మానవ సంబంధాలలో స్తబ్దత ఎందుకు వస్తుంటుంది?

నేను యు. జీ. చదువుకునే రోజుల్లో మన వూరి నుండి నా ఫ్రెండ్ వేణు పంపిన ఓ గ్రీటింగ్ కార్డు పై  సందేశం  ఇప్పటికీ  గుర్తే.. అదేమంటే…

“True friendship exists when the silence between two people is comfortable”

అనుకుంటాం కాని మౌనంగా  కూడా ఎన్నో మాటలు చెప్పొచ్చు.. నిజమైన స్నేహితులు రోజూ పూసుకు తిరగక్కరలేదు.. ఫోన్ల మీద గంటల తరబడి  మాటలాడక్కర్లేదు.. ఎక్కడ వున్నా తన గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు అన్న ఊహ… ఒక్క భరోసా… ఉంటె చాలు…

వేణు, నా గురించి ఒక్క మాట చెప్పాలి. మేము బహుశా సంవత్సరంలో కేవలం  ఓ మూడు నాలుగు సార్లు మాటలాడుకోవచ్చు..  కాని ఏప్రిల్ 29 వస్తూనే.. నేను అతడి గురించి తప్పక విష్ చేస్తాను… మొబైల్ లేని రోజుల్లో, గ్రీటింగ్ పంపడం మరిచినా ఆ రోజు తప్పక తను గుర్తు వస్తారు. అది తనకీ తెలుసు.. అలాగే october వచ్చిందంటే.. తనకి నేను తప్పక గుర్తు వస్తాను (గ్రీటింగ్ పంపకున్నా ..) … అది నా భరోసా..

ఇప్పుడు స్నేహానికి ఇంకో పార్శ్వం లోకి వస్తాను.. చాల స్నేహాలు.. చూస్తే.. చాలా demonstrative గా వారి అభిమానం అనుక్షణం ఓ ఎస్. ఎం. ఎస్ ద్వారానో.. ఓ ఫోన్ కాల్ ద్వారానో.. ఓ మంచి గిఫ్ట్ ద్వారానో.. ఇలా నిరంతరం వ్యక్తీకరిస్తుంటాము.. ఇంత డెమో ఉన్నంత మాత్రాన, ఇది నిఖార్సైన స్నేహం అని చెప్పలేము. ఒక్కో సారి, ఇలాంటి సంబంధాలలో ఏదైనా కారణాల వలన వచ్చే స్తబ్దత comfortable కాదు కదా.. అతి బాధాకరం అవుతుంది..

కొన్ని స్నేహాలు  euphoric గా మొదలౌతాయి కాని అంతే వేగంగా retreat అవుతాయి , కడలి  తరంగాల లాగ..

ఇలాంటి స్నేహాలు ఎందుకింత volatile గా వుంటాయి అన్న దానికి కారణాలేమిటి అని చెప్పేంత వాణ్ని కాక పోయినా.. నాకు తెలిసిన కొన్ని కారణాలు.. మనిషిని వీడని అహం, “ఇచ్చుటలో వున్న హాయి వేరెచ్చటనూ  లేనే లేదని…” అన్న ఫీలింగ్ కొరవడటం (ఇరువైపుల నుండి). ఒక్కో సారి, బాగా  పెనవేసుకున్న సంబంధాలు వికటిస్తే… “అనుబంధం ఆత్మీయత … అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తి కై మనుషులు ఆడుకునే నాటకం… వింత నాటకం.. ” అని పాడుకునేటంత desperation కి వచ్చే ప్రమాదమూ వుంది.

నిజమైన స్నేహం లో కోపాలుంటాయి … అల్లర్లుంటాయి .. అపార్థాలూ  వుంటాయి.. కాని.. అన్నీ  కదిలే  కారు  మేఘాల్లాగా క్షణంలో వర్షిన్చేసి… నిర్మలమైన ఆకాశంలా మళ్ళీ మారిపోతుంటాయి.. ఇలాంటి వాటికి ఓ ఉదాహరణ.. ఆ మధ్య ఎపుడో ఓ ఫ్రెండ్ ని అనాలోచితంగా హర్ట్ చేశాను అనిపించింది.. కారు మేఘాలు విడి పోయాక.. ఓ ఎస్. ఎం. ఎస్ పంపాను apologetic గా.. తను పంపిన రిప్లై సందేశం లో కేవలం నాలుగు  పదాలున్నాయి.. “నువ్వే కదా.. నన్నే కదా. ” Can there be a better expression of friendship than this..?


This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

7 Responses to మానవ సంబంధాలలో స్తబ్దత ఎందుకు వస్తుంటుంది?

 1. చాలా బావుంది. ఇంక చెప్పడానికి మాటలేం లేవు.

 2. శర్వాణి says:

  బాబోయ్ ! ఎంత బాగా చెప్పేరు ! ” నువ్వె కదా.. నన్నే కదా.. ” – అద్భుతం !

 3. Sarath "kaalam' says:

  “నువ్వే కదా.. నన్నే కదా”

  బావుంది.

 4. బాగా చెప్పారు! నువ్వే కదా నన్నే కదా నిజంగా ఒక అద్భుతమయిన భావన!

 5. rajiv raghav says:

  చాలా బాగా చెప్పారండీ..
  “ఎక్కడ యున్న మన గురించి అలోచించే ఒక వ్యక్తి యున్నారు”.. అనే ఫీలింగ్ నిజంగా చాలా గొప్పది..
  అది ఓ గొప్ప టానిక్ లా పనిచేస్తుంది మనకి..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s