ముప్పై ఐదేళ్ళ నాటి ఓ జ్ఞాపకం

గడిచి పోయే కాలం విలువ మధ్య వయసులోకొచ్చాక  కాని తెలియదేమో.. ఎందుకంటే, నెమరేసుకోటానికి  ఓ గతం, ఎదురుచూడటానికి ఓ అంతం మొదలయ్యేది ఈ నడి వయసు దశలోనే…

అలాంటి దశలో  మనసుని తాకి వెళ్ళే ఓ జ్ఞాపకమే ఇది కూడా.. ముప్పై ఐదేళ్ళ కిందట..ఆరవ తరగతి మార్కుల జాబితాని మా క్లాస్ టీచెర్ శ్రీమతి శకుంతల మేడం గారి దస్తూరి లో తెచ్చుకున్నాను. అది అప్పట్లో మంచి మార్కులని ఓ నమ్మకం. కాని ఇప్పుడా కాగితం యొక్క జ్ఞాపకాల విలువ అందులోని మార్కుల కన్నా ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా ఫ్రెండ్స్ ముప్పైఏళ్ళ తర్వాత 2009 లో కలిసినప్పుడు శకుంతల మేడం గారు వచ్చి అందరినీ ఆశీర్వదించారు. వారి అబ్బాయి ఎల్. కే పురుషోత్తం మా క్లాస్ మేట్.

సంతకం చేసిన ప్రధానోపాధ్యాయులు, ఎస్. జయదేవ రావు గారు. ఈ మధ్యనే స్కూలు వందేళ్ళ ఉత్సవం లో వారికి సన్మానం జరిగింది. ఇంగ్లీష్ లో tenses చెప్పటానికి rama killed ravana అనే ఉదాహరణ తీసుకుని వివిధ tenses లో ఎలా రాయాలో, వాటి అర్థం ఎలా మారుతుందో, విశదీకరించి చెప్పే వారు. అప్పటి వరకూ ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవటానికి కష్టపడుతున్న ఒక విద్యార్ధి కి ఈ ఒక్క exercise ద్వారా ఇంగ్లీష్ భాష పట్ల ప్రాధమిక అవగాహన కలిగి తరవాత, ఇంగ్లీష్ లో ముందంజ వేయటానికి ఉపయోగ పడింది. ఆ విద్యార్థి దేశం లో ఒక ఉత్తమ సంస్థ లో వైద్యులుగా ఉన్నారు. జయ దేవ రావు గారి గురించి చెప్పగానే,  తను ముందుగా గుర్తు చేసుకున్న  నలభై ఏళ్ళ నాటి జ్ఞాపకం ఇదే. ఒక మంచి గురువు వెలిగించే విద్యా జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు అనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే..
Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

6 Responses to ముప్పై ఐదేళ్ళ నాటి ఓ జ్ఞాపకం

 1. మంచి జ్ఞాపకం. బాగుంది…రామకృష్ణ గారు.
  మీరన్నట్లు..నెమరేసుకోటానికి ఓ గతం, ఎదురుచూడటానికి ఓ అంతం మొదలయ్యేది ఈ నడి వయసు దశలోనే…
  నిజమే!

 2. Zilebi says:

  అమ్మోయ్, మీరు అన్ని సబ్జెక్ట్స్ లోనూ టాపర్ లా ఉన్నట్టు ఉన్నారు !

  మీతో కొంచం కేర్ఫుల్ గా నే ఉండాలి సుమా !

  చీర్స్
  జిలేబి.

  • mhsgreamspet says:

   వనజ గారు.. మీ వ్యాఖ్యలు ఎప్పుడూ encouraging గా ఉంటాయి.. ధన్యవాదాలు..

   జిలేబి గారు … రవి గాంచని చోట కవి గాంచును. కవి గాంచని చోట…? ఆ పేపర్ లో నాకు జ్ఞాపకాలు మాత్రమే కనపడ్డాయి సుమీ. ధన్యవాదాలు 🙂

 3. murali says:

  జిలేబి గారు ఆ మార్కులను రి కౌంట్ చేయాలనీ డిమాండ్ చేద్దామా ?

 4. Dear Ramakrishna, what a memorable thing u secured after a gap of 35years.It’s really a wonderful. Thanks4recollection of memories.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s