“జర్నీ” చిత్రం పతాక సన్నివేశం ఇలా తీస్తే….?

“జర్నీ” చిత్రంలో తుది సన్నివేశాలలో రెండు బస్సులు డీ కొట్టి  , అందులోని ఒక్కో ప్రయాణికుడికి కలిగే ప్రమాద తీవ్రతను చూపిస్తూ , ఆ ఆక్సిడెంట్ వారి జీవితాలను క్షణం లో ఎలా మార్చేస్తుందో చూపించారు. ఎన్నో “గొప్ప” చిత్రాలను చూసిన తర్వాత ఇలాంటి మరీ నేచురల్ గా వుండే సినిమా చూడాలంటే కష్టమే మరి.. అందుకే పతాక సన్నివేశాన్ని ఇలా మారిస్తే ఎలా ఉంటుందో చెప్పండి.

బస్సులు రెండూ డీ కొట్టేంత దూరం లోకి వచ్చాక, ఒక్క సారి స్లో మోషన్ లో చూపిస్తారు అవి రెండూ దగ్గరకి రావటం… ఇక్కడ నుండి కథ మారుతుంది మన స్క్రీన్ ప్లే లో. ఒక బస్సులో అనన్య, ఇంకో బస్సులో అనన్య ఇష్ట పడే శర్వ, మరో  జంట జయ్, అంజలి ఉంటారు. బస్సు లు ఎలాగూ స్లో మోషన్ లో ఉన్నాయి కాబట్టి, శర్వ (అందర్లోకి తనే established artiste కాబట్టి) ముందు  అలెర్ట్ అవుతాడు. అతడు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసి గట్టేస్తాడు. అంతే కాదు ఎదురుగా వస్తున్న బస్సులో ఉన్న అనన్య ని చూసి (అంత వేగంగా ఎదురుగా వస్తున్న బస్సులో ఎక్కడో కూర్చున్న  అనన్య ని శర్వ ఎలా చూసాడూ అని చచ్చు ప్రశ్నలెయ్యకండి ప్లీజ్. ), తనని ఎలాగైనా రక్షించాలి అనుకుంటాడు. అంతే..   మెరుపు వేగంతో కదులుతూ, వెనక వరసలో కూర్చున్న జయ్ కి చెపుతాడు ” బస్సులు రెండూ డీ కొట్టబోతున్నాయి  .. హీరో లైన మనమే ఏదో ఒకటి చేసి కాపాడాలి. నేను ఈ బస్సు బ్రేకులేస్తాను. నువ్వు ఎదురుగా వస్తున్న బస్సులోకి దూకి, బ్రేకులు వేసి ఎలాగైనా ఆపు .. ఈ ప్రయత్నం లో నాకేమైనా అయితే… ” అని ఆగి ” ఆ బస్సులో ఉన్న ఈ అమ్మాయిని నువ్వే జాగర్తగా చూసుకో ” అని తన మొబైల్ లో ఉన్న అనన్య ఫోటో చూపిస్తాడు.

ఇది జరిగే సమయానికి బస్సులు స్లో మోషన్ లో ఇంకాస్త దగ్గరికి వచ్చేస్తాయి. అందర్లోనూ టెన్షన్..

శర్వ చూపించిన ఫోటో చూస్తూ, జయ్ “నువ్వేం దిగులు పడకు.. నేను ఆ బస్సులోకి దూకి బ్రేకులు వేసి ఎలాగైనా అందరినీ కాపాడతాను.. తరవాత మన రెండు  జంటలూ సంతోషంగా పాటలు పాడుకోవచ్చు” అంటాడు.. situation demanding   కాబట్టి ఇక్కడ ఓ డ్రీం సాంగ్ మొదలౌతుంది.. అందులో రెండు జంటలూ పాటకి స్టెప్పులేస్తారు .. నిర్మాత neo -rich  అయితే పాటని యూరోప్ లో ఇంత వరకూ చూపించని లోకేషన్స్ లో షూట్ చేస్తారు. నిర్మాత just -rich అయితే.. కులు మనాలి లో , poorly – rich అయితే హైదరాబాద్ స్నో వరల్డ్ లో తీస్తే బాగుంటుంది. ఈ సినిమాలో కేవలం ఐదు పాటలు వున్నాయి కాబట్టి, ఈ ఆరోపాట వుంటే ఆడియో సి. డీ కి సరి పడా 6 పాటలు వున్నట్లుంటుంది.

పాట అయ్యిన వెంటనే, హీరో లు action లోకి దిగిపోతారు.. జయ్ ఎగిరి తన బస్సు అద్దాలు బద్దలు చేసుకుని, ఎదురు బస్సు అద్దాలనూ బ్రేక్ చేసి అందులోకి దూకి, అక్కడున్న డ్రైవర్ ని తోసి, తాను స్టీరింగ్ ని ఒక చేత్తో పక్కకి తిప్పుతూ, బ్రేక్ మీద కాలు పెడతాడు(మళ్ళీ ఎందుకు.. ఏమిటి ఎలా అని అడక్కండి)   . బస్సులు అతి దగ్గరగా  వచ్చేసాయి..

ఇంకో బస్సులో శర్వ కూడా బస్సు డ్రైవర్ ని పక్కకి పెట్టి, స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ, బ్రేక్ వేస్తాడు.  ఆ తరవాత ఏం జరిగింది..? అది తెలుసుకోవాలంటే  ఇంకో టపా కోసం ఎదురు చూడండి..చూస్తూ వుండండి..

(ఇది కేవలం నవ్వుకోటం కోసమే… ఎవరినీ ఉద్దేశించి కాదు అని మనవి)

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

4 Responses to “జర్నీ” చిత్రం పతాక సన్నివేశం ఇలా తీస్తే….?

  1. శ్రీ says:

    ఈ సినిమా తెలుగులో తీసి ఉంటే మీరు చెప్పినట్టే అయ్యేది!

  2. Krishna says:

    Hilareous.

  3. Phaneendra says:

    gr8 satire on telugu cinema

  4. Creative direction 4m illution.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s