట  కథ.. జై  బిడియస్తుడు, అంజలి చాల ప్రాక్టికల్… ఏదైనా వాస్తవం  లో ఉండి “ఎమోషన్స్ అన్ అటాచ్డ్” తరహా లో ఉంటుంది.. తనని ఇష్టపడే జై ని అన్ని రకాలుగా పరిశీలించి, ప్రేమిస్తే వచ్చే కష్ట నష్టాలు, సాధక బాధకాలు అన్ని జై కి వివరించి, చివర్లో తనని ప్రేమించాల వద్దా అనే ఆప్షన్ ని జై కి ఇస్తుంది.. అన్నిటి కీ జై వోప్పుకున్నాక, ఇరు వర్గాలని పెళ్ళికి వోప్పించాక జై తల్లిని కలవటానికి ఇద్దరూ బస్సులో బయల్దేరుతారు..

ఈ జంటల ప్రయాణం లో బస్సులో మరి కొన్ని పరిచయాలు ప్రేక్షకులకి చేస్తారు.. ఎంతో కాలం తరవాతస విదేశంనుండి తన ఐదేళ్ళ కూతుర్ని చూసుకోవటానికి వస్తున్న ఓ తండ్రి.. కూతురి గొంతుతో వచ్చే మొబైల్ ఫోన్ రింగ్ tone అతడు నిజంగా వస్తున్నాడా అని  మాటి మాటికీ వాకబు చేస్తున్న అతడి చిన్ని కూతురు.. భార్యని వూరికి సాగనంపటానికి వచ్చి, తనని వదలలేక,  నెక్స్ట్ స్టేజ్ లో దిగిపోతానని తనతో పాటు కొంత దూరం ప్రయాణించే ఓ భర్త.. అందరితోనూ ముద్దుగా మాట్లాడుతూ పలకరించే ఓ చిట్టి పాప… ఇలా ఎందరో వ్యక్తులు..

ఈ జర్నీ లో మనం కూడా మమేకమౌతాము.. కాని చిత్రం మొదట్లోనే ఆక్సిడెంట్ చూపించటంతో, ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తున్న ఈ కథ ఎలా మలుపులు తిరుగుతున్దోనన్న ఆందోళనతో కూడిన ఆసక్తిని generate చేయగలిగాడు దర్శకుడు.

(మిగతా ఇంకో భాగంలో )

 

This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s