ఆకాశ్ వాణి.. గిరిమ్పేట్ కేంద్ర్… రాత్ దస్ బజే.. అబ్ “ఛాయా గీత్” సునియే

అప్పట్లో రాత్రి పది అవుతోందంటే … హాస్టల్లో ఎక్కడున్నా నేను నా రేడియో పెట్టె ని పట్టుకుని టెర్రేస్ మీదకి  తుర్రుమనే వాణ్ని. ఎందుకంటే నాకిష్టమైన “ఛాయా గీత్” వచ్చేది అప్పుడే.. ఆ ప్రోగ్రాం లో వచ్చే పాటలన్నీ ఒకే కోవ కి చెందినవి… ప్రతి పాట తరవాత వచ్చే భావ గర్భితమైన వ్యాఖ్యానాలతో ఆ కార్యక్రమం వింటుంటే… చుట్టూ పరుచుకున్న పండు వెన్నెల… దూరంగా ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న దీపాలని చూస్తూ ఓ ఊహా జగత్తులోకి వెళ్లి పోయేవాణ్ని .

ఆ ప్రోగ్రాం లో నేను వినే ఓ మంచి పాట – “వాపస్” చిత్రం లోని “ఏక్ తేరా సాత్ ..హమ్ కో  దో జహా సే ప్యారా హై… తూ హై తో హర్ సహారా హై..” అనే పల్లవితో వచ్చే మొహమ్మద్  రఫీ, లతా పాడిన పాట. ఈ పాట ఏ చిత్రం లోదో కూడా ఇంటర్నెట్ లో వెతికే వరకూ తెలియదు.

కాని ఈ పాట… ఆ పాట తో కూడిన జ్ఞాపకాలు…పాటలు విన్న ఆనాటి వేసవి రాత్రులు.. చుట్టూ ఘనీభవించిన  మౌనాలు… ఇప్పటికీ హృదయ కవాటాలు తెరచుకుని నన్ను స్పృశిస్తూ  వుంటాయి… మెత్తగా.. సుతి మెత్తగా…

పాట వీడియో ఇక్కడ చూడండి. నాకెందుకో ఈ పాట ని దృశ్య రూపంలో కాక… శ్రవణ రూపం లో ఆస్వాదించటమే ఇష్టం.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

5 Responses to ఆకాశ్ వాణి.. గిరిమ్పేట్ కేంద్ర్… రాత్ దస్ బజే.. అబ్ “ఛాయా గీత్” సునియే

 1. శారద says:

  Me too!
  చదువుకునే రోజుల్లో చాయా గీత్ వినడం, మర్నాడు క్రితం రాత్రి వచ్చిన పాటల్ని గురించి చర్చినుకోవటం ఒక మరచిపోలేని అనూభూతి.
  Thanks for refreshing a very pleasant memory.
  శారద

 2. Zilebi says:

  ఛాయా గీత్ లు వినే రోజులు పోయి ఇప్పుడు
  చానళ్ళు బర బర తిప్పి అబ్బే మరీ చికాకు పుట్టి
  అన్నీ టెన్షనే ! ఆ రోజులు మళ్ళీ రావేమో.

  ఛాయా గీత్ , చాయ్ హా, గీత్ యహా

  చీర్స్
  జిలేబి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s