ఆ రోజు చాలా భయపడ్డాను-2

నిన్నటి టపాకి కొనసాగింపు

ఆ హటాత్పరిణామానికి ఒక్క సారి ఉలిక్కి పడ్డాను. ఆ చేయి వచ్చిన వైపు చూసే సరికి, కనపడ్డ వ్యక్తి.. ఇంకా భయకరంగా కనపడ్డాడు. మాసిన బట్టలు, గడ్డం, చింపిరి జుట్టు… ముఖంపై ఓ విచిత్రమైన నవ్వు..  నన్ను చూస్తూనే ఆ నవ్వును పొడిగిస్తూనే, ” ఒన్ రూపీ ప్లీజ్” అన్నాడు బొంగురు గొంతుతో… అప్పటికే ఆ వరస పరిణామాలకి నా పై ప్రాణాలు పైనే పోయాయి. కాస్తా తేరుకున్నాక, ఇస్తాను అంటూ సైగ చేస్తూ రూములోకి  వెళ్లి, గబా గబా ఒక్క రూపాయి తెచ్చి  చేతికిచ్చాను. అది అందుకుందే తడవుగా అతడు అక్కడినుండి అదృశ్యమై పోయాడు. 


మరుసటి రోజు వేరే వింగ్ లో ఉండే నా క్లాస్ మేట్స్ కి చెపితే… వాళ్ళకీ ఇలాంటి అనుభవం ఎదురయ్యిందని చెప్పారు. తరవాత తెలిసిందేమిటంటే అతను ఒకప్పుడు అక్కడి విద్యార్ధి అనీ, ఎందుకో మతి చలించి అక్కడే ఉండిపోయాడని.. అప్పటి నుండి అక్కడే వారిని వీరినీ అడుగుతూ (ఒక్క రూపాయి  మాత్రమే) తన పొట్ట పోసుకుంటాడట   ఇంకా ఆశ్చర్య కరమైన విషయమేంటంటే అతడు అప్పుడప్పుడూ నార్మల్ గా ఉంటాడట.. ఆ సమయం లో అక్కడి విద్యార్థులకు తన సబ్జెక్ట్ లో పాఠాలు చక్కగా  బోధించేవాడట. అతడిలో  దాగి ఉన్న మేధావిని అర్థం చేసుకున్న అక్కడి వాళ్ళు, అతడు ఎప్పుడు అడిగే ఒక రూపాయిని కాదనకుండా ఇస్తుంటారట. 

 ఆ తరవాత రూం దగ్గరికి ఎప్పుడూ రాలేదు కాని, కాంపస్ లో అప్పుడప్పుడూ ఎదురయ్యే వాడు. 
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to ఆ రోజు చాలా భయపడ్డాను-2

  1. pch.. vijnaanam .ni . vichalitam gaa choosaaranna maata.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s