నిత్య జీవితం లో ఎదురయ్యే హాస్యం

ఒక్కో సారి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే హాస్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది… మళ్ళీ మళ్ళీ తలచుకుని నవ్వుకునేటంతగా.. అలాంటిదే ఈ సంఘటన

ఓ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయికి పెళ్లి జరుగుతోంది వాయల్పాడు (ఇది చిత్తూర్ జిల్లా లో ఉందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను) లో. అందులో చిన్న అమ్మాయి నాకు జూనియర్ కాబట్టి, నేనూ ఆ పెళ్ళికి వెళ్ళాను.పెళ్లి వేదిక ఆ ఊళ్ళోని ఓ సినిమా థియేటర్లో జరుగుతోంది. పెళ్లి పొద్దుట కాబట్టి, మ్యాటినీ వరకూ సినిమా థియేటర్ ఖాళీ కాబట్టి, పెళ్లి కి అక్కడ అనుమతించారు.

తాళి కట్టడం పూర్తయ్యాక, మా అక్క వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అన్న భావన కలగ గానే ఆ ఇద్దరమ్మాయిలకీ ఏడుపొచ్చేసింది.  గబా గబా, ఎవరికీ కనపడకుండా ఏడవాలనుకుని అక్క చేల్లెలిద్దరూ బయట టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరికెళ్ళి ఏడవటం మొదలెట్టారు. వారిని ఓదార్చటానికి నేనూ, నాతో పాటు వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అక్కడికి చేరుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్ ఎంత  చెప్పినా ఆ అమ్మాయిల ఏడుపు తగ్గటం కాదు సరికదా ఇంకా ఎక్కువవ్వసాగింది. కాస్సేపు, మాకు ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు.

వాళ్ళ ఏడుపులను  బయటి వాళ్ళు గమనించటం మొదలయ్యింది. అది చూసే సరికి ఆ ఫ్రెండ్ కి కంగారు ఎక్కువై ” అలా ఏడవకండే .. టికెట్లు దొరకక ఈ కౌంటర్ దగ్గరే ఏడుస్తున్నారని అందరూ అనుకుంటారు.. అసలే ఈ హీరో సినిమా టికెట్లు దొరక్క ఏడుస్తున్నారంటే ఇంకా embarassing గా ఉంటుంది…” అని అంది పక్కనున్న సినిమా పోస్టర్ లోని హీరోని చూస్తూ.

ఒక్కసారి గా మాకు ఆ అక్క చేల్లెలిద్దరూ టికెట్లు దొరక్క ఏడుస్తున్న వాళ్ళ లాగ కనపడేసరికి, ఆ అక్క చెల్లెళ్ళతో సహా అందరమూ నవ్వేశాము. వాతావరణం తేలికయ్యింది. తెలిసో తెలియకో అలా మాట్లాడిన ఆ ఫ్రెండ్ కూడా నవ్వేసింది.

ఇది జరిగి ఇరవై ఐదు ఏళ్ళయింది… ఇప్పటికీ నాకు గుర్తొస్తే ఓ లాస్యం నా ముఖాన్ని తాకి వెళ్తుంది.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s