మా వూళ్ళోని వైద్య నారాయణులు.. కొన్ని జ్ఞాపకాలు

Corporatisation వలన మన జీవితాల్లో అప్పటికీ ఇప్పటికీ పెనుమార్పులు సంతరించుకున్న రెండు రంగాలు ఏవీ అంటే, – ఒకటి వైద్యం, రెండు విద్య. వైద్యం యొక్క connotation ఇప్పుడు చాలా మారి పోయింది.

అదో పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి… హడావిడి… నక్షత్రాలను అంటే consultancy ఫీజులు… డాక్టరు దగ్గరి కెళ్ళాక, చేతిని కూడా ముట్టుకోకుండా, “ముందీ పరీక్షలు చేసి రేపు కలవండి” అని ఆదేశాలు.. ఆ పరీక్షలకి మళ్ళీ మోపెడు ఖర్చులు.. మరుసటి రోజు రిపోర్టులతో  లోన కెళ్ళాక, మళ్ళీ చేతిని కూడా తాకకుండానే, రిపోర్టులన్నీ  చూసి ,”జలుబే..ఈ మాత్రలు మూడు రోజులు వాడండి” అంటూ  మళ్ళీ ఓ చాంతాడంత prescription లిస్టులు… దురదృష్ట వశాత్తూ ఏదైనా  రిపోర్టుల్లో తేడా ఉంటె మళ్ళీ ఇంకో డాక్టరుకి referrals , అక్కడ ఈ ప్రహసనం ఇంకో సారి కొనసాగింపు … ఇలాంటివి చూడటం సర్వ సాధారణమై పోయింది. అలాంటపుడు ఒక్క సారిగా గుర్తుకొస్తారు అప్పట్లోని మా వూళ్ళో డాక్టర్లు..

అప్పట్లో గిరిమ్పేట లో చంద్ర శేఖర్ , వెంకటేసన్ డాక్టర్లు ఇద్దరే .. వీరే అందరికీ వైద్యం చేసేవారు.  చంద్ర శేఖర్ గారు చక్కగా స్మార్టుగా సినిమా హీరో మోహన్ లాగా ఉండేవారు. మాటల్లో సౌమ్యత , స్టైలు ఉండేది. ఏ జబ్బు  వచ్చినా అతడే శరణ్యం మాకు. నాకు భయమని తెలిసి, అత్యవసర పరిస్థితులలో మాత్రమే సూది ఇచ్చే వారు. లేకుంటే, మందులతో సరి.. నమ్మకమో, మరేమిటో తెలియదు కాని, అతని ట్రీట్ మెంట్ లో ఒకటి రెండు రోజుల్లో బాగై పోయేది అందరికీ. ఎనిమిదో తరగతి లో ఉన్నప్పుడు, దీపావళి రోజున   టపాసులు పేలటంతో, నా చూపుడు  వేలు కాలి చర్మం మొత్తం ఊడిపోయింది. రాత్రి తొమ్మిదికి పరిగెత్తాం తన దగ్గరికి. నన్ను చూసి నవ్వుతూ  “ఏమిటి హెగ్డే గారు… తమరూ కాల్చుకున్నారా…” అని ఓ జోక్ వేసి, బ్యాన్దేజ్  వేసి పంపారు. రామకృష్ణ హెగ్డే అప్పట్లో ఫేమస్ కాబట్టి, ఆ పేరు పెట్టి నన్ను పిలిచే వారు. అవసరమైతేనే పరీక్షలు.. లేకుంటే గోలి మాత్రలతో సరి…

తన గురించి ఇంకో ముఖ్య విషయం  చెప్పాలి. అప్పట్లో అన్నయ్యకి మెడిసిన్ లో సీట్ వచ్చాక , ఒక సారి చంద్రశేఖర్ గారి  దగ్గరికి వైద్యానికి వెళ్ళాల్సి వచ్చింది. వైద్యం చేసాక, “ఒక డాక్టరు ఇంకో డాక్టరు దగ్గర ఫీజు తీసుకో కూడదు” అని సున్నితంగా నిరాకరించి పంపేంత గొప్ప సంస్కారం వీరిది. వృత్తి పరమైన నిబద్ధత అంటే ఇదే. 

అందుకే నాకు డాక్టర్ అంటూనే, మదిలో ముందు అతడి రూపమే కదలాడుతుంది. కొన్నేళ్ళ క్రితం, హార్ట్ అటాక్ తో తను మరణించారని  తెలిసినప్పుడు చాలా బాధ పడ్డాను. చాలా చిన్న వయసులో తనువు చాలించారు వీరు.

అలాగే ఇంకో ఫేమస్ డాక్టర్ వెంకటేసన్ గారు… అదే స్థలం… ఇప్పటికీ అతడు గిరిమ్పేటలో వైద్యం కొనసాగిస్తూనే ఉన్నారు.. వైద్యంతో  పాటు… పూర్తి పెర్సనల్ టచ్ ఇచ్చే వైద్యులు  వీరు. మేం పిల్లలుగా ఉన్నప్పుడు అతడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ప్రతి ఒక్కరినీ ఏం చదువుతున్నారో, కనుక్కొని తగు సూచనలిచ్చే వారు.మా వాళ్ళల్లో కొంత మందికి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగ మారిన వ్యక్తి వీరు. వీరి అబ్బాయిలు కూడా ప్రస్తుతం ఇదే వృత్తిలో ఉంటూ తనకి సహాయ పడుతున్నారని విన్నాను.

మరీ చిన్నప్పుడు, premala టాకీసు దగ్గర గుప్తా డాక్టరు గారి దగ్గరకి వెళ్ళే వాళ్ళం. చిన్న పిల్ల వైద్యుడైన వీరి దగ్గర, అపరిమితమైన రష్ ఉండేది.

ఇవి కాకుండా , పాత లైబ్రరీ దగ్గర హకీం సాబ్ ఉండేవారు. అతడు కూడా చాల ఫేమస్ అప్పట్లో. ఇదేది కాకుంటే, మా వూరి దర్గా లో కూడా ట్రీట్మెంట్ జరిగేది. నయం కాని వ్యాధులు వుంటే, ఇక్కడికి వెళ్తే ఫలితముంటుందని పెద్ద నమ్మకం. మా అందరికీ కూడా చాల గౌరవప్రదమీ దర్గా.

వీరు కాకుండా, జయరాం నాయుడు, జయచంద్ర రెడ్డి గార్లు కూడా చాల ఫేమస్ డాక్టర్లు. వీరి దగ్గరికి నేనెప్పుడు వెళ్ల లేదు కాని, వారి పేర్లు ఇప్పటికీ వినపడుతుంటాయి మా వూళ్ళో.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to మా వూళ్ళోని వైద్య నారాయణులు.. కొన్ని జ్ఞాపకాలు

 1. Zilebi says:

  రామకృష్ణ (హెగ్డే!!) గారు,

  ఈ పాత లైబ్రరీ దగ్గర హకీం సాబ్ –

  ఇంకా వున్నారాండీ వీరు ? అప్పట్లో చాలా పాప్యులర్ వీరి వైద్యం. అల్లోపతీ వచ్చేసాక ఏమైందో తెలియదు.

  డాక్టర్ వెంకటేశన్ గారు గ్రీమ్స్పేట లో ఇంకా కొనసాగిస్తూ వుండండం తెలిసి ఆనందం.

  వీరు కాక మరో వెంకటేశన్ ,గవర్నమెంటు ఆసుపత్రి దగ్గిర మరో డాక్టరు వుండే వారు.

  జిలేబి.

  • mhsgreamspet says:

   జిలేబి గారు..
   మీకు వారు ఇంకా గుర్తుండడం ముదావహం.. హకీం గారు అక్కడ మాత్రం లేరండీ.. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాల క్రీనీడలే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s