నువ్వు వస్తావని… మిత్ర బృందం ఎదురు చూసేను..

ఆ అబ్బాయి బాగా చదివే వాడు. అంతేనా అంటే… అంతే కాదండి… అతి కఠినతరమైన పరిస్థితులలో చదువుకోవాల్సిన  స్థితి.  బయట ఎన్ని కష్టాలున్నా … ఒక్క సారి మా క్లాసులో ఉన్నాడంటే చాలు… పూర్తిగా చదువు పైనే శ్రద్ధ… మాకు ఎనిమిదో తరగతిలో కొత్త లెక్కల టీచర్ వచ్చారు. తీసుకున్నది composite గణితం.. ఆ పుస్తకం సైజు చూస్తూనే మాకు గుండెలు జారిపోయాయి. ఆ కొత్త టీచెర్ బాగా కష్ట పడాల్సి వచ్చేది మాకు చెప్పటానికి. కాని ఆ అబ్బాయి ఎంత క్లిష్టమైన లెక్కనైనా ఇట్టే సులువుగా చేసే వాడు. ఒక విధంగా చెప్పాలంటే… తనో జీనియస్. ఎప్పుడూ తనదైన  లోకం లో ఉండేవాడు.

ఒక్కో సారి మా టీచర్ ఏదైనా ప్రాబ్లం solve చేయలేనపుడు , తన దగ్గర చెప్పించుకుని మా అందరికీ explain చేసేది.  తను ప్రాబ్లెం చేసే పద్ధతి ఇప్పటికీ నాకు గుర్తే.. కాళ్ళు రెండు వెనకకి చాపి, ప్రాబ్లం లో లీనమై పోయేవాడు.. అలా లీనమైనప్పుడు నాలుక ఒక వైపు బయట పెట్టి, కాగితం మీద పెన్ను తో గట్టిగా అదిమి పెట్టి రాస్తూ, ప్రాబ్లెం సాల్వ్ చేసే వాడు.

బహుశా, నేను చదువు విషయంలో ఎవరి పట్ల అయినా అసూయ చెందానూ అంటే, అది తన విషయం లోనే.. మా నాన్న అప్పుడప్పుడూ తన గురించి చెపుతూ ” ఆ అబ్బాయి ఎన్ని కష్టాలున్నా, ఎంత చక్కగా చదువుకుంటున్నాడో    చూసి నేర్చుకో” అని హిత బోధ చేసేవాడు.

ఒక విధం గా చెప్పాలంటే అతడంటే మా క్లాస్ మేట్స్ అందరికీ ఓ ఆరాధనా భావం ఉండేది. అంతే కాదు… మూడు సంవత్సరాల ముందు మా బాల్య మిత్రులు కలిసినప్పుడు కూడా, అందరూ తన గురించి వాకబు చేసారు. తను వస్తాడని చూసాము. కాని ఎందుకో మూడు సార్లూ రాలేదు.. ఇప్పటికీ తనంటే అందరికీ ఆ ఆరాధనా భావం అలాగే ఉంది… నా అసూయ తో సహా..:-) 

నేను అతడిని చూసి ఇరవై ఐదు సంవత్సరాలై  వుంటుంది. ఈ సంవత్సరమైనా అందరూ కలిసినప్పుడు, అతడు రావాలని అందరూ కోరుకుంటున్నారు.. ఈ బ్లాగు అతడు కూడా చూస్తున్నాడు.. కాబట్టి మిత్రుల ఆప్యాయతని అర్థం చేసుకుని అతడు ఈ సారి మన మిత్ర బృందాన్ని కలుస్తాడని ఆశిస్తున్నాను  
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to నువ్వు వస్తావని… మిత్ర బృందం ఎదురు చూసేను..

  1. Dileep says:

    mee mithrudu eesaari thappakunda vasthaadani aashistunnaamu….

  2. I hope this time he will not miss the opurtunity2meet all of us. My best wishes2him&his family.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s