ఈ చిత్రం మిమ్మల్ని తప్పక వెంటాడుతుంది..- 2

జర్నీ- review (continued )
ఇలా బయల్దేరిన రెండు బస్సులూ ఎదురెదురుగా డీ కొనడంతో అన్ని జీవితాలు ఒక్క క్షణం లో మారిపోతాయి. చాల bizarre గా చూపించారీ దృశ్యాన్ని. బస్సు ప్రమాదాలెంత హృదయ విదారకమో తెలపటానికి చూపించిన ఈ దృశ్యం, నిర్లక్ష్యంగా బండి నడిపే చోదకులకు గుణ పాఠం గా నిలుస్తుంది. మధ్య మధ్యలో వేరే బండ్లను   ఓవర్టేక్ చేస్తూ వెళ్ళే బస్సుని చూపిస్తూ, అనునిత్యం మనం చూసే కొన్ని ఇలాంటి  దృశ్యాలు  ఎంతగా ప్రమాదకరం కాగలవో చూపించటం బాగుంది..

రెండు విభిన్న ప్రేమ కథల్ని సమాంతరంగా చూపిస్తూ వాటిని ఓ ఆక్సిడెంట్ ద్వారా మలుపు తిప్పటం తో, చిత్రాన్ని ఉద్వేగభరితంగా ముగించాడు దర్శకుడు. ఎంత ప్రాక్టికల్ గా ఉండే అంజలి, జై కి దెబ్బలు తగిలి  తను అపాయకర స్థితిలో ఉన్నాడని గ్రహించి తనని ముందుగా అంబులెన్స్ లో ఎక్కించి, తాను అక్కడి క్షతగాత్రులకు సహాయపడటం , చివరిగా ఆసుపత్రికి వెళ్లి జై మరణించాడని  తెలుసుకుని రోదించటం, ఆ క్షణాలలో కూడా తన అవయవ దానం గురించి అక్కడి వైద్యులకు చెప్పటం … అంత వరకూ ఎంతో practical గా ఉండే ఆ అమ్మాయిలోని ప్రేమ, మానవత్వం  యొక్క intensity ని చూపిస్తాయి. అంజలిని  ఈ పాత్రలో చూసాక, ఇంకో చిత్రం లో వేరే షేడ్స్ లో చూడలేమేమో..  క్లిష్టమైన ఆ పాత్రకు తను నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసింది.

అలాగే, బిడియస్తుడిగా ఉండే జై  తన చివరి క్షణాలలో కూడా అంజలిని  “మీకేం కాలేదు కదండీ”  అంటూ అడగటం, తనని అంబులెన్స్ ఎక్కిస్తుంటే ఆమె వైపు తనని వదిలి వెళ్లిపోతున్నానేమోనని  నిస్సహాయంగా చూడటం గుండెని కలిచివేస్తాయి.

స్థూలంగా చెప్పాలంటే… ఈ చిత్రానికి కథ చెప్పిన తీరు, చాయాగ్రహణం, background score, నటులందరి అద్భుత నటన (ఎక్కడా overdose గా అనిపించదు…) strong points.. ఈ చిత్రం లో తెలుగు నటులైన అంజలి, శర్వానంద్ ల నటన చాలా…. చాలా బాగుంది. ప్రతిభ ఉంటె ఎక్కడైనా రాణించగలరు అనడానికి  వీరిద్దరే సాక్ష్యం. జై, అనన్య కూడా వారి వారి పాత్రలలో వోదిగిపోయారు.

ఈ చిత్రం లో ప్రతి emotion ని మనమే ఫీల్ అయ్యేలా చూపించాడు. Full credit to the director Saravanan. తమిళ చిత్రం కావటం తో అక్కడక్కడా, అడపా దడపా తమిళ్ బోర్డులు దర్శనమిస్తూ తెలుగు స్ట్రైట్ చిత్రం కాదని చెప్పకనే చెపుతాయి. ఎడిటింగ్ లో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటె బాగుండేది. ఈ చిత్రం చూడకుంటే మాత్రం… you are going to miss something forever .

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s