చిన్నప్పుడు విన్న కధే అయినా…

అనగనగా ఒక పాము. ఆ పాము కనపడ్డవాళ్ళను  కాటేస్తూ, అక్కడి ప్రజలకు భయం కలిగించేది. అవసాన దశకి వచ్చాక, ఎందుకో ‘తనని చూసి ఎవరూ భయపడకూడదు. తనని అందరూ మంచి పాముగా గుర్తంచాలి” అనుకుంది. అనుకుందే  తడవుగా దేవుడిని ప్రార్థించే సరికి, దేవుడు ప్రత్యక్షమై తన కోరికకు సమధానంగా…”నువ్వు ఈ రోజు నుండీ ఎవరినీ కాటు వేయకు. నిన్ను చూసి ఎవరూ భయపడరు… సరికదా నీకు మంచి పేరు వస్తుంది” అని చెప్పి అంతర్ధానమౌతాడు.

అప్పటినుండి ఆ పాము అలాగే ఎవరు కనపడ్డా కాటు వేయకుండా వదిలేసేది.. ఆ పాము కాటు వేయటం లేదని అందరికీ తెలిసాక, అక్కడున్న చిన్న పిల్లలు కూడా ఆ పాముపై రాళ్ళు వేయటం, కొట్టటం లాంటివి చేయటం మొదలెట్టారు. మాట తప్పకూడదని ఆ పాము అన్నిటినీ భరిస్తూ వచ్చింది. గాయాలతో ప్రాణం మీదకి తెచ్చుకున్న ఆ పాము, ఇక భరించలేక దేవుడిని మళ్ళీ స్మరించుకుంది. దేవుడు ప్రత్యక్షమై విషయమేంటని   అడిగాడు. దాని బాధలన్నీ చిరునవ్వుతో విన్న దేవుడు ఇలా అన్నాడు “నిన్ను కాటేయ్యోద్దని చెప్పాను కానీ… బుస కొట్టవద్దని చెప్పానా… అలా చేయకుంటే, నీ అతి మంచితనం మూలంగా   నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు”.  
బహుశా ఈ కథ మనం అందరం చిన్నప్పుడు చదువుకుని ఉండొచ్చు. ఒక్కో సారి ఆలోచిస్తే… ఈ కథలో సమకాలీన పరిస్థితులలో మనిషి అవలంబించాల్సిన పద్ధతి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో మంచితనం అన్నది  చేతకాని తనం అవుతుంది… వినయం అన్నది మెతకదనం అవుతుంది.. అందరితో కాక పోయినా, తన మనుగడకే ఆపద రాకుండా వుండాలంటే కొందరితో ఈ బుస కొట్టే strategy తప్పదేమో.. అందుకేనేమో sometimes it is good to be bad..
Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s