మానవ సంబంధాలు ఎందుకు మారుతుంటాయి…?

ఈ ప్రశ్న చాలా సార్లు ఎంతో మంది మనసును తొలిచి వుంటుంది… ఇవాళ చక్కగా ఉన్న ఒక స్నేహం, ఒక బంధం ఇంకో రోజు పూర్తిగా వ్యతిరేక కోణంలో కనపడ వచ్చు.

వీటిని సూక్ష్మంగా చూస్తే… రెండు కారణాలు గోచరిస్తాయి.. ఆ రెండింటినీ మనం సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం వలననే చాల సంబంధాలు ప్రభావితమౌతుంటాయి అని నా అభిప్రాయం..

ఆ రెండు… స్పేస్ మరియు టైం. ప్రతి వ్యక్తికీ తనదంటూ ఓ పర్సనల్ స్పేస్ ఉంటుంది..ఆ స్పేస్ లోకి ఎంటర్ అవటం (ఎంత సన్నిహితులైనా) ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. మనిషి ఎంత సంఘ జీవో, అంతే ఏకాంతాన్ని, తనదైన ఓ మైక్రో స్పేస్ ని కోరుకుంటాడు అప్పుడప్పుడూ.. నా సొంత మనిషికి నేను కాక ఇంకో ప్రపంచముంటుందా అనే ఫీలింగ్ తో ఆ మైక్రో స్పేస్ ని ఎదుటి వ్యక్తి కి ఇవ్వ లేక పోతాం. This leads to a sort of possessive obsession and brews a feeling of breathing down your neck. మనకే తెలియకుండా ఓ repulsive attitude మొదలౌతుంది. ఇదే ఎంతటి సాన్నిహిత్య సంబంధమైనా మారటానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పు డైతే ఎదుటి వ్యక్తి… ఎవరైనా  ఎంత  సన్నిహితులైనా… వారి మైక్రో స్పేస్ ని  గుర్తించి గౌరవించగలిగితే ఆ రిలేషన్ sustain కావచ్చు.

ఇక పోతే రెండవ కారణం. టైం .Nothing changes like change. గణితం లో “వాలు” (slope or the derivative) అనే కాన్సెప్ట్ ఉంది. “x” value పై ఆధార పడ్డ ఏ “y” (dependent variable) అయినా నిరంతరం మారుతూ వుంటుంది. ప్రతి సంబంధమూ కాలమనే “x” variable పై ఆధార పడి వుంటుంది. చిన్నప్పుడు బెల్ బాటం వేసుకుని హీరో డాన్స్ చేస్తుంటే తన్మయంగా చూసిన నేను ఇప్పుడు వాటిని చూసి నవ్వుకుంటూ వుంటాను. అదే మనిషి అదే విషయానికి  రెండు భిన్న కాలాలలో డిఫెరెంట్ గా స్పందించాడు. కాలానికున్న మహిమే అది. “ఆ రోజు అలాగున్న మనిషి ఈ రోజు ఎందుకిలా మారిపోయాడు …?” అనే శేష ప్రశ్న చాల సందర్భాలలో ఉత్పన్నమౌతూ ఉంటుంది. ఎందు వలనా అంటే “దైవ ఘటనా” (అని సప్తపది లో ఓ పాట ఉంది కదూ..అది గుర్తొచ్చింది) అని అనను కాని ” కాల మహిమ” అని అంటాను. కాల క్రమేణా మనిషి వ్యక్తిత్వం లో వచ్చే మార్పులకు బాహ్య కారణాలు ఉండొచ్చు.. ఉండక పోనూ వచ్చు.. ఒక్కో సారి “Normal is boring” అన్న చందాన మనిషి ఏ కారణమూ లేకుండానే మారనూ వచ్చు. Certain facets of life simply defy logic and realm of realism.

So… సర్వ జనులారా.. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే ..ఈ రెండింటినీ ప్రతి మానవ సంబంధం లోనూ contextual గా అన్వయించుకో గలిగితే… heart breaks…ఉండవు ..

(PS :ప్రతి సూత్రానికి exceptions ఉండొచ్చు.. మీరూ, మీ సన్నిహితులూ అందులో వుంటే.. అభినందనలు. 🙂

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

3 Responses to మానవ సంబంధాలు ఎందుకు మారుతుంటాయి…?

  1. D S KRISHNAN says:

    mind boggling story from which i am suffering and i made others suffer because of in appropriation of that micro space , very interesting please share such psycological transacional
    analysis thanks

  2. Now a days human values are changing drastically

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s