గుప్పెడు పదాలలో కొండంత భావమున్న పాట

మనం సాధారణంగా వాడుకలో వినే పదాలే… వాటినే అందంగా పేర్చి పల్లవి గా ఓ పాటలో పొదిగి, అందమైన భావానికి అక్షర సాక్షాత్కారాన్నిస్తే నిజంగా ఆ గీత రచయిత  ఎందుకంత గొప్ప కవి అయ్యారో అర్థమౌతుంది. నీరాజనం చిత్రం లో సి. నా. రే గారు రాసిన ” నిను చూడక నేనుండలేను..” అనే పాట 1989 లో మొదటి సారి విన్నప్పుడు ముందు ఆ పాటకి  నయ్యర్ గారి సంగీతం వింటుంటే, మంచి క్లాసిక్ సాంగ్ విన్న అనుభూతి కలిగింది. పాట సాహిత్యాన్ని గమనిస్తే  , ఎంతో సరళమైన  పదాలు (ముఖ్యంగా పల్లవిలో  ఉన్న పదాలు), మళ్ళీ మళ్ళీ వినాలనిపించే  అందమైన  పదాలు (హరివిల్లు, శశి రేఖ, హృదయంగమం లాంటివి) ఉన్నాయి 


మొదటి చరణంలో హరివిల్లులో  ఉండే వంపుని చూసి దరహాసం అనుకోవటం , చిరుగాలి లోని సవ్వడిని అడుగుల చప్పుడులోని లయని గుర్తు తెచ్చుకోవటం … సున్నిత భావ ప్రకటనకి పరాకాష్ట.

రెండో చరణంలో ఒకరి సాంగత్యంలో ప్రపంచమంతా సాగే సెలయేరులా కనిపిస్తే, ఆ ఒక్కరి రాహిత్యం (సరైన  పదమేనా…?)లో మది కన్నీరు మున్నీరౌతున్న వేదనని తెలపటం, చాల touching గా అనిపిస్తుంది. 

ఆ గీత సాహిత్యమంతా చూస్తే గుప్పెడు పదాలే… వాటి సున్నిత అమరికలే…  కాని ఆ కొన్ని పదాలలోనే ఎన్నో అప్రకటిత భావనలు.. ఇంత తక్కువ పదాలతో ఇంత చక్కటి భావాన్ని పలికించటం అనితర సాధ్యం అనిపిస్తుంది.

అందుకే ఈ పాట, అప్పుడూ, ఇప్పుడూ వింటున్నా అదే సంభ్రమాశ్చర్యాలు కలుగుతుంటాయి.

పాట సాహిత్యం ఒక సారి అవలోకించండి. 

నిను  చూడక  నేనుండలేను 
నిను  చూడక  నేనుండలేను 
ఈ  జన్మలో  మరి  ఆ  జన్మలో 
ఈ  జన్మలో  మరి  ఆ  జన్మలో 
ఇక  ఏ  జన్మకైనా  ఇలాగే 
ఏ  హరివిల్లు  విరబూసినా 
నీ  దరహాసమనుకోంటినీ 
ఏ  చిరుగాలి  కదలాడినా 
నీ  చరణాల శృతి  వింటినీ   
నీ  ప్రతి  రాకలో  ఎన్ని  శశి రేఖలో 
నీ  ప్రతి  రాకలో  ఎన్ని శశి రేఖలో 

నీ  జత  కూడి  నడయాడగా 
జగమూగింది  సెలయేరుగా 
ఒక  క్షణమైన  నిను వీడినా 
మది  తొణికింది   కన్నీరుగా 
మన  ప్రతి  సంగమం  ఎంత  హృదయంగమం 
మన  ప్రతి  సంగమం  ఎంత  హృదయంగమం
 
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to గుప్పెడు పదాలలో కొండంత భావమున్న పాట

  1. very nice song.. meeru cheppinadi..aksharaalaa nijam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s