నా డ్రైవింగ్ ప్రహసనాలు

పెద్దయ్యాక  కూడా నాకు అద్భుతంలానే తోచే ఓ అంశం- కారు డ్రైవింగ్. సినిమాల్లో ఒక చేతిలో సిగరెట్టు తో… పక్కన హీరోయిన్ తో మంద హాసం తో మాట్లాడుతూ… ఇంకో చేత్తో స్టీరింగు వీలుని తిప్పుతూ, నెత్తిన విగ్గు తాలూకు ముంగురులను సవరించుకుంటూ ఠీవిగా వెలిగే ఆ కాలం హీరో అంటే హెంత ఆరాధనా భావమో! అబ్బ… ఎంత అలవోక గా డ్రైవింగ్ చేస్తున్నాడు కదా అని.. అప్పట్లో ఏ నవల చదివినా… ఆరడుగుల హీరో… ఎప్పుడూ తను తిరిగే కారు  వర్ణనలే ఉండేవి.. అందుకే కారన్నా.. ఆ డ్రైవింగ్ అన్నా ఓ అబ్బురం.

ఎంతో  కాలం తరవాత.. కారు డ్రైవింగ్ నేర్చుకునే సమయం ఆసన్నమయింది.. డ్రైవింగ్ స్కూలు కెళ్ళాను.. మొదటి రోజు కావటం తో బెరుగ్గా వుంది.. ఎప్పుడూ ఆకాశంలో తిరిగే విమానం ఒక్క సారి కళ్ళ ముందు కనపడితే ఎలాగైతే చిత్తరువై తత్తరపడి బిత్తర  పోతామో… అలా   అయిపోయాను  ఆ రోజు..

కిళ్ళి వేసుకుని నములుతూ.. సగం మాటలు రసాస్వాదనలో మునిగి పోతున్న మా గురువు గారు, వెనక చక్రం తిరగని  శ్రీ మహా విష్ణువల్లె కనపడ్డాడు ఆ క్షణాన. తను పక్కన కూర్చొని, నన్ను డ్రైవింగ్ సీటు  ముందు కూర్చోపెట్టాడు.. ‘కారులో  నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏ, బీ, సి అంతే.. అవి గుర్తుంటే.. కారు డ్రైవింగ్ వచ్చేసినట్లే..’  అన్నాడు.. ‘ఓస్ ఇంతేనా.. మరి ఏ, బీ, సి ఏంటి చెప్మా” అని మధన పడుతున్నంతలోనే, తనే చెప్పాడు మందహాసంతో..” ఏ అంటే (అమలాపురం కాదు, యూ సిల్లీ) యాక్సిలరేటర్ , బీ అంటే బ్రేక్ , సి అంటే క్లచ్… ఈ మూడింటినీ కంట్రోల్ చేస్తూ, స్టీరింగ్ తిప్పటమే కార్ డ్రైవింగ్’ అన్నాడు.

ఇక డ్రైవింగ్ ప్రాక్టీసు  మొదలయింది.. అద్భుతం.. అత్యద్భుతం.. నా డ్రైవింగ్ నా ప్రమేయం  లేకుండానే  smooth గా సాగింది. మా గురువు గారు అన్ని కంట్రోల్స్ తనే చేసారని తెలిసాక, ఉసూరుమంది ప్రాణం..

మరుసటి రోజు, బాగా రద్దీ ఉన్న రోడ్డు పైకి వెళ్లి పోయాం.. అంత జన ప్రవాహం చూసి నేను బిగుసుకు పోయాను… ప్రతి చోటా.. “క్లచ్ నొక్కు … గేర్ మార్చు.. ఆక్సిలరేటరు  పెంచు.. బ్రేక్ వెయ్యి… అరె… ఎన్ని సార్లు చెప్పాలి సాబ్..” అని తను చెప్పే కొద్ది ఇంకా కంగారు పెరిగిపోయింది.. ఒక్కో సారి నేను నిమిత్త మాత్రుణ్ణి అయిపోయే వాణ్ని… తనే గబా గబా.. గేర్ లీవర్ తో గేర్లు మార్చే వాడు..” ఒకటి.. రెండు.. మూడు..” ఈ గేర్లు ఎప్పుడు ఎలా  వేయాలి అన్న విషయం బ్రహ్మ పదార్థంగా మారిపోయింది  నాకు.

ఓ  రోజు ఓ చోట యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఆ రోజుల్లో చూసిన సినిమా గుర్తొచ్చి స్టీరింగ్ ని సుతారంగా తిప్పుతుంటే… అదిరి పడ్డ  మా గురువు గారు.. నా మీద పడి.. స్టీరింగ్ ని బర బారా తిప్పి యూ టర్న్ పూర్తి చేసాడు.. స్టీరింగ్ తిప్పట మంటే ఇంత మొరటుగా ఉంటుందా అని మొదటి సారి తెలిసింది ఆనాడు..

ఈ ప్రహసనం ఒక నెల గడిచినా , గురువు గారు ఆశించిన విధం గా ఈ విద్యార్థి పురోగతి సాధించః లేక పోయాడు.. ” సాబ్.. మీకు నేర్పటం చాల కష్టం” అని తేల్చాడు.. నేను మెల్లగా గొణిగాను..”నేను కారు నడపటం నేర్చుకోక పోయినా ఇంకోటి నేర్చుకున్న మీ దయ వలన” అన్నాను..

“వో క్యా  హై” అని చూసాడు  నా వైపు గురువుగారు..

“అదే ….. ట్రక్కు తోలటం” అన్నాను తను స్టీరింగ్ తిప్పటం, గేర్ లీవర్ మార్చటం గుర్తు తెచ్చుకుంటూ..

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to నా డ్రైవింగ్ ప్రహసనాలు

  1. :)))))
    కారు డ్రైవింగ్ నేర్పే లోపు ట్రక్కు డ్రైవింగ్ వచ్చేసిందన్నమాట. .. బావుంది. కొంతమంది డ్రైవింగ్ స్కూల్స్ వారు.. డబ్బు కోసం త్వరగా డ్రైవింగ్ నేర్పరు.అది మీకు అనుభవమైనది.అనుకుంటాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s