అయినా మనిషి మార లేదు…

అది  ఇంకో దేశం లో మన వాళ్ళు కట్టించిన ఆలయం. శని, ఆదివారాలొస్తే  అక్కడ మన వాతావరణమే.. పండగ కోలాహలమే.. దూర ప్రదేశాల నుండి కార్లలో వచ్చే మన వాళ్ళు.. అందులోనూ అధికులు ఇక్కడి వారే..

అక్కడ ఉన్నన్నాళ్ళూ, ప్రతి వారాంతమూ వెళ్ళే అవకాశం దక్కింది. నన్ను తీసుకెళ్ళే పెద్దాయన ఆ గుడి ధర్మకర్తల్లో ఒకరవటం వలన, ఆ గుడిలో చాలా మందితో పరిచయాలయ్యాయి. కొత్త తెలుగు మొహం కావటంతో, అక్కడి మనవారు  పరిచయాలు చేసుకున్నారు. అందులో  ఒకరు నా పేరు అడిగారు. చెప్పాను. “అది కాదు.. పూర్తి పేరు…” . నా ఇనిషియల్స్ చెప్పాను. “అలా కాదండీ… ఇప్పుడు నా పేరు చూడండి.. …. ఇది నా ఇంటి పేరు.. ఇది నా పేరు..అలా చెప్పండి.” అన్నారు. “మా వైపు పేర్లు చిత్రం గా పెదతారండి. ముందు ఇనిషియల్ మా వూరి పేరు.. రెండో ఇనిషియల్ మా నాన్న పేరు. ఇది కొంచెం తమిళ సంస్కృతి .. కొంత మనది కలిసి, నా పేరు కి రెండు ఇనిషియల్స్ వచ్చాయి.” అని చెప్పాను. “పోనీ అదన్నా చెప్పండి” అన్నారు. వూరి పేరు చెప్పాను. సరే అని తల ఊపి వెళ్ళిపోయారు.

తరవాతి వారం వెళ్ళే సరికి, నన్ను చూసి ముక్తసరిగా హలో చెప్పి అటు నుండి వెళ్లి పోయారు.. ఎందుకంటారు…? (బహుశా ఈ టపా శీర్షిక అందుకే అలా  పెట్టానేమో..)

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

4 Responses to అయినా మనిషి మార లేదు…

  1. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా.. మనిషి మారడు. ఇంకా జాడ్యం ఎక్కువ అవుతుంది అని తెలుసుకున్నారా!? :))))))))))

  2. 13 సంవత్సరల క్రితం నాకు ఇలాంటి అనుభవం ఆయ్యింది. కొంతమంది అయితే మా జిల్లా పేరు చెప్పగానే మల్లీ కనపడితె ఒట్టు.

  3. Wherever they may be,certain people remains2b same,even if they were in America or in Anakapalli.

  4. Dr. Vijayakrishna says:

    Hey Ram…….Hey Ram…. 😦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s