శత్రు దుర్భేద్య కుడ్యానికి వందనాలు..

క్రికెట్ లో అతడి ఆట ఎంత హుందాగా ఉంటుందో, అతడి వ్యక్తిత్వం కూడా అంతే హుందాగా ఉంటుంది. వివాద రహితుడు… కీర్తి తో మనిషిలో వచ్చే మార్పుల ప్రలోభానికి లొంగనివాడు  .. కెప్తెన్సీ ని కూడా  త్యజించినవాడు.. జట్టు కు ఒక అదనపు బాట్స్ మాన్ కోసం, వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కూడా జట్టు అవసరాల కోసం చేసే పూర్తి టీం మాన్…. మాటల్లో సరళత… సౌమ్యత.. స్పష్టత.. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ జీవితం నుండి విరమణ తీసుకున్న రాహుల్ ద్రావిడ్ గురించి.

జట్టు కోసం ఎన్నో సార్లు విలువైన ఇన్నింగ్స్ ఆడిన ద్రావిడ్ ని ఒక క్రీడా కారుడిగా, ఒక నిరాడంబరమైన పరిపూర్ణ వ్యక్తిగా ఇంకొకరు భర్తీ చేయటం అసాధ్యమే.. ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడినా, తనకి నిజమైన గుర్తింపు వచ్చిందో లేదో చెప్పటం అస్పష్టమే..1996 లో గంగూలీ, ద్రావిడ్ లు టెస్టుల్లో అరంగేట్రం  ఇంగ్లాండ్ లో చేసినప్పుడు, అందరికీ debute లో సెంచరీ చేసిన వ్యక్తిగా గంగూలీ గుర్తుకొస్తారు కాని అదే ఇన్నింగ్స్ లో ఇంకో ముఖ్యమైన ఇన్నింగ్స్   చేసి సెంచరీ కి కేవలం 5 పరుగుల దగ్గర అవుటైన ద్రావిడ్ గుర్తు రాక పోవచ్చు.

ఆస్ట్రేలియా పై చారిత్రాత్మక విజయం సాధించిన కోల్కతా 2001 టెస్టు అనగానే గుర్తొచ్చేది అణి ముత్యం  లాంటి ఇన్నింగ్స్ ఆడి 281 పరుగులు సాధించిన లక్ష్మణ్.. కాని అదే ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ తో పాటు ఆడి 180 పరుగులు సాధించిన ద్రావిడ్ ఇన్నింగ్స్ ఎంత మందికి గుర్తుందో..?..  ఇలాంటి ఎన్నో దృష్టాంతాలు.

ద్రావిడ్ నిష్క్రమణతో ఒక అధ్యాయం  ముగిసినా , ఆ అధ్యాయం నుండి  ముందు తరాల  క్రికెట్ ఆటగాళ్ళు  అనుసరణీయమైన వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను, క్రీడా స్ఫూర్తిని నేర్చుకోవాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to శత్రు దుర్భేద్య కుడ్యానికి వందనాలు..

  1. krish says:

    True Legend… in the Cricket world

  2. Unfortunately, good Crickters are not getting the fame they deserve as compared to Record Hunters.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s