చిరునవ్వు వెల ఎంత…ఈ ఫోటోల విలువంత


చిరునవ్వు  వెల  ఎంత…
ఈ ఫోటోల విలువంత
ఈ ఫోటోల  వెల ఎంత..
సిరులేవి కొనలేనంత..

కొన్ని జ్ఞాపకాలు చిత్తరువులై కనుల ముందు నడయాడుతుంటే… ఆ ఆనందాల విలువ కట్టగలమా.. గత సంవత్సరం.. మా స్కూలు  మిత్రులు కలిసినప్పటి కొన్ని ఫోటోలు ఇవి. ఆ ఫోతోలలోని మిత్రులని చూస్తూ వుంటే.. ఈ ముప్పై ఏళ్ళలో ఒక్కొక్కరు  ఎన్నో దూరాలు పయననించి విభిన్న గమ్యాల బాటలలో ఉన్నారు. ఆ రోజు కలిసిన వాళ్ళలో ఒక ఆటో డ్రైవర్ నుండి చిత్ర రంగంలో ప్రముఖ కోరియోగ్రాఫెర్  వరకూ ఉన్నారు.. ఒకే వేదిక పై కలిసిన అందరూ… ఒక్క సారి వారిప్పుడేమిటీ   అన్న గుర్తుల్ని వదిలేసి… అందరూ ఆ రోజుల్లో ఎలా ఉండేవారో, ఎలా పలకరించుకునే వారో అలా మారిపోయారు.
మా గురువుల రాక కూడా ఆ రోజు మరింత అందాన్నిచ్చింది. కేవలం మొక్కుబడిగా కాక.. ప్రతి సంవత్సరం ఇష్టం గా ఇలా మేమందరం కలుసుకుంటున్నాము. ఇప్పటికి మూడు సార్లు కలిశాం. ఇలా కలవటం మొదలు పెట్టాక, అందరిలో ఓ “sense of belonging ” అనే భావన బల పడింది.  మీరూ వీలైతే ఇలా మీ స్కూలు మిత్రులని కూడగట్టి ఆ రోజుల్లోకి తొంగి చూడండి..Trust my word… it will usher fresh breeze of feel into your life..

ఈ మిత్రుల చిరునవ్వుల వెల ఎంత...?

నాసిక్ నుండి అందరినీ కలవటానికి వచ్చిన సురేష్ గురువుల సమక్షంలో తన స్మృతుల నెమరు

స్వర్ణ ఆధ్వర్యంలో మా క్లాస్మేట్స్( రవి, కలై వాణి , సబితా, గీత, శశి) మా గురువు చార్లీ బాబు ల నృత్యం

మా గురువులతో కొరియోగ్రాఫర్ స్వర్ణ

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

6 Responses to చిరునవ్వు వెల ఎంత…ఈ ఫోటోల విలువంత

 1. Zilebi says:

  మీ మైత్రీ సాయంత్రం బాగుందండీ
  చాలా మంచి పని చేసారు, గత కాలపు స్మృతుల స్మరణ ల తో, మీ గురువుల సమక్షం లో.

  చీర్స్
  జిలేబి.

 2. chaalaa baagundi. jnaapakaala chitra toranam. keep it up..

 3. Dileep says:

  edo 5 years leka 10 years tharuvaatha ante sare. Mari 30 years tharuvaatha kalusukunnarante, chaala santhoshangaa vundandi. Meeru me snehaaniki ichina viluva artham avuthondi….

 4. Dear Jns, the credit of reunion of 30 years friends goes2u. By satechamanlal.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s