ఆసుపత్రిలో ఓ రోజు…A moving saga

ఈ రోజు ఒక ఈ- మెయిల్ లో వచ్చిన మెసేజి సారాంశం
ఒక డాక్టర్ కి అత్యవసర పిలుపు వచ్చింది ఓ అబ్బాయికి ఆపెరేషన్ చేయాలని. ఓ గంట తరవాత ఆసుపత్రిలోకి రొప్పుతూ వచ్చాడా డాక్టరు. వస్తూనే సర్జెరీ దుస్తులు వేసుకుంటూ ఆపరేషన్ థియేటర్ దగ్గరకి పరుగు పెట్టాడు.. అక్కడే అప్పటి వరకూ నిరీక్షిస్తున్న ఆ అబ్బాయి తండ్రికి డాక్టర్ని చూస్తూనే కోపం కట్టలు తెంచుకుంది.

“ఇంత ఆలస్యంగానా రావటం… అవతల చావు బతుకుల్లో ఉన్న నా కొడుక్కి ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత…”

డాక్టర్ చిరు నవ్వుతో ” సారి అండి… నాకు కాల్ వచ్చిన వెంటనే బయల్దేరాను. దూరంగా వుండటం వలన ఆలస్యం అయింది.మీరు శాంతిస్తే, నేను లోనకెళ్ళి నా పని మొదలెడతాను”

“శాంతించటం…? చెప్పటానికి నీతులేన్నైనా చెప్పొచ్చు.. నీ కొడుకే లోన ఉంటె, ఇలా నీతులు చెప్ప గలవా..? అప్పుడు తెలుస్తుంది కన్న బాధ” అప్పటికీ శాంతించని తండ్రి స్వరం

డాక్టర్ అనునయంగా “చూడండి… అందరూ మట్టిలోంచి వచ్చాం. మట్టిలోకి పోయే వాళ్ళమే.. దేవుడిని ప్రార్థించండి మీ అబ్బాయికి ఏమి కాకూడదని.. ఆ భగవదేచ్చ వుంటే… మేము ఆపెరేషన్ విజయవంతంగా చేయాలని ఆ దేవుడ్ని కోరండి”

“సలహాలు చెప్పటం సులువే..” అన్నాడు ఆ తండ్రి ఆక్రోశంతో.

లోనకి వెళ్ళిన డాక్టరు గంటల తరబడి ప్రయత్నించి, ఆపెరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలిగాడు.

బయటికి వస్తూనే…ఆ తండ్రిని చూస్తూ ” మీ ప్రార్థనలు ఫలించాయి.. మీ అబ్బాయికేం ప్రమాదం లేదు..” అంటూ అతడి జవాబు కోసం ఎదురైనా చూడకుండా వడి వడి గా అడుగులు వేసుకుంటూ వెళ్ళసాగాడు. వెళ్తూ “మీకేమైనా అనుమానాలుంటే అక్కడే  ఉన్న నర్సు ని అడగండి ” అని చెపుతూ కనుమరుగయ్యాడు.

“ఏమిటీ డాక్టరుకి ఇంత అహంకారం… నా కొడుకు పరిస్థితి వివరించి వెళ్ళొచ్చు కదా.. మరీ ఇంత  నిర్లక్ష్యమా ..” అన్నాడు పక్కనే ఉన్న నర్సుతో..

ఆ నర్సు అంది (కన్నీళ్లు ఆపుకుంటూ) “ఆ డాక్టరు కొడుకు నిన్న ఓ ఆక్సిడెంట్ లో మరణించాడు. మీ అబ్బాయి ఆపెరేషన్ కోసం మేం అతడిని పిలిచినప్పుడు అంత్య క్రియల ఏర్పాట్లలో ఉన్నాడు. మీ అబ్బాయి కోసం ఉన్న పళంగా వచ్చాడు. మిగతా కర్మ కాండ పూర్తి చేయటానికి ఇప్పుడు వెళ్ళాడు”

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

One Response to ఆసుపత్రిలో ఓ రోజు…A moving saga

  1. very nice post.. heart touching..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s