మా మాల్గుడి – గిరింపేట

ఆర్. కే. నారాయణ్ గారి ప్రతి కథ మాల్గుడి అనే ఊహాజనిత వూరి చుట్టూ అందులోని వ్యక్తుల జీవితాల చుట్టూ ఎలా అల్లుకుని వుంటుందో గుర్తుంది కదా?… అలాంటి ప్రదేశమే మా గిరిం పేట.. మేము చదువుకున్న స్కూలు, మా క్లాస్ మేట్స్ తమ బాల్యపు గుర్తుల్ని ఇప్పటికీ గుర్తు తెచ్చే ఓ చిన్న వీధుల సముదాయం ఈ గిరిం పేట. అసలు ఈ ప్లేస్ పేరు గ్రీమ్స్ పెట్.. బ్రిటిష్ కాలం లో గ్రీమ్స్ అనే కలెక్టర్ గుర్తు గా ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారట.

“యేరు పక్క మా ఊరమ్మ… వూరు పఅక్క మాగాణమ్మ.. వూరు రేపల్లె …” అనే పాటల వర్ణనకి ఈ ప్రదేశం సరి తూగకపోయినా.. గిరిం పేట లో పెరిగిన మా అందరి స్మృతి పరిమళాలు చికాగో నుండి చిత్తూర్ వరకూ ఇప్పటికీ గుబాళిస్తూనే వున్నాయి.

మా స్కూలు… దగ్గరగా  గీత మందిర్ .. అందులో  వుండే   మా కమల మేడం, వారి పిల్లలు, స్కూలు ఎదురుగ్గా పగడమాను వీధి, అందులో వుండే మా క్లాస్ మేట్స్, కే. కే.(కే. కృష్ణ  ప్రసాద్), ఇప్పుడు యూ. ఎస్ లో ఉన్న విజయ కృష్ణ, రఘు రాం, రాజ గోపాల్.. అక్కడే ఉన్న లవ కుమార్, పట్టాభి , మురుగన్  గుడి .. వేలూర్ రోడ్ లో వుండే మా పరమేశ్వరి మేడం, రామ చంద్ర ఇల్లు.., దుర్గమ్మ గుడి, గంగా సాగరం నుండి వచ్చే నాగేశ్వర్ రావు, శ్రీ రాములు, కొత్త పల్లి నుండి వచ్చే మా సూరి బావ, వేలూర్ వెళ్ళే బస్సులు గిరిం పేట దగ్గర ఆగే చోటు లో పూల అంగళ్లు, ఎప్పుడూ సండిగా వుండే లతా కేఫ్, అటు వైపే ఉన్న కాజూర్ రోడ్డు.. విద్యుత్ నగర్.. అక్కడ నేనూ, రామచంద్ర ఆడుకున్న ప్రదేశాలు..స్కూల్  కి ఆనుకుని వుండే రమేష్ జెనెరల్ స్టోర్స్.. మంచి నీళ్ళ  కోసం, దుర్గ నగర్ నుండి సైకల్ పై తీసుకొస్తున్న నీళ్ళ కాన్ లు ..ఇలా ఎన్నో.. ఇప్పటికీ కళ్ళకి  కట్టినట్లు  గా కనిపిస్తుంటాయి.

మా వూళ్ళో బాగా నచ్చే అంశమేంటంటే .. కాల  ప్రవాహం లో వీటి ఆనవాళ్ళు  ఇప్పటికీ ఎక్కువగా మార లేదు.. వూరు వెళ్ళిన ప్రతి సారి ఈ ప్రదేశాలను వో సారి చుట్టి వస్తాను.. అప్పటి నేస్తాలతో.. యాంత్రిక జీవనం లోంచి బయటపడి రీ చార్జ్ కావటానికి అలాంటి క్షణాలు ఎంతగానో ఉపయోగ పడతాయి.

 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

6 Responses to మా మాల్గుడి – గిరింపేట

 1. chinni says:

  మన స్కూల్ కి కుంచం పక్క వీధిలో చిన్ని వాళ్ళ ఇల్లు(అని అన్నారు ) అని చెప్పరే !మాల్గుడి డేస్ తో పోలిక నిజంగా నిజం …జ్ఞాపకాల పరిమళాలు హ్మం !

  • mhsgreamspet says:

   చిన్ని గారు..

   నిజమేనండి… మీ ఇల్లూ స్కూల్ వెనక వైపు వుండేది కదూ.. మరచితిని… క్షంతవ్యుడను… వ్యాఖ్యకు ధన్యవాదాలు. …రెండు చుక్కలు- ఓ అడ్డ గీత- ఓ కుండలీకరణి

 2. Ramakrishna,hats off for your remembarence&recollecting all golden moments,which are unforgetable to all of us.

 3. మీ జ్ఞాపకాలు,పోలిక చాలా బాగున్నాయి.
  మాల్గుడి కథలు తెలుగు అనువాదం ప్రచురణ ఎవరిదో చెప్పగలరా? (పబ్లిషర్)

  • mhsgreamspet says:

   vanaja gaaru
   thnx 4 comments. “మాల్గుడి కథలు” ప్రచురణ కర్త గురించి తెలియదండి. తెలిసిన వెంటనే చెపుతాను
   prasanna
   thnx 4 ur comment

 4. Kona Ravi Kumar says:

  nicely remembered those days BOSS !!! but again you were not mentioned my name !!!!!????//// ravi kumar kona

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s